![]() |
AP Board Class 9 Telugu Chapter 6 ప్రబోధం Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 9th Telugu Chapter 6 ప్రబోధం Book Answers |
Andhra Pradesh Board Class 9th Telugu Chapter 6 ప్రబోధం Textbooks Solutions PDF
Andhra Pradesh State Board STD 9th Telugu Chapter 6 ప్రబోధం Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 9th Telugu Chapter 6 ప్రబోధం Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 9th Telugu Chapter 6 ప్రబోధం solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 9th Telugu Chapter 6 ప్రబోధం Textbooks. These Andhra Pradesh State Board Class 9th Telugu Chapter 6 ప్రబోధం Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.Andhra Pradesh State Board Class 9th Telugu Chapter 6 ప్రబోధం Books Solutions
Board | AP Board |
Materials | Textbook Solutions/Guide |
Format | DOC/PDF |
Class | 9th |
Subject | Maths |
Chapters | Telugu Chapter 6 ప్రబోధం |
Provider | Hsslive |
How to download Andhra Pradesh Board Class 9th Telugu Chapter 6 ప్రబోధం Textbook Solutions Answers PDF Online?
- Visit our website - Hsslive
- Click on the Andhra Pradesh Board Class 9th Telugu Chapter 6 ప్రబోధం Answers.
- Look for your Andhra Pradesh Board STD 9th Telugu Chapter 6 ప్రబోధం Textbooks PDF.
- Now download or read the Andhra Pradesh Board Class 9th Telugu Chapter 6 ప్రబోధం Textbook Solutions for PDF Free.
AP Board Class 9th Telugu Chapter 6 ప్రబోధం Textbooks Solutions with Answer PDF Download
Find below the list of all AP Board Class 9th Telugu Chapter 6 ప్రబోధం Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:9th Class Telugu 6th Lesson ప్రబోధం Textbook Questions and Answers
చదవండి-ఆలోచించండి-చెప్పండి
గాంధీజీ ఒక సభలో ఇలా సందేశమిచ్చారు. ‘స్వరాజ్య సాధన స్త్రీల చేతుల్లోనే ఉంది. మీమీ పనుల్లో మీరు నిష్ణాతులు కండి. స్త్రీలు పిరికివారు, బలహీనులు అనే సామాన్యుల వాదాలు మిథ్య అని రుజువు చేయండి. స్త్రీలకు సామాజిక స్పృహ ఉండాలి. వారికున్న నైతికబలం సామాన్యమైంది కాదు. ఈ ‘అంతశ్శక్తి’ పై ఆధారపడ్డప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ కూడా ఆమెను ఓడించలేదు”.
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
‘స్వరాజ్య సాధన’ ఎందుకు అవసరం?
జవాబు:
భారతదేశం స్వతంత్ర్యాభివృద్ధిని సాధించడం కోసం ‘స్వరాజ్య సాధన’ అవసరం.
ప్రశ్న 2.
సామాన్యుల మిథ్యావాదం ఏమిటి?
జవాబు:
స్త్రీలు పిరికివారు, బలహీనులు అనేది సామాన్యుల మిథ్యావాదం.
ప్రశ్న 3.
స్త్రీలలో ఉన్న “అంతశ్శక్తి” ఏది?
జవాబు:
వారి నైతికతే వారి “అంతశ్శక్త.”
ప్రశ్న 4.
స్త్రీల గురించి గాంధీజీ కి ఉన్న అభిప్రాయాలు ఏమిటి?
జవాబు:
స్వరాజ్య సాధన స్త్రీల చేతుల్లోనే ఉంది. వారి పనుల్లో వారు నిష్ణాతులు కావాలి.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.
ప్రశ్న 1.
‘స్త్రీల విద్యాభివృద్ధికి బాల్య వివాహాలు ప్రతిబంధకములు’ దీనిపై మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
చిన్న వయస్సులోనే వివాహం చేయటం వల్ల స్త్రీల విద్యాభివృద్ధి కుంటుపడుతుంది. పెళ్ళైన పిల్లల్ని పాఠశాలకు పంపడానికి పెద్దలు ఇష్టపడేవారు కాదు. పెళ్ళి కుదిరిన తరువాత ఆడపిల్లలు చదువుకు స్వస్తి పలికేవారు.
ప్రశ్న 2.
“స్వశక్తిచేత” ఏ పనులనైనా సాధించవచ్చు? నిజమా ? కాదా ? వివరించండి.
జవాబు:
స్వశక్తితో ఏ పనులనైనా సాధించవచ్చు. ఇది నిజమే ఇతరులపై ఆధారపడితే వారికి అవకాశం ఉన్నప్పుడే మన పనుల్ని చేసుకోగలం.
ఆ) పాఠం ఆధారంగా కింది వాటికి సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘లేఖ’ ను ఎవరు రాశారు? ఎవరికి రాశారు?
జవాబు:
లేఖను ‘శారద’ అనే పేరుతో కనుపర్తి వరలక్ష్మమ్మ గారు రాశారు. కల్పలత అనే ఆమెకు రాస్తున్నట్లుగా ‘గృహలక్ష్మి’ పత్రికకు రాశారు.
ప్రశ్న 2.
సభలో ఉపన్యసించిన వారెవరు? సభకు అధ్యక్షురాలు ఎవరు?
జవాబు:
సభలో ఉపన్యసించినది శ్రీమతి సరోజినీ దేవిగారు. సభకు అధ్యక్షురాలుగా నెమలి పట్టాభి రామారావు పంతులుగారి కుమార్తె శ్రీమతి పద్మావతిదేవి గారు.
ప్రశ్న 3.
ఢిల్లీ మహిళాసభవారు చేసిన తీర్మానాలు ఏవి?
జవాబు:
ఢిల్లీ మహిళాసభవారు స్త్రీలకు సంబంధించిన పెక్కు తీర్మానాలు చేశారు. వాటిలో కొన్ని బాలబాలికలకు విధిగా విద్య నేర్పించాలి. స్త్రీలకు నియోజక, నియోజిత స్వాతంత్ర్యము సాధించుట. అతి బాల్య వివాహము అనర్థకమని ప్రచారం చేయుట.
ప్రశ్న 4.
స్త్రీలకు ఎన్నిక హక్కులు లభించడం వల్ల కలిగిన ఫలితాలేవి?
జవాబు:
స్త్రీలకు ఎన్నిక హక్కులు లభించడం వల్ల మదరాసు రాష్ట్ర శాసనసభకు ఒక స్త్రీ డిప్యూటీ ప్రెసిడెంటుగా ఎన్నుకొనబడింది. తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రిణిగా నియమింపబడింది. సమర్థురాలుగా పేరుపొందింది. ఇంకా చాలా స్థానిక సభల్లో, విద్యా సంఘాల్లో స్త్రీలు సభ్యులుగా నియమించబడుతున్నారు.
ప్రశ్న 5.
తనువే పుణ్యక్షేత్రముగా చేసుకొనవచ్చునని సరోజినీదేవి చెప్పిన అంశాలేవి?
జవాబు:
భూతదయ కలిగిఉండటం. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడటం. జాతిమత భేదాలు పాటించక విశ్వ మానవులందరిని సోదరులుగా భావించడం, అకల్మషమైన హృదయాన్ని కలిగి ఉండటం. వీటి వల్ల మన శరీరాన్నే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చు. నిజానికి జీవితమే ఒక యాత్ర. సంస్కరించబడని మనస్సుతో ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు.
ఇ) కింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
మలాలా యూసుఫ్ జాయ్ ఈ తరం బాలికల నూతన స్ఫూర్తికి ప్రతినిధి. మలాలా పాకిస్థాన్ లోని స్వాత్ లోయ మింగోరా పట్టణంలో 12 జులై, 1997లో జన్మించింది.
చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఆసక్తిగల మలాలా తమ ప్రాంతంలోని ప్రతికూల పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడింది. అక్కడి ప్రభుత్వంపై ఆధిపత్యం వహిస్తున్న తాలిబాన్ ఛాందసవాదులు బాలికలు పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడంపై నిషేధం విధించారు. మలాలా ఏ మాత్రం భయపడకుండా చదువుకొంటూనే తన తోటి బాలికలకు చదువుపై ఆసక్తిని పెంచి పాఠశాలకు వెళ్ళేటట్లుగా ప్రోత్సహించింది. దీంతో ఆగ్రహించిన తాలిబాన్లు మలాలాపై 9 అక్టోబర్ 2012న కాల్పులు జరిపారు. ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మలాలాపై సానుభూతి వెల్లువెత్తింది. అందరూ ఆమె కోలుకోవాలని కోరుకున్నారు.
ఆమె ప్రాణాపాయ స్థితి నుండి బయటికి వచ్చింది. మలాలా చైతన్యానికి, సాహసానికి, ఆత్మ సైర్యానికి ముగ్ధులైన ఐక్యరాజ్య సమితి ఆమె జన్మదినాన్ని (జూలై 12ను) ‘మలాలా రోజు’ (Malala Day) గా జరుపుకోవాలని ప్రకటించింది. ప్రతీ బాలిక చదువుకోవడం ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మలాలాను ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్’కు నామినీగా స్వీకరించింది.
అ) మలాలా జన్మించిన ప్రాంతంలోని పరిస్థితులు ఏమిటి?
జవాబు:
చిన్నప్పటి నుండి చదువంటే ఆసక్తిగల మలాలాకు తన ప్రాంతంలో బాలికల చదువుకు వ్యతిరేక పరిస్థితులున్నాయి.
ఆ) తాలిబాన్ ఛాందసవాదులు దేన్ని నిషేధించారు?
జవాబు:
తాలిబాన్ ఛాందసవాదులు బాలికలు పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడంపై నిషేధం విధించారు.
ఇ) మలాలా బాలికలను ఏ విధంగా ప్రోత్సహించింది?
జవాబు:
మలాలా తాలిబాన్లకు ఏమాత్రం భయపడకుండా చదువుకొంటూనే తన తోటి బాలికలకు చదువుపై ఆసక్తిని పెంచింది. వారు కూడా పాఠశాలలకు వెళ్ళేటట్లుగా ప్రోత్సహించింది.
ఈ) మలాలా ప్రాణాపాయ స్థితిలోకి ఎందుకు వెళ్ళింది?
జవాబు:
తాలిబాన్లు మలాలాపై 9-అక్టోబర్-2012న కాల్పులు జరిపారు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది.
ఉ) ఐక్యరాజ్య సమితి మలాలాను ఏ విధంగా గౌరవించింది?
జవాబు:
మాలాలాను ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్’ కు నామినీగా తీసుకొంది. నవంబర్ 10వ తేదీన ‘మలాలా రోజు’గా ప్రకటించి ఆమెను గౌరవించింది.
ఈ) కింది వాక్యాలు పాఠంలో ఎక్కడ వచ్చాయో గుర్తించి వాటి సందర్భాన్ని బట్టి భావం రాయండి.
అ) నియోజిత, నియోజక స్వాతంత్ర్యం మన స్త్రీలకు శీఘ్రంగా లభించినది.
జవాబు:
భారతీయ స్త్రీలు తమకు తాము స్వతంత్రంగా ఎన్నికలలో పాల్గొనే హక్కును, తమకు నచ్చిన వారిని ఎన్నికలలో ఎన్నుకొనే హక్కును పొందారు. పాశ్చాత్య దేశాలలోని స్త్రీలు ఈ హక్కులను పొందడానికి ప్రత్యేకంగా పరిశ్రమ చేయాల్సి వచ్చింది. వారితో పోలిస్తే భారతీయ స్త్రీలు వీటిని చాలా త్వరగా పొందినట్లే అని సరోజినీదేవి చెప్పారు.
ఆ) మన తనువే పుణ్యక్షేత్రముగా చేసుకొనవచ్చును.
జవాబు:
మనం కాశీ – రామేశ్వరాది పుణ్యయాత్రలు చేయాలనుకుంటాం కాని భూతదయను కలిగిఉండటం, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడటం, జాతి, మత భేదాలు లేకుండా అందరిని సోదరులలాగా చూడడం, అమలిన హృదయంతో ఉండటం వీటి ద్వారా మన శరీరాన్నే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చు.
ఇ) చిత్త సంస్కారము లేని యాత్రల వలన ఫలము లేదు.
జవాబు:
నిజానికి జీవితమే తీర్థయాత్ర అన్నింటికి మనస్సే మూలం. మనసు సంస్కరించబడకుండా ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు.
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
అ) కింది వాటికి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
ఇరుగుపొరుగు వారితో ఎలా ఉండాలో తెలపండి.
జవాబు:
సాధారణంగా తల్లి తన బిడ్డకు ఏదైనా ప్రమాదం వస్తే తన ప్రాణాలనైనా పణంగా పెట్టి బిడ్డను కాపాడుకోవడానికి సాహసిస్తుంది. అలాంటే ప్రేమను ఇరుగు పొరుగు వారిపై కూడా చూపాలి. ఇంకా, సర్వమతాల వారిపై చూపాలి. సర్వమానవుల్ని సొంతవారిగా భావించగలగాలి. అన్ని ప్రాణుల్ని సొంతబిడ్డలా ప్రేమించగలగాలి.
ప్రశ్న 2.
మనిషికి నిజమైన సౌందర్యం ఏమిటి?
జవాబు:
మనిషి విలువైన ఆభరణాలు ధరిస్తే సౌందర్యం పెరుగుతుందని మనం భావిస్తాం. అది నిజం కాదు. నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉండటం, కరుణతో ప్రవర్తించడం నిజమైన సౌందర్యం. అందరితో ప్రేమను పంచుకోవడమే సౌందర్యం. కాబట్టి సుగుణాలు కలిగి ఉండటమే సౌందర్యం. విలువైన ఆభరణాలు ధరించడం సౌందర్య హేతువు కాదని గ్రహించాలి.
ప్రశ్న 3.
‘స్త్రీ శక్తి స్వరూపం’ ఈ మాటను సమర్థిస్తూ రాయండి.
జవాబు:
స్త్రీ శక్తి స్వరూపం. ప్రధాన దేవతలైన సరస్వతి – లక్ష్మి – పార్వతులు స్త్రీలే. తమ సొంతశక్తితో విద్యను, సంపదలను పొందవచ్చు. పిరికితనాన్ని, బిడియాన్ని విడిచి పెట్టడం ద్వారా సాహస కార్యాల్ని చేయవచ్చు. వేదకాలం నాటి స్త్రీలు యజ్ఞయాగాల్ని నిర్వహించినట్టు, శాస్త్ర చర్చలలో పురుషులతో పోటీ పడినట్టు మన చరిత్ర చెపుతుంది. సంపదలను సాధించడంలో కూడా స్త్రీలు నైపుణ్యాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తుంది. మహారాణి రుద్రమ, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వంటి సాహసం నేటికీ మరుపురానివే, స్త్రీలు తమ పని శక్తిస్వరూపాన్ని గుర్తించి, వెలికితీయడం ద్వారా ఉన్నత స్థితిని త్వరగా పొందవచ్చు.
ప్రశ్న 4.
ప్రతిబంధకాలు అంటే ఏమిటి? వాటిని ఎలా అధిగమించాలి?
జవాబు:
అభివృద్ధికి అడ్డంకి కలిగించే వాటిని ప్రతి బంధకాలు అంటారు. ప్రతి కార్యానికి ప్రతిబంధకాలు కలుగుతాయి. వాటిని అధిగమిస్తేనే కోరుకున్నదాన్ని సాధించగలం. అడ్డంకులు ఏర్పడగానే కంగారు పడిపోకూడదు. జాగ్రత్తగా ఆలోచించుకొని సమస్యను అధిగమించాలి. ఉద్రేకానికి లోను కాకూడదు. అవసరమైతే పెద్దవారి సలహాలను, స్నేహితుల సహకారాన్ని తీసుకోవాలి. తెలివిగా సమస్యలను సాధించుకోవడం నేర్చుకోవాలి.
ప్రశ్న 5.
‘సరస్వతీ ప్రసన్నత’ అంటే ఏమిటి? అది ఎప్పుడు లభిస్తుంది?
జవాబు:
‘సరస్వతీ ప్రసన్నత’ – అంటే ఉన్నత విద్యలను అభ్యసించగలగడం. ప్రాథమిక విద్యలను అభ్యసించకుండా, ఉన్నత విద్యలను అభ్యసించడం కుదరదు కాబట్టి ప్రాథమిక విద్యలను ముందు అభ్యసించి, అంతటితో ఆగిపోకూడదు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఉన్నత విద్యలను అభ్యసించాలి. కష్టాలను ఎదిరించి ఇష్టతతో చదివేవారికి తప్పక సరస్వతీ ప్రసన్నత కలుగుతుంది. దానివల్ల సులువుగా ఉన్నత విద్యలను అభ్యసించగలుగుతాము.
ప్రశ్న 6.
బాలబాలికలకు విధిగా విద్య నేర్పాలని సరోజినీదేవి ఎందుకన్నది?
జవాబు:
దేశ భవిష్యత్తు బాలల పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే “నేటి బాలలే రేపటి పౌరులు” అనే నానుడి ఏర్పడింది. బాలలందరూ విద్యావంతులైనప్పుడే సమాజం విద్యావంతమవుతుంది. విద్యావంతమైన సమాజం వల్లే దేశం పురోభివృద్ధిని సాధిస్తుంది. దేశం సర్వతోముఖాభివృద్ధిని త్వరగా సాధించాలంటే పౌరులందరూ ఉన్నత విద్యావంతులు కావాలి. కాబట్టే బాలబాలికలందరూ విధిగా విద్యనేర్చుకోవాలని సరోజినీదేవి కోరింది.
ఆ) కింది వాటికి పదిహేనేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
సరోజినీదేవి ఉపన్యాసంలోని ముఖ్యాంశాలను సంక్షిప్తంగా రాయండి.
(లేదా)
స్త్రీ సమాజాభివృద్ధికై సరోజినీదేవి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలేవి?
(లేదా)
సరోజినీదేవి స్త్రీలనుద్దేశించి చెప్పిన సందేశపు సారాంశాన్ని మీ మాటల్లో రాయండి.
(లేదా)
బాలబాలికలకు విధిగా విద్య నేర్వవలెను. అతిబాల్య వివాహాలు అనర్థదాయకాలు – అని సరోజనీ దేవిగారు స్త్రీ సామాజికాంశాలపై ఏ విధంగా స్పందించారో వివరించండి. ఆ
జవాబు:
శ్రీమతి సరోజినీదేవి గారి ఉపస్యౌసం మదనపల్లి యందు హిందూ సమాజం వారి యాజమాన్యంలో నిర్వహించబడింది. శ్రీమతి పద్మావతీదేవి గారు ఈ సభకు అధ్యక్షత వహించిరి. శ్రీమతి సరోజినీదేవి గారి ఉపన్యాస సారాంశం ఇట్లున్నది.
ఢిల్లీ మహిళా సభవారు స్త్రీలకు సంబంధించిన చాలా విషయాల్ని చర్చించారు. బాలలందరకూ తప్పక విద్య నేర్పించాలని అన్నారు. స్త్రీలకు నియోజక, నియోజిత స్వాతంత్ర్యం కావాలన్నారు. చిన్నవయస్సులోనే వివాహాలు చేయకూడదన్నారు. ఇతర దేశాల్లో స్త్రీలు ఎక్కువ కష్టం సాధించిన ఎన్నిక హక్కులు మనదేశంలోని స్త్రీలు పెద్దగా కష్టపడకుండానే సాధించారు. మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఒక స్త్రీ డిఫ్యూటీ ప్రెసిడెంటుగా ఎన్నిక అయింది. తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రి పదవిని పొందింది. ఇంకా చాలామంది మహిళలు స్థానిక సభల్లోను, విద్యాసంఘాల్లోను సభ్యులయ్యారు. ఈ స్వాతంత్ర్యపు హక్కుల్ని సమర్థతతో నిర్వహించాలంటే స్త్రీలు విద్యావంతులు కావాలి. కాని మన దేశంలో స్త్రీల విద్యాభివృద్ధికి బాల్య వివాహాలు అడ్డంకి అయ్యాయి. వాటిని రూపుమాపాలి.
స్త్రీ శక్తి స్వరూపం. ప్రధాన దేవతలైన సరస్వతి – లక్ష్మి – పార్వతులు స్త్రీలే. తమ సొంత శక్తితో విద్యను, సంపదలను పొందవచ్చు. పిరికితనాన్ని, బిడియాన్ని విడిచిపెట్టడం ద్వారా సాహసకార్యాల్ని చేయవచ్చు. కాని అట్టి శక్తి నేటి మహిళలలో స్తంభించిపోయింది. చాలామంది కాశీ రామేశ్వరాది పుణ్య యాత్రల్ని చేయాలనుకుంటారు. కాని సకల ప్రాణుల్ని ప్రేమించడం, చేసిన తప్పులకు పశ్చాత్తాపడటం, జాతి మత భేదాలు పాటించక విశ్వమానవులందరినీ సోదరులుగా భావించడం ద్వారా మన శరీరాన్నే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చు. నిజానికి జీవితమే ఒక యాత్ర. సంస్కరింపబడని మనస్సుతో ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు. తోటివారిని అంటరాని వారిగా చూడడం తప్పు. స్త్రీలకు సౌందర్యం వెలలేని ఆభరణాలను ధరించడంలో లేదు. నిర్మలమైన ప్రేమను, కరుణను ఇరుగు పొరుగు వారిపై కలిగి ఉండాలి.
ప్రశ్న 2.
‘స్త్రీ విద్య’ ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
విద్యావంతురాలైన గృహిణి వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. గృహకార్యాలనే కాక బయటకు వెళ్ళి చేసుకోవలసిన పనులను కూడా చక్కగా నిర్వహించుకోగలదు. తన పిల్లలను చదివించడంలోను, వారికి వచ్చే సందేహాలను తీర్చడంలోనూ, విద్యావంతురాలే సమర్థురాలు. మూఢనమ్మకాలకు, మోసపు మాటలకు లొంగిపోకుండా వైజ్ఞానికంగా ఆలోచించగలగాలంటే గృహిణులు తప్పక విద్యావంతులు కావాలి ఒక్క ఇల్లాలు విద్యావంతురాలైతే ఆ ఇంటిని అనేక ఆపదల నుంచి రక్షిస్తుంది. కొబట్టే “ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు” అనే సామెత ఏర్పడింది. పిల్లలచే ఉన్నత విద్యలను అభ్యసింపజేయడంలో చదువుకున్న ఇల్లాలే చక్కని నిర్ణయాలు తీసుకోగలదు.
ఆడపిల్లల చదువు వల్ల చాలా అనర్థాలు దూరమవుతాయి. సమాజం విద్యావంతమవుతుంది. ఉత్తమ సమాజం వల్ల ఉత్తమ దేశం ఏర్పడుతుంది. మూఢవిశ్వాసాలు నశిస్తాయి. వైజ్ఞానిక దృక్పథం ఏర్పడుతుంది.
ప్రశ్న 3.
స్త్రీల చైతన్యానికి మహిళా సంఘాలు చేస్తున్న కృషిని వివరించండి.
జవాబు:
బాలికలు పాఠశాలలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయడానికి మహిళా సంఘాలు పరిశ్రమించాయి. వయోజనులు, గృహిణులైన స్త్రీల కోసం వయోజన విద్యా సంఘాలను ఏర్పాటుచేశాయి. సమాజంలో స్త్రీల అణచివేతను అనేక ఉద్యమాలతో ఎదుర్కొన్నాయి చదువుకొనే ప్రదేశాల్లో, పనిచేసే చోట్ల మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి మహిళా సంఘాలు కృషిచేస్తున్నాయి.
వివిధ రాష్ట్రాల మహిళా సంఘాల ఐక్య ఉద్యమాల ఫలితంగానే మహిళలకు ఓటు హక్కు, ఎన్నికలలో పాల్గొనే హక్కు లభించాయి. ఉన్నత కుటుంబాలలోని .ఆడపిల్లలు పాఠశాలలకు వచ్చి చదువుకోగలుగుతున్నారు. పరదాలమాటున, ఘోషాల చాటున మగ్గిన మహిళలు నేడు స్వేచ్ఛగా బయటికి వచ్చి తమ పనులు నిర్వహించుకోగలుగుతున్నారంటే వీటి వెనుక మహిళా సంఘాల కృషి ఎంతో ఉంది. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వరకట్న సమస్యలను, యాసిడ్ దాడులను దూరం చేయడంలో మహిళా సంఘాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. మహిళలకు అనుకూలంగా అనేక చట్టాలను తీసుకురావడంలో మహిళా సంఘాలు విజయాన్ని సాధించాయి. మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా ‘నిర్భయ్’ వంటి రక్షణను పొందడం (ఇందులో కొన్ని).
ఇ) కింద ఇచ్చిన వివరాలను విశ్లేషిస్తూ పది వాక్యాలు రాయండి.
అక్షరాస్యత – 2011 సం|| | జాతీయస్థాయి | రాష్ట్రస్థాయి |
పురుషుల అక్షరాస్యత | 82.14% | 75.56% |
స్త్రీల అక్షరాస్యత | 70.04% | 59.74% |
మొత్తం | 65.46% | 67.61% |
జవాబు:
- భారతదేశంలో ప్రతి పది సంవత్సరాలకొకసారి జనాభాను లెక్కిస్తారు.
- ఈ మధ్యకాలంలో స్త్రీ – పురుష, చిన్న – పెద్ద తేడాలతో మాత్రమేగాక వివిధ కులాల, వర్గాల ప్రాతిపదికగా జనాభాను లెక్కించారు.
- 2001 వ సంవత్సరంలో జనాభాను లెక్కించాక తిరిగి పదేళ్ళ తర్వాత 2011వ సంవత్సరంలో జనాభా లెక్కలను భారత ప్రభుత్వం ప్రకటించింది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయస్థాయిలో పురుషుల అక్షరాస్యత 82.14%గా ఉంది.
- స్త్రీల అక్షరాస్యత 70.04% గా ఉంది.
- ఈ రెండింటి మధ్య తేడా 12.10. దీని ద్వారా పురుషుల కంటే స్త్రీల అక్షరాస్యతా సంఖ్య తక్కువ
- రాష్ట్రస్థాయిలో చూస్తే పురుషుల అక్షరాస్యతా శాతం 75.56% గా ఉంది.
- మహిళల అక్షరాస్యత 59.74% గా ఉంది.
- ఈ రెండింటి మధ్య తేడా 15.82%
- మన రాష్ట్రంలో మహిళల అక్షరాస్యతా శాతం ఇంకా పెరగాల్సి ఉంది.
ఈ) సృజనాత్మకంగా రాయండి.
ప్రశ్న 1.
సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు. ఆమెకు సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి. వాటి ఆధారంగా ఆమె జీవిత విశేషాలను వర్ణనాత్మకంగా రాయండి. – పూర్తి పేరు సునీతా పాండ్యకృష్ణ – జననం 19 సెప్టెంబరు, 1965.
– అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు
– అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన తొలి మహిళ.
– ఎక్కువసార్లు అంతరిక్షయాత్ర చేసిన మహిళ
– 1998లో NASA చేత ఎంపిక.
– 2007లో భారత పర్యటన.
– గుజరాత్ లో స్వగ్రామం (జులాసన్), సబర్మతి సందర్శన
– విశ్వప్రతిభ అవార్డ్, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ డీసెంట్ అవార్డు.
– 4 అక్టోబర్ 2007లో “అమెరికన్ ఎంబసీ” లో ప్రసంగం.
– భారత ప్రధానితో సమావేశం.
– NASA లో డిప్యూటీ చీఫ్ గా 2008లో బాధ్యత.
జవాబు:
ప్రాచీన కాలపు భారతదేశ చరిత్రలో మహిళలు పురుషులతో పోటీపడటమే గాక, వారినధిగమించి తమ సత్తా చాటుకొన్న సందర్భాలు కోకొల్లలు. స్త్రీలు యజ్ఞ నిర్వాహకులుగా ఉన్నట్లు వేదమంత్రాల ద్వారా తెలుస్తుంది. గార్గియనే మహిళా శిరోమణి వేదవేదాంగాలలోను నిష్ణాతురాలు. తనను శాస్త్రవాదనలో ఓడించినవానినే వివాహం చేసుకుంటానని కఠోర ప్రతిజ్ఞ చేసింది. ఎందరో మహాపండితులను శాస్త్ర వాదనలో ఓడించింది. చివరకు యాజ్ఞవల్క్య మహర్షితో జరిగిన శాస్త్ర చర్చలో ఓడిపోయి, ఆ మహానుభావుణ్ణి వివాహం చేసుకొంది. తదనంతర కాలంలో భర్త ద్వారా బ్రహ్మవిద్యను పొంది మహా ప్రజ్ఞావంతురాలిగా పేరొందింది. తదనంతర కాలంలో మహిళలు తమ సామర్థ్యాన్ని విస్మరించి కష్టాల కడలిలో మునిగిపోయారు. కాని ఆధునిక కాలంలో మహిళలు ప్రతికార్యంలోనూ పురుషులతో పోటీపడుతున్నారు. తమ శక్తియుక్తులకు పదును పెడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే భారతీయ మహిళ “కల్పనా చావ్లా” మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో ప్రవేశించింది. మహిళల గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటింది. కాని అంతటితో సంతృప్తి పడక స్వర్గలోకానికి కూడా ఆ కీర్తిని చాటాలని సంకల్పించి స్వర్గ సోపానాలను (మెట్లను) అధిరోహించింది.
కల్పనాచావ్లా లేని లోటును తాను భర్తీ చేస్తానని భారతీయులను ఊరడించింది శ్రీమతి సునీతా విలియమ్స్. సునీతా భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు. ఈమె పూర్తి పేరు సునీతా పాండ్యకృష్ణ, ఈమె 19-9-1965న జన్మించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ గర్వించేలా అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. 1998వ సంవత్సరంలో NASA చేత ఎంపిక చేయబడి అంతరిక్షయానం చేసింది. తన అనుభవాలను, అనుభూతులను భారతీయులతో పంచుకోదలచి 2007వ సంత్సరంలో భారతదేశంలో పర్యటించింది. గుజరాత్ రాష్ట్రంలో తన స్వగ్రామమైన జులాసనను, సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించింది. భారతీయుల ఆత్మీయతను, ఆప్యాయతను చవిచూసింది. వారు ప్రేమతో ఇచ్చిన ‘విశ్వ ప్రతిభ అవార్డు’ను, “ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ డీసెంట్ అవార్డు’ను స్వీకరించి, గర్వంగా భావించింది. 4-10-2007వ తేదీన “అమెరికన్ ఎంబసీ’లో ప్రసగించింది. తర్వాత భారత ప్రధానితో సమావేశమై కృతజ్ఞతలు తెలిపింది. 2008వ సంవత్సరంలో NASA లో డిప్యూటీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించింది. ఒక మహిళ అందులోను భారతీయ సంతతి అలాంటి ఉన్నతపదవిని పొందడం అదే ప్రథమం.
ఉ) ప్రశంసాత్మకంగా రాయండి. రాణి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం వల్ల 7వ తరగతి వరకు చదివి బడి మానేసింది. ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో కస్తూర్బా పాఠశాలలో చేరి పదోతరగతి వరకు చదివి, పదోతరగతి పబ్లిక్ పరీక్షలో 9.7 పాయింట్స్ సాధించి కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతినందుకున్నది. ఆమెను ప్రశంసిస్తూ లేఖ రాయండి.
జవాబు:
ప్రశంసా లేఖ గుంటూరు, ప్రియమైన మిత్రురాలు రాణికి ! నీ స్నేహితురాలు కల్పన రాయునది. ఎవరీ కల్పన అని ఆలోచిస్తున్నావా? అట్టే శ్రమపడకు, నేను నీకు తెలియదు కాని నీ గురించి దిన పత్రికల్లో చదివి, ఆనందం ఆపుకోలేక నా ప్రశంసలు నీకు తెలియజేయాలని ఈ లేఖ రాస్తున్నాను. మన రాష్ట్రంలో చాలామంది బాలికలు పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే చదువు ఆపేస్తున్నారు. అందరిలా నీవు కూడా ఏడవ తరగతితోనే చదువు ఆపి ఉంటే అది పెద్దవార్త అయ్యేదిగాదు. కాని నీ అదృష్టం కొద్దీ నీ ఉపాధ్యాయురాలు పాఠశాల మానిన నిన్ను కస్తూర్బా పాఠశాలలో చేర్పించింది. ఉచిత విద్యతోపాటు నివాసం, వస్త్రాలు, పుస్తకాలు, భోజన సౌకర్యాలు ఉచితంగా ఆడపిల్లలకు కల్పిస్తూ వారి కోసమే ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పరచింది. ఈ పాఠశాలలు అందుబాటులో ఉన్నా ఎంతోమంది బాలికలు విద్యకు దూరమవుతున్నారు. వీటి గురించిన అవగాహన వారికి లేకపోవడమే ఇందుకు కారణం. పాఠశాలలో చేరిన నువ్వు విద్యపైనే శ్రద్ధ పెట్టి బాగా చదవడం పదవతరగతి పబ్లిక్ పరీక్షలో 9.7 పాయింట్లు సాధించడం నిజంగా గొప్ప విషయం. చదువే లోకంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక తపస్సులా విద్యాభ్యాసం సాగించిన నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నా తోటి విద్యార్థినులకే గాక నాలా వార్తాపత్రికల ద్వారా, దూరదర్శన్ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అమ్మాయిలకు చాలామందికి ఆదర్శంగా నిలిచావు. కలెక్టర్ గారు నిన్ను అభినందిస్తున్న దృశ్యం దూరదర్శన్ లో చూస్తుంటే నా ఒళ్ళు పులకరించి పోయిందనుకో. నాతో పాటు చదువుతూ, మధ్యలోనే చదువు మానేసిన నా స్నేహితురాళ్ళకు నీ గురించి చెప్పాను. ప్రముఖులందరూ నిన్ను ప్రశంసిస్తున్న దృశ్యాలను చూపాను. వారు కూడా ఎంతో సంతోషించారు. నువ్వు మా సోదరివైతే ఎంత బాగుణ్ణు అని ఎవరికి వారే అనుకున్నాం. ఇప్పుడైనా నువ్వు మా సోదరివే. నీ నుండి మేమెంతో స్ఫూర్తి పొందాం. పేదరికం విద్యకు అడ్డంకి కాలేదని నీవు నిరూపించాలని మన స్ఫూర్తిగా కోరుతున్నాను. ఇట్లు, చిరునామా : |
IV. ప్రాజెక్టు పని
వివిధ రంగాలలో ప్రసిద్ధులైన స్త్రీల పేర్లు సేకరించి వారు ఏ రంగంలో పేరు పొందారో పట్టికను రాసి ప్రదర్శించండి.
ఉదా :
క్రీడలకు సంబంధించిన వారు, రచయిత్రులు – మొదలయిన వారు.
పేరు | ప్రసిద్ధిగాంచిన రంగం |
1. మొల్ల | కవయిత్రి |
2. రంగాజమ్మ | కవయిత్రి |
3. ఇందిరాగాంధీ | రాజకీయం |
4. పి.టి. ఉష | క్రీడలు |
5. అశ్వని నాచప్ప | క్రీడలు |
6. కల్పనాచావ్లా | వ్యోమగామి |
7. సునీతా విలియమ్స్ | వ్యోమగామి |
8. కిరణ్ బేడి | రక్షణ విభాగం |
9. మదర్ థెరిస్సా | దీనజనసేన |
10. డొక్కా సీతమ్మ | అన్నదాత |
11. శారదామాత | ఆధ్మాత్మిక రంగం |
12. శకుంతలాదేవి | గణితశాస్త్రం |
13. యద్దనపూడి సులోచన రాణి | నవలా రచయిత్రి |
14. ఐశ్వర్యారాయ్ | చలనచిత్రం |
15. అరుంధతీరాయ్ | ఆంగ్ల సాహిత్య రచయిత్రి |
16. శోభానాయుడు | నాట్యకారిణి |
17. యమ్.యస్. సుబ్బులక్ష్మి | సంగీతం |
18. కిరణ్ మజుందార్ షా | వాణిజ్యం |
III. భాషాంశాలు
పదజాలం
అ) కింది పట్టికలో సమానార్థక పదాలున్నాయి. వాటి నుండి పట్టిక కింద ఇచ్చిన పదాలకు పర్యాయపదాలు వెతికి రాయండి.
1) వనిత, 2) లక్ష్మి, 3) కరుణ, 4) నెచ్చెలి, 5) శీఘ్రం, 6) అనిశం, 7) భ్రాత. 8) విక్రమం , 9) విదుషి
జవాబు:
1) వనిత : స్త్రీ, పడతి
2) లక్ష్మి : శ్రీ, రమ
3) కరుణ : దయ, జాలి
4) నెచ్చెలి : స్నేహితురాలు, ప్రాణసఖి
5) శీఘ్రం : వేగం, తొందర
6) అనిశం : ఎల్లప్పుడు, సదా
7) భ్రాత : సోదరుడు, సహోదరుడు
8) విక్రమం : పరాక్రమం, శౌర్యం
9) విదుషి : విద్వాంసురాలు, పండితురాలు
ఆ) కింది వాటిలో ప్రకృతి, వికృతులు కలగలిసి ఉన్నాయి. వాటిని వేరుచేసి, ఎదురెదురుగా రాయండి.
ఫలము, లచ్చి, విద్దె, కృష్ణుడు, ఇంతి, లక్ష్మి, పండు, స్త్రీ, కన్నయ్య, విద్య, శక్తి,
జవాబు:
ప్రకృతి – వికృతి
ఫలము – పండు
లక్ష్మి – లచ్చి
విద్య – విద్దె
కృష్ణుడు – కన్నయ్య
స్త్రీ – ఇంతి
శక్తి – సత్తు
ఇ) కింది పదాలకు అర్థాలను గుర్తించి కింద గీత గీయండి. ఆ అర్థాన్ని ఉపయోగించి వాక్యాలు రాయండి.
ఉదా :
అనిశం = ఎల్లప్పుడు, అన్నము, గాలి
వాక్యం : సూర్యుడు ఎల్లప్పుడు తూర్పున ఉదయిస్తాడు.
1. విదుషీమణి అను విద్యావంతురాలు, నాయకురాలు, పండితురాలు.
వాక్యం : సరోజినీ నాయుడు ఆంగ్లభాషలో గొప్ప పండితురాలు.
2. నిర్మలం : స్వేచ్ఛ, స్వచ్ఛమైనది, భిన్నం కానిది.
వాక్యం : ఈ కొలను చాలా స్వచ్చమైనది.
3. కల్మషం : కలశం, కమలం, పాపం
వాక్యం : ఏ పాపం చేయని వారే తప్పు చేసిన వారిని శిక్షిం’ ‘లని ఏసుక్రీస్తు ప్రబోధించాడు.
4. ప్రతిబంధకం = ఎదిరించేది, అడ్డగించేది, తిరిగి బంధించేది.
వాక్యం : ముస్లిం స్త్రీల విద్యకు బురఖా పద్ధతి అడ్డంకిగా తయారయ్యింది.
ఈ) కింది పదాలకు ఎదురుగా వాటి నానార్థాలున్నాయి. వాటినుపయోగించి వాక్యాలు రాయండి.
ఉదా :
ఫలం (పండు) : నేను తిన్న ఫలం తీయగా ఉలు.
ప్రయోజనం : లక్ష్యం లేకుండా పనిచేస్తే ఫలం లభించదు.
1. పురము (పట్టణం) : గుంటూరు పురము విద్యలకు నెలవు.
(ఇల్లు) : మా పురము పేరు సౌదామిని.
2. నారి (స్త్రీ : బ్రిటిష్ అధికారులను ఎదిరించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి.
(వింటితాడు) : అర్జునుడి నారి ధ్వనికే శత్రువులు భయపడిపోయేవారు.
వ్యాకరణం
అ) కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చండి.
1. కర్మణి వాక్యం : ఈ పురంలోని హిందూ సమాజంచారి యాజమాన్యంలో పై సభ జరుపబడింది.
కర్తరి వాక్యం : ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యంలో పై సభను జరిపారు.
2. కర్మణి వాక్యం : తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రిణిగా నియమించబడింది.
కర్తరి వాక్యం : తిరువాన్కూరులో ఒక స్త్రీని మంత్రిణిగా నియమించారు.
3. కర్మణి వాక్యం : విద్యాసంఘాలలో స్త్రీలు సభ్యురాండ్రుగా నియమింపబడ్డారు.
కర్తరి వాక్యం : విద్యాసంఘాలలో స్త్రీలను సభ్యురాండ్రుగా నియమించారు.
ఆ) పడ్వాది సంధి :
భయము + పడు – భయపడు (మువర్ణానికి లోపం)
భయము + పడు – భయంపడు (బిందువు రావడం)
విడదీసిన పగాలకు, కలిపిన పదాలకు తేడా గమనించండి. కలిపిన పదంలో ‘ము’కు బదులుగా (0) వచ్చింది. ‘ము’ లోపించింది.
సూత్రం :
పడ్వాదులు పరమగునప్పుడు ‘ము’ వర్ణకానికి లోపమూ, పూర్ణబిందువూ (0) విభాషగా అవుతాయి.
పడ్వాదులు :
పడు, పట్టె, పాటు, పఱచు, పెట్టు మొదలగునవి.
ఇ) కింది వాటిని గమనించండి :
1. తృప్తిగంటిని – తృప్తి పొందాను.
2. ఉపన్యసించిరి – ఉపన్యసించారు.
3. తీర్మానములు గావించియున్నారు – తీర్మానాలు చేశారు.
4. లభించినవి – లంచాయి.
5. చేయుదురు – చేస్తారు.
గమనిక :
మార్పు దాదాపు చివరి రెండు మూడు అక్షరాలలోనే రావడం గమనించండి. గ్రాంథిక భాషా పదాలు వ్యవహారభాషలోకి మార్చాలంటే – నిత్యం మనం మాట్లాడే భాషను బాగా పరిశీలించాలి.
కింది పదాలను వ్యవహారభాషలోకి మార్చండి.
గ్రాంథికము | వ్యవహారభాష |
1) చూడుడు | 1) చూడండి |
2) సాహసించును | 2) సాహసిస్తుంది/సాహసిస్తాడు |
3) కలిగియుండవలెను | 3) కలిగి ఉండాలి |
9th Class Telugu 6th Lesson ప్రబోధం రచయిత్రి పరిచయం
కనుపర్తి వరలక్ష్మమ్మ గుంటూరు జిల్లా బాపట్లలో 6. 10. 1896న జన్మించారు. ఆమె భర్త కనుపర్తి హనుమంతరావు ప్రోత్సాహంతో సుమారు 50 కథలు, రెండు నవలలు రచించారు. భారతి, గృహలక్ష్మి, అనసూయ, వినోదవాణి, ఆనందవాణి మొదలయిన పత్రికలలో రచనలు చేశారు. గృహలక్ష్మి పత్రికలో సుమారు ఆరు సంవత్సరాలపాటు శారదలేఖలు ప్రచురణ అయ్యాయి. ‘లీలావతి’ అనే కలం పేరుతో ఆంధ్రపత్రికలో ‘మా చెట్టునీడ ముచ్చట్లు’ శీర్షికతో రచనలు చేశారు. ‘గాంధీ దండకం’ రచించారు. దేశభక్తిని, దైవభక్తిని ప్రబోధిస్తూ అనేక పాటలు, పద్యాలు, కనుపర్తి వరలక్ష్మమ్మ నాటికలు రచించారు.
ధర్మము నా జీవము, నీతి నా మతము, సతీశ్రేయము నా లక్ష్యం అని ప్రకటించి, కలముపట్టి రచనలు చేసిన ‘విదుషీమణి’ కనుపర్తి వరలక్ష్మమ్మ. వీరి సాహిత్యకృషికి గుర్తింపుగా 1930లో గృహలక్ష్మి స్వర్ణపతకం, 1934లో ‘స్వర్ణకంకణం’ అందుకున్నారు. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని అందించింది. గుడివాడలో జరిగిన సప్తతి మహోత్సవ సన్మానసభలో ‘కవితా ప్రవీణ’ బిరుదును పొందారు. 1975లో ప్రథమ ప్రపంచ తెలుగుమహాసభల స్వర్ణఫలకం, తామ్రపత్ర బహుమతి నందుకున్నారు.
కఠిన పదాలకు అర్థాలు
సౌభాగ్యవతి = ముత్తైదువ (శ్రీమతి)
నెచ్చెలి (నెఱు + చెలి) = ప్రాణ స్నేహితురాలు
శుభ, సమాచారము = మంచి, ముచ్చట
వనితామణి = స్త్రీ రత్నము
గంభీరోపన్యాసము = గంభీరమైన ఉపన్యాసము
ఆలింపవలెనని = వినాలని
స్తంభించిపోయినది = మొద్దువారినది
ఎల్లరు = అందరు
అనిశము = ఎల్లప్పుడు
ఉత్కంఠపడు = ఇష్టమైన వస్తువును పొంద డానికి తొందరపడు
కవయిత్రి = కవిత్వం అల్లే స్త్రీ
విదుషీమణి = గొప్ప విద్వాంసురాలు
నారీరత్నము = స్త్రీ రత్నము
మహత్తరోపన్యాసము = గొప్ప ఉపన్యాసము
లేఖామూలముగా = ఉత్తరం ద్వారా
కొమార్తె = కూతురు
అగ్రాసనాధిపురాలు = అధ్యక్షురాలు
ఆంగ్లభాష = ఇంగ్లీషుభాష
మహనీయుడు = గొప్పవాడు
సారాంశము = తాత్పర్యము
మహిళాసభ = స్త్రీ సభ
బాల్యవివాహము = చిన్నవారికి వివాహము
పడయజాలక = పొందలేక
తత్పలితము = దాని ఫలితము
మంత్రిణి = మంత్రిగా ఉన్న స్త్రీ
నిర్వహింపుచున్నది = నెరవేర్చుతుంది
సభ్యురాండ్రు = సభలోని స్త్రీలు
ప్రతిబంధకము = అడ్డగించునది
రూపుమాపవలెను = నశింపజేయాలి
లక్ష్మీప్రసన్నత = ధనము కలుగుట
సరస్వతీప్రసన్నత = చదువువచ్చుట
బిడియము = సిగ్గు
అశక్తలు = శక్తిలేని వారు
విదుషీమణులు = శ్రేష్ఠమైన విద్వాంసురాండ్రు
పశ్చాత్తాపము = తాను చేసింది తప్పు అని తెలిసినపుడు, అలా చేశానే అని తరువాత చింతించుట
విశ్వమానవ భ్రాతృత్వము = ప్రపంచ మానవ సోదరత్వము
అకల్మష హృదయము = పాపము లేని మనసు
తనువు = శరీరము
చిత్త సంస్కారము = మనస్సు శుద్ధి
అస్పృశ్యులు = అంటరానివారు
అర్పించుట = ఇచ్చుట
నిర్మలము = స్వచ్ఛము
కరుణాభరితము = దయతో కూడినది
ప్రేమ పూర్ణము = ప్రేమతో నిండినది
పడయగోరు = పొందగోరు
ముఖ్యాంశములు (ముఖ్య + అంశములు) = ముఖ్య విషయాలు
AP Board Textbook Solutions PDF for Class 9th Telugu
- AP Board Class 9 Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 1 శాంతికాంక్ష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 2 స్వభాష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 3 శివతాండవం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 4 ప్రేరణ Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 5 పద్యరత్నాలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 6 ప్రబోధం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 7 ఆడినమాట Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 8 చూడడమనే కళ Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 9 భూమి పుత్రుడు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 10 బతుకు పుస్తకం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 11 ధర్మదీక్ష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu లేఖలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu వ్యాసాలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Grammar Chandassu ఛందస్సు Textbook Solutions PDF
0 Comments:
Post a Comment