![]() |
AP Board Class 6 Telugu Chapter 1 అమ్మ ఒడి Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 6th Telugu Chapter 1 అమ్మ ఒడి Book Answers |
Andhra Pradesh Board Class 6th Telugu Chapter 1 అమ్మ ఒడి Textbooks Solutions PDF
Andhra Pradesh State Board STD 6th Telugu Chapter 1 అమ్మ ఒడి Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 6th Telugu Chapter 1 అమ్మ ఒడి Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 6th Telugu Chapter 1 అమ్మ ఒడి solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 6th Telugu Chapter 1 అమ్మ ఒడి Textbooks. These Andhra Pradesh State Board Class 6th Telugu Chapter 1 అమ్మ ఒడి Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.Andhra Pradesh State Board Class 6th Telugu Chapter 1 అమ్మ ఒడి Books Solutions
Board | AP Board |
Materials | Textbook Solutions/Guide |
Format | DOC/PDF |
Class | 6th |
Subject | Telugu |
Chapters | Telugu Chapter 1 అమ్మ ఒడి |
Provider | Hsslive |
How to download Andhra Pradesh Board Class 6th Telugu Chapter 1 అమ్మ ఒడి Textbook Solutions Answers PDF Online?
- Visit our website - Hsslive
- Click on the Andhra Pradesh Board Class 6th Telugu Chapter 1 అమ్మ ఒడి Answers.
- Look for your Andhra Pradesh Board STD 6th Telugu Chapter 1 అమ్మ ఒడి Textbooks PDF.
- Now download or read the Andhra Pradesh Board Class 6th Telugu Chapter 1 అమ్మ ఒడి Textbook Solutions for PDF Free.
AP Board Class 6th Telugu Chapter 1 అమ్మ ఒడి Textbooks Solutions with Answer PDF Download
Find below the list of all AP Board Class 6th Telugu Chapter 1 అమ్మ ఒడి Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:వినడం – ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరున్నారు?
జవాబు:
ఒక టీచర్, పిల్లలు. (లేదా) తల్లి, పిల్లలు చిత్రంలో ఉన్నారు.
ప్రశ్న 2.
అమ్మ పిల్లలకు ఏమి చెబుతూంది?
జవాబు:
అమ్మ పిల్లలకు చదువు చెబుతూంది.
ప్రశ్న 3.
అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుంది?
జవాబు:
అమ్మ పిల్లల కోసం వంటచేస్తుంది. పిల్లలు అడిగినవి వండి పెడుతుంది. మారాం చేస్తే లాలిస్తుంది. భయపడితే ధైర్యం చెబుతుంది. బాధ కలిగితే ఓదారుస్తుంది. గెలిస్తే మెచ్చుకొంటుంది. కథలు చెబుతుంది. జోకొడుతుంది. బట్టలు ఉతుకుతుంది. పాఠాలలో అనుమానాలు తీరుస్తుంది. అల్లరి చేస్తే తిడుతుంది. ఎదిరిస్తే కొడుతుంది. నవ్విస్తుంది. అమ్మకు పిల్లలే లోకం.
ఇవి చేయండి
అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
అమ్మ ఒడి గేయాన్ని భావంతో, రాగంతో పాడండి.
జవాబు:
అమ్మ ఒడి గేయాన్ని మీకు నచ్చిన లయతో, రాగంతో, స్పష్టంగా, భావం తెలిసేలా పాడండి.
ప్రశ్న 2.
“అమ్మ ప్రేమ ఉత్తమమైనది”. దీనిని సమర్థిస్తూ చర్చించండి.
జవాబు:
(చర్చలో లత, రవి, కిరణ్, రాణి పాల్గొంటున్నారు)
లత : మా అమ్మ నాకెంతో ప్రేమగా చదువు చెబుతుంది.
రవి : మా అమ్మ చదువూ చెబుతుంది, భక్తిని, సంస్కారాన్ని నేర్పుతుంది.
కిరణ్ : మా అమ్మ కూడా అంతే, కాబట్టి మా అమ్మ ఒడి నాకు బడి, గుడి.
రాణి : నేను మాట్లాడే మాటలన్నీ మా అమ్మ నేర్పినవే.
లత : ఎంతో ప్రేమగా నాకు మంచి ఆలోచనలు మా అమ్మే నేర్పింది.
రవి : మా అమ్మ చిరునవ్వుతో నా తెలివిని ప్రోత్సహిస్తుంది.
కిరణ్ : మా అమ్మ చక్కగా మాట్లాడుతుంది. పాడుతుంది.
రాణి : మా అమ్మ మనసంతా అనురాగమే.
రవి : మన అల్లరిని చిరునవ్వుతో భరించే అమ్మ ప్రేమమూర్తి.
లత, కిరణ్, రాణి : (ఒక్కసారి) అందుకే అమ్మ ప్రేమ ఉత్తమమైనది.
ప్రశ్న 3.
పాఠం ఆధారంగా కింది వాక్యాలను జతపరచండి. .
1. అమ్మ చెప్పే మంచిమాటలు | అ) నిరంతరం తెలివినిస్తుంది |
2. అమ్మ’ పెదవులపై చిరునవ్వు | ఆ) అమ్మ చల్లని చేతులు |
3. దానధర్మాలకు నిలయాలు | ఇ) ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు |
జవాబు:
1. అమ్మ చెప్పే మంచిమాటలు | ఇ) ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు |
2. అమ్మ’ పెదవులపై చిరునవ్వు | అ) నిరంతరం తెలివినిస్తుంది |
3. దానధర్మాలకు నిలయాలు | ఆ) అమ్మ చల్లని చేతులు |
ప్రశ్న 4.
కింది కవిత చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
నాన్నంటే?
సంద్రమంత గాంభీర్యం,
కొండంత ధైర్యం,
నా పాలిట కల్పవృక్షం !
అ) కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు?
జవాబు:
నాన్న కొండంత ధైర్యం ఇస్తాడు.
ఆ) నాన్న గాంభీర్యం ఎలాంటిది?
జవాబు:
నాన్న గాంభీర్యం సముద్రం వంటిది.
ఇ) కల్పవృక్షంతో నాన్నను ఎందుకు పోల్చారు?
జవాబు:
కల్పవృక్షం దేవతా వృక్షం. అది కోరిన కోరికలను తీరుస్తుంది. అలాగే నాన్న కూడా పిల్లలకు కావల్సినవన్నీ ఇస్తాడు. కాబట్టి నాన్నను కల్పవృక్షంతో పోల్చారు.
ఈ) ఈ కవితకు తగిన ‘శీర్షిక’ రాయండి.
జవాబు:
ఈ కవితకు ‘నాన్న’ అనే శీర్షిక బాగుంటుంది.
వ్యక్తికరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
1. ‘అమ్మ ఒడి’ గేయం కవి గురించి రాయండి.
జవాబు:
అమ్మ ఒడి గేయం బాడిగ వెంకట నరసింహారావుగారు రచించారు. ఆయన బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు-హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారిలోకం మొదలైన 17 పుస్తకాలు రచించారు. ఆయన అనార్కలి నరసింహారావుగా పేరు పొందారు. ఆయన 15.8.1913 నుండి 6.1. 1994 వరకు జీవించారు.
2. ‘అమ్మ ఒడి – చదువుల బడి’ అని కవి ఎందుకన్నారు?
జవాబు:
అమ్మ తన ఒడిలో పిల్లలను పెట్టుకొని అనేక విషయాలు చెబుతుంది. మాటలు నేర్పుతుంది. పాటలు నేర్పుతుంది. పద్యాలను నేర్పుతుంది. కథలు చెబుతుంది. ఏది తప్పో ! ఏది ఒప్పో చెబుతుంది. మనిషిని తీర్చిదిద్దడానికి తొలిబీజాలు వేస్తుంది. తెలివి వికసించడానికి తొలి ప్రయత్నం చేస్తుంది. కనుక ‘అమ్మ ఒడి – చదువుల బడి’ అని కవిగారన్నారు. ఎవరికైనా అమ్మే తొలి గురువు. అమ్మ ఒడి తొలి బడి.
3. అమ్మ మాటలు పిల్లలకు ఎలా ఉపకరిస్తాయి?
జవాబు:
శిశువుకు మొదట పరిచయమయ్యే వ్యక్తి అమ్మ. పిల్లలకు పసితనం నుండి అమ్మగొంతు, స్పర్శ పరిచయం. అమ్మ సత్యం. అమ్మ మాటలు నిజం. తల్లి చెప్పే మాటలతో పిల్లలకు మాటలు వస్తాయి. అమ్మ మాటలతో పిల్లలకు ఆనందం కలుగుతుంది. అమ్మ మాటలతో పిల్లలకు ధైర్యం కలుగుతుంది. అమ్మ మాటలతో పిల్లలకు ఓదార్పు కలుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మ మాటల వలన పిల్లలు దేనినైనా సాధిస్తారు. ఎంతటి మహోన్నతులైనా ఔతారు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
1. అమ్మ గొప్పతనాన్ని పాఠం ఆధారంగా సొంతమాటల్లో రాయండి.
జవాబు:
అమ్మ ఒడిలోనే పిల్లలు మాటలు నేర్చుకొంటారు. ఏ జ్ఞానమైనా అమ్మ ఒడిలోనే నేర్చుకోవడం ప్రారంభిస్తారు. కాబట్టి అమ్మ ఒడి పిల్లలకు తొలి బడి. అమ్మ ఒడిలోనే జేజే పెట్టడం (నమస్కరించడం) నేర్చుకొంటారు. కాబట్టి అమ్మ ఒడి పిల్లలకు తొలి గుడి. అమ్మ దైవం కంటే గొప్పది. తన పిల్లలను తాను సృష్టించి, బ్రహ్మతో సమానమైంది. తను పెంచుతూ, రక్షిస్తూ విష్ణువుతో సమానమైంది. వారిలోని చెడు లక్షణాలను తొలగిస్తూ శివునితో సమానమైంది. అందుకే అమ్మ దైవం కంటె గొప్పది.
అమ్మ మాటలు నేర్పుతుంది. మంచి ఆలోచనలు నేర్పుతుంది. తన చిరునవ్వులతో పిల్లలలోని తెలివిని అభివృద్ధి చేస్తుంది. అమ్మ మృదువైన మాటలే పిల్లల చెవులకు ఆభరణాలు. అమ్మ మనసంతా అనురాగంతో నిండి ఉంటుంది.
అమ్మ చల్లని చేతులకు పెట్టడమే తెలుసు, అమ్మ పవిత్రపాదాలు తిరిగిన చోట అంతా మంచి జరుగుతుంది. అమ్మ చూపులు సోకినంత మేరా ఆనందం పెరుగుతుంది. అందుకే అమ్మ గొప్పది.
2. అమ్మ ఒడి గేయం ద్వారా అమ్మ గొప్పతనం తెలుసుకున్నారు కదా ! నాన్న / సంరక్షకుని గొప్పతనం రాయండి.
జవాబు:
అమ్మ పిల్లలకు అన్నీ సమకూర్చి దైవం కంటె గొప్పది అయింది. కాని, కష్టపడి డబ్బు సంపాదించి అమ్మకిచ్చే నాన్న అమ్మతో సమానమైన గొప్పవాడే.
తన భార్యా పిల్లల సుఖాలే తన సుఖాలుగా భావిస్తాడు. పిల్లలను చేయిపట్టి నడిపిస్తాడు నాన్న. చదివిస్తాడు. క్రమశిక్షణలో ఉంచుతాడు. పిల్లలు తప్పు చేస్తే మందలిస్తాడు. సరైన దారిలో పెడతాడు. పిల్లల ఆనందం కోసం ఎంత కష్టమైన భరిస్తాడు. పిల్లలకు కావలసిన బట్టలు, పెన్నులు, పుస్తకాలు మొదలైనవన్నీ కొనిస్తాడు. నాన్న భుజాలపై ఎక్కించుకొని మోస్తాడు. పిల్లల విజయానికే తపిస్తాడు. పిల్లలు విజయం సాధిస్తే తన విజయం కంటే ఎక్కువ ఆనందిస్తాడు. అందుకే నాన్నను బాధ పెట్టకూడదు. అమ్మ కడుపు నింపుతుంది. నాన్న మెదడు నింపుతాడు. . నాన్నే పిల్లలకు వెన్ను దన్ను.
(లేదా)
సంరక్షకులు :
తల్లిదండ్రులు దూరంగా ఉన్న పిల్లలను సంరక్షకులు రక్షిస్తారు. పిల్లల యోగక్షేమాలు చూస్తారు. కావలసినవి కొనిపెడతారు. చదువు చెప్పిస్తారు. ధైర్యం చెబుతారు. ఓదారుస్తారు. తల్లిదండ్రుల గురించి బెంగ పెట్టుకోకుండా పిల్లలను చాలా జాగ్రత్తగా చూస్తారు. లాలిస్తారు. మంచి, చెడు చెబుతారు. తాతయ్య, అమ్మమ్మ, మామయ్యల వంటివారైతే పిల్లలకు మంచి మంచి కథలు చెబుతారు. పాటలు, పద్యాలు నేర్పుతారు. పొడుపు కథలు చెబుతారు. ఆడిస్తారు. నవ్విస్తారు. ఎంత అల్లరి చేసినా నవ్వుతూ భరిస్తారు. కొట్టరు, తిట్టరు. భయపెట్టరు. తల్లిదండ్రుల కంటె కూడా ఎక్కువ భద్రత కల్పిస్తారు.
3. మీ పాఠశాల గొప్పతనం తెలిసేలా కింది గేయాన్ని పొడిగించండి.
జవాబు:
అందమైనది మా బడి
తెలివి నేర్పే మా గుడి
ఆటలు నేర్పే అమ్మ ఒడి
మంచిని చెప్పే తాత నుడి
చెడును రానివ్వని దడి
నేర్పుతుంది కలివిడి
అందుకే మాకిష్టం మా బడి
వడివడిగా నడిచి చేరాం మా బడి.
భాషాంశాలు
అ) 1. కింది పదాలను చదవండి. రాయండి. పదాలలోని అక్షరాలను వర్ణమాలలో ‘O’ చుట్టి గుర్తించండి.
1. ఆశ | 7. ఐర |
2. కళ | 8. ఊయల |
3. ఈక | 9. ఘనత |
4. ఓడ | 10. అచట |
5. ఉమ | 11. సహజ |
6. ఎర | 12. ఔషధం |
2. కింది వానిలో సరైన అక్షరాలను ఖాళీలలో ఉంచి పదాలను రాయండి.
జవాబు:
- బలపం
- కందం
- అరక
- ఆభరణం
- పథకం
- ఇంధనం
- శతకం
- సఫలం
- శంఖం
- ఢమరుకం
3. వర్ణమాలలోని అక్షరాలతో మరికొన్ని పదాలను రాయండి. ఉపాధ్యాయులు చెప్పిన పదాలను ఉక్తలేఖనం రాయండి.
1. కలప | 45. కణం | 89. బకం(కొంగ) |
2. పలక | 46. చరఖా | 90. పగ |
3. గడప | 47. చలం | 91. భయం |
4. కడప | 48. చకచక | 92. పస |
5. పడక | 49. గజగజ | 93. నస |
6. నలక | 50. ఛట | 94. వస |
7. మరక | 51. జడ | 95. అమలకం (ఉసిరికాయ) |
8. జలగ | 52. జట | 96. మరణం |
9. నడక | 53. జత | 97. మననం |
10. నడత | 54. జగడం | 98. మతం |
11. తడక | 55. జలజం | 99. మర |
12. మడత | 56. జననం | 100. మడత |
13. తడవ | 57. జఠరం | 101. మయసభ |
14. వడ | 58. జపం | 102. మల (పర్వతం) |
15. దడ | 59. ఝషం | 103. రసం |
16. కల | 60. జర (ముసలితనం) | 104. రమ |
17. నలక | 61. తబల | 105. రథం |
18. అలక | 62. తరక | 106. రకం |
19. ఆట | 63. తమకం | 107. రసన (నాలుక) |
20. అటక | 64. తమం | 108. లవంగం |
21. అల | 65. తరం | 109. వరం |
22. ఆనప | 66. తపం | 110. వశం |
23. ఆబ | 67. తల | 111. వల |
24. ఇల | 68. తలం | 112. వయనం (వాంతి) |
25. ఉలవ | 69. దయ | 113. శరం (నీరు, బాణం ) |
26. ఊట | 70. ధనం | 114. శకం |
27. ఊస | 71. ధర | 115. శతం |
28. ఊక | 72. ధగధగ | 116. శలభం (మిడత) |
29. ఊబ | 73. టపటప | 117. సంత |
30. ఎద | 74. దబదబ | 118. సహనం |
31. ఒర | 75. నరకం | 119. శపథం |
32. ఓర | 76. నటన | 120. సరసం |
33. ఔర | 77. నదం | 121. సకలం |
34. కమల | 78. నరం | 122. శకలం (ముక్క) |
35. కరప | 79. నయం | 123. శరణం |
36. కలత | 80. పరక | 124. చరణం |
37. కలకల | 81. పకపక | 125. హలం (నాగలి) |
38. ఖరం | 82. పనస | 126. క్షమ (ఓర్పు, భూమి) |
39. గలగల | 83. పలలం(మాంసం) | 127. క్షయం (ఒక వ్యాధి) |
40. గరగ | 84. పటక | 128. అక్షయం |
41. గరగర | 85. ఫణం (పాము పడగ) | 129. ఆకరం |
42. ఘటం | 86. బలం | 130. ఆననం (ముఖం) |
43. ఘనం | 87. బరకం | |
44. గజం | 88. బరబర |
అ) 1. కింది పదాలను చదవండి. తేడాను గమనించండి. సున్న (0) ఉపయోగించి మరికొన్ని పదాలు రాయండి. చదవండి. ఉక్తలేఖనం రాయండి.
1. కల – కలం
2. పడగ – పండగ
3. జల – జలం
4. జట – జంట
5. కడ – కండ
6. జయ – జయం
7. జగం – జంగం
8. గడ – గండం
9. వందన – వందనం
జవాబు:
1. కత – కంత
2. జట – జంట
3. మదం – మందం
4. వదనం – వందనం
5. నందన – నందనం
6. కమల – కమలం
7. వశం – వంశం
8. లయ – లయం
9. కంద – కందం
10. కటకం – కంటకం
2. కింది అక్షరాలకు అవసరమైన చోట ‘o’ను చేర్చి సరైన పదాలు రాయండి. చదవండి.
ఉదా : అద : అందం
1. దత : దంతం
2. రగడ : రంగం
3. సగ : సగం
4. జగ : జగం
5. అహ : అహం
6. జయ : జయం
7. ఆనద : ఆనందం
8. ఇధన : ఇంధనం
9. అగన : అంగన
10. చదన : చందనం
3. కింది అక్షరాలలో ‘0’ ను సరైన చోట ఉంచి పదాలు రాయండి. చదవండి.
ఉదా : వంర : వరం
1. దడం : దండ
2. రంణ : రణం
3. జంన : జనం జనం
4. గంమన : గమనం
5. పంయన : పయనం
6. మడంపం : మండపం
4. కింది పదాలలో అక్షరాలలోని తేడాను గమనించి చదవండి. రాయండి. అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఉక్తలేఖనం రాయండి.
1. కరం = చేయి
ఖరం = గాడిద
2. చలం = కదిలేది
ఛలం = నెపము, వెనుదీయుట
3. పతకం బిళ్ల
పథకం = ఎతుగడ
4. లత = తీగ
కథ = కత
5. పరం = ఇతరం
ఫలం = పండు, ప్రయోజనం
6. గజం = ఏనుగు
ఘనం = గొప్పది, మేఘం
7. జనం = మనుషులు
ఝషం = చేప
8. డంబం = ప్రగల్భం
ఢంక = పెద్ద డప్పు
9. దళం = ఆకు, సైన్య విభాగం
ధనం = డబ్బు
10. బలపం పలకపుల్ల
భరతం = భారతదేశం, సంగతి
5. కింది అక్షరాలను క్రమపరచి సరైన పదాలుగా రాయండి. చదవండి.
ఉదా : 1. రఅక : అరక
2. లబత = తబల
3. డవప = పడవ
4. జనవ = వనజ
5. రంగన = నగరం
6. రంగత = తగరం
7. ఆదంనం = ఆనందం
8. కంతసం = సంతకం
9. డరంకం = కండరం
10. పండమం = మండపం
6. కింది పట్టికలలోని పదాలను చదవండి. రెండేసి పదాలను కలిపి అర్థవంతమైన పదబంధం లేదా వాక్యంగా చదవండి. రాయండి. ఉక్తలేఖనం రాయండి.
జవాబు:
ఉదా : 1. శంఖం ఊదగలం.
2. అమల పలక
3. మర పడవ
4. హంస నడక
5. పడవ పయనం
6. దశరథ తనయ
7. శనగల గంప
8. ఘనత గల వంశం
9. మంగళకర మండపం
10. శనగ పంట
అమ్మ ఒడి కవి పరిచయం
పేరు : బాడిగ వెంకట నరసింహారావు గారు.
కాలం : 15-8-1913 నుండి 6-1-1994 వరకు జీవించారు.
స్వగ్రామం : కృష్ణాజిల్లాలోని కౌతారంలో జన్మించారు.
రచనలు : బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు-హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారిలోకం, పూలబాలలు, ఋతువాణి మొదలైనవి 17 పుస్తకాలు.
బిరుదు : బాలబంధు
ధ్యేయం : బాల సాహిత్యాన్ని ఉద్యమస్ఫూర్తితో ప్రచారం చేయడం.
విశేషం : వింజమూరి లక్ష్మీనరసింహారావు గారు రచించిన ‘అనార్కలి’ నాటకంలో ‘అనార్కలి’ పాత్ర ధరించి, అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు.
గేయ భాగాలు – అర్థాలు – భావాలు
1. అమ్మ ఒడి చదువుల బడి మా
యమ్మ ఒడి నా కొక గుడి
అమ్మ చూపును ఒరవడి, దై
వమ్ము కంటెను త్వరపడి
అర్థాలు :
ఒరవడి = విద్యార్థులకు అక్షరాలను కుదురుగా నేర్పడానికి గురువులు ముందుగా రాసే మేలు బంతి.
దైవమ్ము = దేవుడు
భావం :
మా అమ్మ తన ఒడిలోనే ఎన్నో సంగతులు నాకు నేర్పిన తొలి గురువు. అమ్మే ఎల్లప్పుడూ నన్ను కాపాడుతూ నా బాగోగులు చూసే దేవుడు. అందుకే మా అమ్మ ఒడే నాకు బడి, గుడి. అంటే అమ్మ భగవంతుని కంటే ముందే త్వరగా నా భవిష్యత్తుకు ఒరవడి చూపిస్తుంది.
2. అమ్మ చెప్పిన సుద్దులు, అని
శమ్ము ఒప్పిన బుద్ధులు
అమ్మ పెదవుల హాసము ని
త్యమ్ము మాకు వికాసము
అర్థాలు :
సుద్దులు = సూక్తులు, మంచిమాటలు
అనిశమ్ము = ఎల్లప్పుడు
హాసము = నవ్వు
నిత్యమ్ము = ఎల్లప్పుడు
వికాసము = తెలివి
భావం :
అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ మాకు తెలివితేటలు కలిగిస్తాయి. అమ్మ పెదవుల మీది చిరునవ్వు మాకు నిరంతరం తెలివి ఇస్తుంది.
3. అమ్మ మంజుల భాషణం, శ్రా
వ్యమ్ము వీనుల భూషణం
అమ్మ హృది అనురాగము, ది
వ్యమ్ము భవ్యము యోగము
అర్థాలు :
మంజులం = అందం
భాషణం = మాట్లాడిన మాటలు
శ్రావ్యమ్ము = వినదగినవి
వీనులు = చెవులు
భూషణం = అలంకారం
హృది = మనస్సు
అనురాగం = ప్రేమ
దివ్యం = ఉత్తమము
భవ్యం = శుభకరమైనది
యోగం : అన్నింటినీ సమకూర్చేది
భావం :
అందంగా ఉండే అమ్మ మాటలు చెవికి ఇంపుగా ఉంటాయి. అవి మా చెవులకు అలంకారాలు. అమ్మ మనస్సు ప్రేమతో నిండి ఉంటుంది. ఆ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది. అన్నింటిని సమకూర్చేది.
4. అమ్మ చల్లని కరములు దా
నమ్మునకు ఆకరములు
అమ్మ చరణ తలమ్ములు క్షే
మమ్ము పండు పొలమ్ములు
అర్థాలు :
కరములు = చేతులు
ఆకరములు = నిలయమైనవి
చరణములు = పాదములు
తలమ్ములు = చోట్లు
క్షేమము = శుభం
భావం :
అమ్మ చల్లని చేతులు దానధర్మాలకు నిలయాలు. అమ్మ పాదాలు సోకిన నేల శుభాలు పండే పొలం వంటిది.
5. అమ్మ కన్నుల కాంతులు లో
కమ్మునకు సుఖశాంతులు
అమ్మయే నా సర్వము దై
ఆర్యమ్ము బలమూ గర్వము
అర్థాలు :
లోకం = జగత్తు
సర్వము = సమస్తం, సర్వస్వం
AP Board Textbook Solutions PDF for Class 6th Telugu
- AP Board Class 6
- AP Board Class 6 Telugu
- AP Board Class 6 Telugu Chapter 1 అమ్మ ఒడి
- AP Board Class 6 Telugu Chapter 2 తృప్తి
- AP Board Class 6 Telugu Chapter 3 మాకొద్దీ తెల్ల దొరతనము
- AP Board Class 6 Telugu Chapter 4 సమయస్ఫూర్తి
- AP Board Class 6 Telugu Chapter 5 మన మహనీయులు (ఉపవాచకం)
- AP Board Class 6 Telugu Chapter 6 సుభాషితాలు
- AP Board Class 6 Telugu Chapter 7 మమకారం
- AP Board Class 6 Telugu Chapter 8 మేలుకొలుపు
- AP Board Class 6 Telugu Chapter 9 ధర్మ నిర్ణయం
- AP Board Class 6 Telugu Chapter 10 త్రిజట స్వప్నం
- AP Board Class 6 Telugu Chapter 11 డూడూ బసవన్న
- AP Board Class 6 Telugu Chapter 12 ఎంత మంచివారమ్మా….! (ఉపవాచకం)
- AP Board Class 6 Telugu 6th Class Telugu Grammar
- AP Board Class 6 Telugu లేఖలు
- AP Board Class 6 Telugu వ్యాసాలు
- AP Board Class 6 Telugu పదాలు – అర్థాలు
0 Comments:
Post a Comment