Hsslive.co.in: Kerala Higher Secondary News, Plus Two Notes, Plus One Notes, Plus two study material, Higher Secondary Question Paper.

Sunday, September 11, 2022

AP Board Class 8 Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Book Answers

AP Board Class 8 Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Book Answers
AP Board Class 8 Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Book Answers


AP Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbooks Solutions and answers for students are now available in pdf format. Andhra Pradesh Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Book answers and solutions are one of the most important study materials for any student. The Andhra Pradesh State Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు books are published by the Andhra Pradesh Board Publishers. These Andhra Pradesh Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు textbooks are prepared by a group of expert faculty members. Students can download these AP Board STD 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు book solutions pdf online from this page.

Andhra Pradesh Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbooks Solutions PDF

Andhra Pradesh State Board STD 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbooks. These Andhra Pradesh State Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.

Andhra Pradesh State Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Books Solutions

Board AP Board
Materials Textbook Solutions/Guide
Format DOC/PDF
Class 8th
Subject Social Studies
Chapters Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు
Provider Hsslive


How to download Andhra Pradesh Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook Solutions Answers PDF Online?

  1. Visit our website - Hsslive
  2. Click on the Andhra Pradesh Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Answers.
  3. Look for your Andhra Pradesh Board STD 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbooks PDF.
  4. Now download or read the Andhra Pradesh Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook Solutions for PDF Free.


AP Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbooks Solutions with Answer PDF Download

Find below the list of all AP Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:

8th Class Social Studies 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
అధ్యాయంలోని ఒక్కొక్క భాగం ఆధారంగా చిన్న చిన్న ప్రశ్నలు తయారుచేసి ఒకరినొకరు అడగండి. సమాధానాలు సరిగానే ఉన్నాయేమో చూడండి. (AS4)
1. ‘ఖుదా ఖాన్’ అంటే ఏమిటి?
జవాబు:
‘ఖుద్ ఖాన్’ అంటే సొంతంగా సాగుచేసుకునే భూమి.

2. శాశ్వతశిస్తు నిర్ణయ పద్ధతిని ఎవరు, ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జవాబు:
1793లో కారన్‌వాలీస్ ప్రవేశపెట్టాడు.

3. జమీందారులు శిస్తు కట్టలేకపోతే ఏమి జరిగేది?
జవాబు:
వారు జమీని కోల్పోవలసి వచ్చేది.

4. సీడెడ్ జిల్లాలు అంటే ఏవి?
జవాబు:
బళ్లారి, అనంతపురం, కర్నూలు, కడప.

5. ప్రకాశం బ్యారేజీని నిర్మించినవారు ఎవరు?
జవాబు:
సర్ ఆర్థర్ కాటన్

6. రైత్వారీ శిస్తును ఎన్ని సంవత్సరాలను ఆధారం చేసుకుని నిర్ణయిస్తారు?
జవాబు:
20, 30 సంవత్సరాలు

7. అమెరికాలో అంతర్యుద్ధం ఎప్పుడు తలెత్తింది?
జవాబు:
1861

8. బలవంతంగా, డబ్బులు ఇవ్వకుండా చేయించుకునే పనిని ఏమంటారు?
జవాబు:
వెట్టిచాకిరి

9. జమీందారులు ఏ ఏ రూపాలలో రైతుల నుండి ఉచితంగా రాబడిని ఆశించేవారు?
జవాబు:
నెయ్యి, పాలు, కూరగాయలు, బెల్లం, గడ్డి, పిడకలు మొ||నవి.

10. పాత భూస్వాములకు నష్టపరిహారంగా ఏమి చెల్లించేవాళ్ళు? (హైదరాబాదులో)
జవాబు:
‘రుసుం’ అనే వార్షిక మొత్తాన్ని చెల్లించేవాళ్ళు.

11. తీవ్రమైన కరవు ఏది?
జవాబు:
గంజాం కరవు

12. రైతాంగ ఉద్యమాలను రెండింటిని పేర్కొనండి.
జవాబు:
డెక్కన్ తిరుగుబాటు, రంపా ఫితూరీలు మొఫా పోరాటం మొ||నవి.

ప్రశ్న 2.
స్వాతంత్ర్యానికి ముందు కౌలు రైతుల పరిస్థితిని నేటి రైతుల పరిస్థితితో పోల్చండి. ఏయే తేడాలు, పోలికలు ఉన్నాయి? (AS1)
జవాబు:
తేడాలు :
ఆ రోజులలో రైతులు భూమి కౌలు చెల్లించలేక కొన్ని సందర్భాలలో భూములు వదిలి పారిపోయేవారు. కౌలు చెల్లించడానికి రైతు వడ్డీ వ్యాపారస్తుని వద్ద అప్పు తీసుకోవాల్సి వచ్చేది. చెల్లించలేని వారి నుండి భూమిని లాక్కునేవారు. శిస్తుకు 3 నుండి 7 రెట్లు కౌలు ఉండేది. నేటి రైతులు కౌలును సాంకేతికత ఆధారంగా నిర్ణయించి చెల్లిస్తారు. చెల్లించలేని పక్షంలో బ్యాంకుల నుండి అప్పు తీసుకుని చెల్లిస్తారు.

పోలికలు :
నాడు, నేడు కూడా కాలుదారుల పరిస్థితి దయనీయంగానే ఉంది. కౌలుకిచ్చిన రైతుల తరువాతి కాలంలో దాని అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. కౌలుదారులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

ప్రశ్న 3.
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో జమీందారులు సాధారణంగా బ్రిటిషు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. కారణాలు ఏమై ఉంటాయో తెలియచేయండి. (AS1)
జవాబు:
కొంతమంది జమీందారులు వారు అనుసరించిన విధానాల వలన ప్రజలకు దూరమయ్యారు. బ్రిటిషు వారి ఆధ్వర్యంలో వీరు ఆస్తులు బాగా సంపాదించుకున్నారు. ఈ కారణాల వల్ల కొంతమంది జమీందారులు బ్రిటిషు ప్రభుత్వానికి మద్దతునిచ్చారు.

ప్రశ్న 4.
రైతాంగ జీవితాలలో వడ్డీ వ్యాపారస్తుల పాత్ర ఏమిటి? వాళ్ళకు బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా ఏ విధమైన మద్దతు లభించింది? (AS1)
జవాబు:
శిస్తులు కట్టడానికి రైతులు వడ్డీ వ్యాపారస్థుల నుంచి చాలాసార్లు అప్పులు చేయాల్సి వచ్చేది. అయితే వాళ్ళు సకాలంలో అప్పులు చెల్లించకపోతే వడ్డీ వ్యాపారస్తులు కోర్టుకు వెళ్ళి భూములు వేలం వేయించి తమ అప్పులు వసూలు చేసుకునే వాళ్ళు, శిస్తు వసూలుకు, బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానం వల్ల అనేక మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. తమ పట్టులోకి వచ్చే రైతుల సంఖ్య పెరుగుతుండటంతో వడ్డీ వ్యాపారస్తుల సంపద కూడా పెరుగుతూ వచ్చింది.

బ్రిటిష్ ప్రభుత్వం శిస్తు వసూలు మీద చూపించిన శ్రద్ధ, రైతుల సంక్షేమంలో చూపించలేదు. వడ్డీ వ్యాపారస్థులకు ఈ విధంగా మద్దతు లభించినట్లయింది.

ప్రశ్న 5.
తెలంగాణ దొరలు, అవధ్ జమీందారుల మధ్య తేడాలు, పోలికలు ఏమిటి? (AS1)
జవాబు:
తేడాలు :

  1. తెలంగాణ దొరలు నిజాం పాలనలో, అవధ్ జమీందారులు బ్రిటిష్ పాలనలో ఉండేవారు.
  2. దొరలు వసూలు చేసిన శిస్తును నిజాంకు చెల్లిస్తే, జమీందారులు బ్రిటిష్ వారికి చెల్లించేవారు.
  3. దొరలు మనుషుల్ని బానిసలుగా చూశారు. జమీందారులు కేవలం ఆర్థికంగానూ, శ్రమపరంగాను దోచుకున్నారు.

పోలికలు :

  1. ఇరువురూ రైతులను అక్రమంగా దోచుకున్నారు.
  2. అధిక మొత్తంలో భూములను కలిగి ఉన్నారు.
  3. వేరే వారి ఆధీనంలో ఉంటూనే స్వతంత్రంగా వ్యవహరించారు.

ప్రశ్న 6.
వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటానికి బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? వాళ్ళు ఆశించిన ఫలితాలు వచ్చాయా? మీ కారణాలు తెలియచేయండి. (AS1)
జవాబు:
వ్యవసాయాభివృద్ధికి బ్రిటిష్ వారు భారీ నీటి సాగు పథకాలలో పెట్టుబడులు పెట్టడం ప్రభుత్వ విధి అని భావించారు. ఆనకట్టలు, కాలువలు నిర్మించారు. భూమికి చట్టబద్ధ యజమానులు ఎవరో నిర్ణయించారు. దిగుబడులు, ధరలు, మార్కెట్ పరిస్థితులు, సాగుచేసే పంటలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎకరాకు చెల్లించాల్సిన శిస్తుని నిర్ణయించారు. పంటల సాగు మొదలుకాక ముందు విత్తనాలు, పరికరాలు, ఎడ్లు కొనడానికి, పాత బావులు మరమ్మతు చేయటానికి, కొత్త బావులు తవ్వటానికి రైతులకు అప్పులు ఇప్పించారు. ఈ చర్యల వల్ల ఆ సంవత్సరం పంటలు బాగా పండి శిస్తు, వసూళ్ళు బాగా జరిగాయి. కాబట్టి వారు అనుసరించిన విధానం సరైనదేనని నేను చెప్పగలను.

ప్రశ్న 7.
రైత్వారీ వ్యవస్థ కూడా భూస్వామ్యానికి ఎలా దోహదం చేసింది? (AS1)
జవాబు:
రైత్వారీ ప్రాంతాలలో కూడా భూమిశిస్తుని చాలా ఎక్కువగా నిర్ణయించారు. జమీందారీ ప్రాంతాలలో మాదిరి కాకుండా దీనిని 20, 30 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయిస్తారు. ఈ కాలం ముగిసిన తరవాత మారిన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని శిస్తును తిరిగి నిర్ణయించేవాళ్లు. భూమిశిస్తు చాలా ఎక్కువగా ఉండి మొదట్లో దానిని బలవంతంగా వసూలు చేయాల్సి వచ్చేది. అయితే కొంతకాలానికి భూమిశిస్తు కంటే ధరలు వేగంగా పెరగటంతో రైతులు’ తమ భూములను సాగు చేయడానికి కౌలుదారులకు ఇచ్చి వారినుంచి పంట వసూలు చేయటం సైతం లాభసాటిగా ఉండేది. అనతికాలంలోనే రైత్వారీ ప్రాంతాలలో కూడా భూస్వాములు ఏర్పడి తమ భూములను నిస్సహాయులైన కౌలుదారులకు అధిక మొత్తం కౌలుకు ఇవ్వసాగారు. ‘రైతులు’ ప్రభుత్వానికి చెల్లించే భూమిశిస్తు కంటే కౌలుదారులు మూడునుంచి ఏడు రెట్లు ఎక్కువ కౌలు చెల్లించేవాళ్ళు. (అంటే రైతు కొంత భూమికి వంద రూపాయలు భూమిశిస్తుగా ప్రభుత్వానికి చెల్లిస్తుంటే అదే భూమి నుంచి కౌలుగా 300 నుంచి 700 రూపాయలు కౌలుగా లభించేది. ) ఫలితంగా వాళ్లకు కూడా వ్యవసాయాన్ని మెరుగుపరచటానికి పెట్టుబడులు పెట్టడంలో ఆసక్తి లేకుండా పోయింది. ఎక్కువ మొత్తాలకు భూమిని కౌలుకు ఇవ్వటంపైనే దృష్టి పెట్టారు. ఈ విధంగా రైత్వారీ వ్యవస్థ కూడా భూస్వామ్యానికి దోహదం చేసింది.

ప్రశ్న 8.
బ్రిటిషు పాలనలో కరవులు ఎందుకు సంభవించాయి? అవి వరదలు లేక వర్షాలు పడకపోవటం వల్ల వచ్చాయని మీరు భావిస్తున్నారా? (AS1)
జవాబు:
కరవులు వరదలు, వర్షాలు పడకపోవడం వల్ల అతి తక్కువగా సంభవించాయి. అధిక శాతం కరవులు బ్రిటిషు వారి . నిరంకుశ విధానాల వల్ల తలెత్తేవి. ఇక్కడ ప్రజలకు తిండిలేని సమయంలో వారు ఆహారధాన్యాలను విదేశాలకి ఎగుమతి చేసేవారు. వ్యాపారస్తులు కృత్రిమ కొరతను సృష్టించినప్పుడు జోక్యం చేసుకునేవారు కాదు. వీరు ప్రజల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందువలన కరవులు సంభవించాయి.

ప్రశ్న 9.
పంటలు పండనప్పుడు కూడా కరవు రాకుండా ప్రభుత్వం ఎలా సహాయపడగలదు? (AS1)
జవాబు:

  1. ప్రభుత్వం తాను కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందించటం ద్వారా
  2. నీటి వసతులు కల్పించటం ద్వారా
  3. రైతుల ఋణాల చెల్లింపును వాయిదా వేయటం ద్వారా
  4. మిగులు పంటలను, ఎండబెట్టి నిలువచేయటం ద్వారా
    పంటలు పండనప్పుడు కరవు రాకుండా సాయపడగలదు.

ప్రశ్న 10.
బ్రిటిషు ప్రభుత్వ విచారణ సంఘానికి ఒక వినతిపత్రాన్ని ఇవ్వబోతున్నారని ఊహించుకోండి; కౌలు రైతుల సమస్యలను పేర్కొంటూ ఒక వినతిపత్రాన్ని తయారుచేయండి. (AS6)
జవాబు:
వినతిపత్రం

అయ్యా !
భారతదేశంలో స్థానికులమైన మేము మా పొలాలకే అధిక కౌలు ఇవ్వాల్సిన పరిస్థితిని తలుచుకుని సిగ్గుపడుతూ మీకు ఈ విన్నపాలను అందిస్తున్నాము. రైతులు, భూస్వాములు, జమీందారులు మాకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు. తద్వారా మాకు నీటిపారుదల వసతులు, ఇతరములు ఏవీ అందడం లేదు. వసతులు లేకుండా మామూలు దిగుబడి కూడా మేము పొందలేకపోతున్నాము. మీరు అమలుపరిచే శిస్తు విధానాలు కూడా మాకు అనుసరణీయంగా లేవు. కౌలు రేట్లు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అవి శిస్తుకు ఏడు రెట్లుగా ఉన్నాయి. వడ్డీ వ్యాపారస్తులు మా పొలాలను, ఇండ్లను వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. తమరు వీటినన్నింటిని దృష్టియందుంచుకుని మాకు తగిన మేలు చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాము.

కృతజ్ఞతలతో ….

ఇట్లు
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం

ప్రశ్న 11.
భారతదేశ పటంలో ఈ కింది వానిని గుర్తించండి. (AS5)
1. గంజాం 2. అవధ్ 3. హైదరాబాద్ 4. గోదావరి నది
జవాబు:

ప్రశ్న 12.
“అంతులేని వసూళ్ళు, శిస్తులు, చెల్లింపులు” శీర్షిక కింద గల పేరాను చదివి కింది ప్రశ్నకు జవాబు రాయండి.

రకరకాల సాకులతో రైతుల నుంచి సాధ్యమైనంత డబ్బు వసూలు చేయటానికి జమీందారులు ప్రయత్నించారు. జమీందారు ఇంటికి నెయ్యి, పాలు, కూరగాయలు, బెల్లం, గడ్డి, పిడకలు వంటివి రైతులు ఉచితంగా నిత్యం సరఫరా చేయాలి. భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉండేది. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ లో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవాళ్లు. ఒక్కొక్కరి కింద డజన్లు, వందల గ్రామాలు ఉండేవి. జమీందారుల ఆగడాలను ప్రతిఘటించటానికి రైతులు ప్రయత్నించేవాళ్లు.
ప్రస్తుత రోజులలో శిస్తును ఏ విధంగా చెల్లిస్తున్నారు? (AS2)
జవాబు:
ప్రస్తుత రోజులలో శిస్తును డబ్బు రూపేణా మాత్రమే చెల్లిస్తున్నారు.

8th Class Social Studies 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు InText Questions and Answers

8th Class Social Textbook Page No.111

ప్రశ్న 1.
మొఘల్ కాలంలో గ్రామాల్లోని భూములన్నీ జమీందారుల కింద ఉండేవా?
జవాబు:
మొఘలుల కాలంలో భూముల మీద శిస్తు వసూలు అధికారం జమీందారుల కింద ఉండేది. భూములు జమీందారుల కింద కొంత, రైతాంగం కింద కొంత, ఇతరుల కింద కొంత భూమి ఉండేది.

ప్రశ్న 2.
మొఘల్ ప్రభుత్వానికి జమీందారులు ఏం చేసేవాళ్లు, దానికి ప్రతిఫలంగా వాళ్లకు ఏం లభించేది?
జవాబు:
మొఘల్ చక్రవర్తుల పాలనలో రైతాంగం నుంచి జమీందారులు శిస్తు వసూలు చేసి మొఘల్ అధికారులకు అందచేసేవారు. శిస్తు వసూలు చేసినందుకు జమీందారులకు అందులో కొంత వాటా, ఒక్కొక్కసారి స్థానికంగా చిన్న చిన్న పన్నులు వసూలు చేసే అధికారం ఇవ్వబడినది.

8th Class Social Textbook Page No.112

ప్రశ్న 3.
స్వంతంగా వ్యవసాయం చేసుకుంటున్న వాళ్లకు జమీందారులు ఏ విధంగానైనా సహాయపడి ఉంటారా? మీ సమాధానానికి – కారణాలు ఇవ్వండి.
జవాబు:
జమీందారులు మొఘలుల కాలంలో కొంతవరకు మధ్యవర్తులుగా వ్యవహరించి సహాయం చేశారని చెప్పవచ్చు. బ్రిటిష్ వారి కాలంలో వారు ఏమీ సాయం చేయలేదు. అలా చేసి ఉంటే వారు శిస్తు చెల్లించలేక జమీలు కోల్పోయేవారు కాదు. వీరి జమీలు వేలాల్లో ఇంకొకరికి పోయేవి కాదు. తరచూ జమీందారులు మారే వారు కాదు.

ప్రశ్న 4.
జమీందారులు చిన్న కోటల్లాంటి ఇళ్లల్లో ఉంటూ, సైన్యాన్ని ఎందుకు కలిగి ఉండేవాళ్లు?
జవాబు:
జమీందారుల అజమాయిషీలో కొన్ని గ్రామాలుండేవి. వీరు ఆ గ్రామాల ప్రజలకు పైనున్న పాలకులకు మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. వారికి చాలా ఆదాయం ఉండేది. వారి జమీ మొత్తానికి వాళ్ళు రాజుల్లాంటి వారు కాబట్టి చిన్నకోటల్లాంటి ఇంట్లో ఉండేవారు.

తమ జమీలోని గ్రామాల ప్రజలను దోపిడీలు, దాడుల నుండి కాపాడాలన్నా, భయట్టి శిస్తు వసూలు చేయాలన్నా వీరికి అంగబలం కావాలి. అందువల్ల సైన్యాన్ని కలిగి ఉండేవాళ్ళు.

8th Class Social Textbook Page No.113

ప్రశ్న 5.
అనేక తరాలుగా భూమిని సాగు చేస్తున్న రైతు స్థితిని ఈ మార్పులు ఎలా ప్రభావితం చేశాయి?
జవాబు:

  1. ఈ సెటిల్మెంట్ వల్ల రైతాంగం కాస్తా కౌలుదారులుగా మారిపోయింది.
  2. శిస్తు కంటే కౌలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల రైతులు ఆ మొత్తాలు చెల్లించలేక కొన్ని సందర్భాలలో భూమిని వదిలి పారిపోయేవారు.

రైతు స్థితిని ఈ మార్పులు పై విధంగా ప్రభావితం చేశాయి.

ప్రశ్న 6.
శిస్తుకు, కౌలుకు మధ్య తేడా ఏమిటి?
జవాబు:
శిస్తు :
వ్యక్తులు రైతులు తమ స్వంత భూమిలో పంట పండించి దానికిగాను జమిందార్లకు ప్రభుత్వానికి చెల్లించే దానిని శిస్తు అంటారు.

కౌలు :
వ్యక్తులు రైతులు ఇతరుల భూములను తీసుకుని పంట పండించుతారు. దీనికి గాను వారు భూమి యజమానికి చెల్లించే దానిని శిస్తు అంటారు.

ప్రశ్న 7.
శాశ్వతశిస్తు నిర్ణయ పద్ధతి ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం, జమీందారులు, రైతాంగాల్లో ఎవరు ఎక్కువ లాభపడ్డారు ? కారణాలు పేర్కొనండి.
జవాబు:
ఈ పద్ధతి ద్వారా జమీందారులు ఎక్కువ లాభపడ్డారు.

కారణాలు :

  1. బ్రిటిష్ వారికి కేవలం 10 శాతం మాత్రమే శిస్తు కట్టేవారు. ఇది ముందే నిర్ణయించబడినది. అధిక వసూళ్ళలో వారికి వాటా ఇవ్వలేదు.
  2. రైతాంగం ఎక్కువ శిస్తులను చెల్లించాల్సి వచ్చింది. శిస్తులు చెల్లించలేనివారు వారి. భూములను పోగొట్టుకునేవారు. వీరు మొత్తం కౌలుదారులుగా మారిపోయారు.

8th Class Social Textbook Page No.114

ప్రశ్న 8.
భూమి మీద ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా తమ ఆదాయాలను పెంచుకోవడం జమీందారులకు ఎలా సాధ్యమయ్యింది?
జవాబు:
మార్కెట్టులో ఆహారధాన్యాల ధరలు పెరుగుతుండటంతో సాగు మెల్లగా విస్తరించింది. దీనివల్ల పెట్టుబడులు లేకుండానే జమీందారుల ఆదాయం పెరిగింది.

ప్రశ్న 9.
బ్రిటిష్ పాలనను జమీందారులు సమర్థించారా, వ్యతిరేకించారా? మీ కారణాలు పేర్కొనండి.
జవాబు:
బ్రిటిష్ పాలనను జమీందారులు సమర్ధించారు.

కారణాలు:

  1. వీరు బ్రిటిష్ వారిని వ్యతిరేకించలేదు.
  2. బ్రిటిష్ వారు చెప్పినదానికన్నా ఎక్కువ శిస్తు వసూలు చేశారు.
  3. శిస్తు కట్టలేని వారిని నిర్దయగా తొలగించారు.
  4. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదు.

ప్రశ్న 10.
బ్రిటిషు ప్రభుత్వం జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఉద్దేశాలు ఎందుకు నెరవేరలేదు?
జవాబు:

  1. జమీందారులు భూమిని అభివృద్ధిపరచలేదు.
  2. జమీందారులు ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదు.
  3. శిస్తు చాలా ఎక్కువగా ఉండేది.
  4. పంట నష్టపోయినప్పుడు, కరవు సమయాలలోనూ ఎటువంటి మినహాయింపులు ఉండేవి కావు.
  5. కంపెనీ వేలం పాటల్లో జమీందారులను ఇట్టే మార్చేసేది.
  6. వచ్చిన జమీందారులు తాము సంపాదించుకోవడానికే చూశారు కానీ వ్యవస్థను కాపాడలేదు.
  7. భూస్వాములు వడ్డీ వ్యాపారస్తుల పాలుపడ్డారు.

ఈ కారణాలన్నింటి రీత్యా జమీందారీ వ్యవస్థ ఉద్దేశాలు నెరవేరలేదు.

8th Class Social Textbook Page No.115

ప్రశ్న 11.
బ్రిటిష్ పాలన ఆరంభంలో వ్యవసాయంలో ప్రభుత్వం ఏ విధమైన పెట్టుబడులు పెట్టింది? ఈ పనిని రైతులు స్వయంగా చేయగలిగి ఉండేవాళ్లా?
జవాబు:

  1. పంటల సాగు మొదలుకాక ముందు విత్తనాలు, పరికరాలు, ఎడ్లు కొనటానికి, పాత బావులు మరమ్మతు చేయటానికి, కొత్త బావులు తవ్వటానికి అప్పులు ఇప్పించారు.
  2. భారీ నీటిసాగు పథకాలలో పెట్టుబడులు పెట్టారు.
  3. కాలువలు నిర్మించారు.

ఇంత పెద్ద మొత్తాలను ఖర్చు పెట్టి రైతులు స్వయంగా చేయలేరు.

ప్రశ్న 12.
రైత్వారీ స్థిరీకరణను ప్రవేశపెట్టే కంటే ముందు పాలెగార్లను ఎందుకు ఓడించాల్సి వచ్చింది?
జవాబు:
పాలెగార్లు బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తూ సాయుధ అనుచరులను కలిగి ఉండేవారు. దోపిడీలు, దాడులు సాగించేవారు. వీరున్నంతకాలం భూమికి అసలు యజమానులెవరో గుర్తించడం కష్టం. వీరిని అణిచివేస్తే తప్ప రైత్వారీ స్థిరీకరణం కష్టం. అందువలన ముందు పాలెగార్లను ఓడించాల్సి వచ్చింది.

ప్రశ్న 13.
జమీందారులు చిన్న కోటల్లాంటి ఇళ్ళల్లో ఉంటూ సైన్యాన్ని ఎందుకు కలిగి ఉండేవాళ్ళు?
జవాబు:
జమీందారుల అజమాయిషీలో కొన్ని గ్రామాలుండేవి. వీరు ఆ గ్రామాల ప్రజలకు పైనున్న పాలకులకు మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. వారికి చాలా ఆదాయం ఉండేది. వారి జమీ మొత్తానికి వాళ్ళు రాజుల్లాంటి వారు కాబట్టి చిన్నకోటల్లాంటి ఇంట్లో ఉండేవారు.

తమ జమీలోని గ్రామాల ప్రజలను దోపిడీలు, దాడుల నుండి కాపాడాలన్నా, భయ పెట్టి శిస్తు వసూలు చేయాలన్నా వీరికి అంగబలం కావాలి. అందువల్ల సైన్యాన్ని కలిగి ఉండేవాళ్ళు.

ప్రశ్న 14.
‘శాశ్వత స్థిరీకరణ’ను ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున భూసర్వే చేపట్టలేదు. ‘రైత్వారీ స్థిరీకరణ’ సమయంలో ఇది ఎందుకు అవసరమయ్యిందని మీరు భావిస్తున్నారు?
జవాబు:
శాశ్వత స్థిరీకరణలో బ్రిటిషు వారు జమీందారులను మధ్యవర్తులుగా ఉంచి సరియైన ఆదాయాన్ని పొందలేకపోయారు. రైతులకు అభివృద్ధి కార్యక్రమాలు లేక కుంటుపడ్డారు. అందుకని అధిక ఆదాయం కోసం నేరుగా రైతుల నుండే శిస్తు వసూలు చేయాలని భావించారు. కాబట్టి పెద్ద ఎత్తున భూ సర్వే చేపట్టడం అవసరమయింది.

8th Class Social Textbook Page No.116

ప్రశ్న 15.
రైత్వారీ స్థిరీకరణ వల్ల రైతులు, భూస్వాములు, బ్రిటిష్ పాలకులలో ఎవరు లబ్ది పొందారు? మీ సమాధానానికి కారణాలు ఇవ్వండి.
జవాబు:
రైత్వారీ స్థిరీకరణ వల్ల భూస్వాములు ఎక్కువ లబ్ధి పొందారని చెప్పవచ్చు.

కారణాలు :

  1. రైత్వారీ ప్రాంతాలలో భూస్వాములు ఎక్కువ ఏర్పడ్డారు.
  2. వ్యవసాయం చేయడం కన్నా కౌలుకి ఇవ్వడం పైనే ఎక్కువ ఆసక్తి కనబర్చారు.

ప్రశ్న 16.
మీరు ఊహించిన దానినీ, వాస్తవంగా జరిగిన దానిని పోల్చండి. మీ అంచనాలు ఎంతవరకూ నిజమయ్యాయి?
జవాబు:
రైత్వారీ పద్ధతి వల్ల రైతుల పరిస్థితి మెరుగుపడుతుందని భావించాను. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని భావించాను. కాని అవన్నీ తలకిందులయ్యాయి. రైతులు భూస్వాముల కింద, కౌలుదారులు కూలీల కింద మారిపోయారు.

ప్రశ్న 17.
వ్యవసాయాన్ని విస్తరించడంలో గానీ, మెరుగుపరచడంలో కానీ రైతులు పెట్టుబడులు ఎందుకు పెట్టలేదు?
జవాబు:
భూమిశిస్తు కంటే ధరలు వేగంగా పెరగటంతో రైతులు తమ భూములను సాగు చేయడానికి కౌలుదారులకు ఇచ్చి వారి నుంచి పంట వసూలు చేయడం లాభసాటిగా ఉండేది. అందువలన వారు వ్యవసాయాన్ని విస్తరింపచేయకుండా, మెరుగు పరచకుండా, పెట్టుబడులు పెట్టకుండా కౌలుకివ్వడం మీద దృష్టిపెట్టారు.

ప్రశ్న 18.
భూమిలేని కౌలు రైతుల స్థితిగతులను ఊహించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
భూమి ఉన్న కౌలు రైతులు తాము కౌలు తీసుకున్న భూమికి ఎక్కువ శిస్తు చెల్లించినా, కొంత లాభం వారి భూమి నుండి పొందుతారు. కాని భూమిలేని కౌలు రైతుల జీవితం దుర్భరం. వారు పండిన పంటకు ఎన్నో రెట్లు కౌలు చెల్లించాల్సి వస్తుంది. శిస్తు కూడా చెల్లించాల్సి ఉంటుంది. వ్యవసాయానికి మెరుగుపరచటానికి, పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి, వీలు ఉండదు. శిస్తు, కౌలు చెల్లింపులకు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తారు. వాటిని చెల్లించలేక ఆస్తులు వేలం వేయించుకుంటారు. ఇంత కష్టపడినా ధర నిర్ణయం వీరి ఆధీనంలో ఉండదు. ధర అంతర్జాతీయ మార్కెట్ ను అనుసరించి ఉంటుంది. ఇది వీరిని మరింత నష్టపరుస్తుంది. లాభం కోసం వాణిజ్య పంటలు పండిస్తే, అది ప్రజలకు ఆహార కొరత నేర్పరుస్తుంది. కొన్ని సంవత్సరాల తరువాత వీరు శిస్తును, కౌలును చెల్లించలేక ఊరు విడిచి పారిపోతారు. అలాగే ‘గంజాం కరవు’ వల్ల అనేకమంది మారిషస్, ఫిజిలాంటి ఇతర దూరప్రాంతాలకు కూలీలకు వలస వెళ్ళారు.

8th Class Social Textbook Page No.117

ప్రశ్న 19.
ఎగుమతి కోసం ఉత్పత్తి చేపట్టినందువల్ల అంతిమంగా ఎవరు లాభపడ్డారు? వాళ్లు ఏ విధంగా లాభపడ్డారు?
జవాబు:
ఎగుమతి కోసం ఉత్పత్తి చేపట్టినందువల్ల అంతిమంగా వడ్డీ వ్యాపారస్తులు లాభపడ్డారు. వీరు రైతులకు ఎక్కువ మొత్తాలను, అధిక వడ్డీలకు అప్పులిచ్చి లాభపడ్డారు.

ప్రశ్న 20.
భూమిశిస్తు వల్ల రైతుల భూములు ఏ విధంగా వడ్డీ వ్యాపారస్తులపరం చేయబడ్డాయి ? వడ్డీ వ్యాపారస్తులు ఆ భూమితో ఏమి చేసి ఉంటారు?
జవాబు:
భూమిశిస్తులు అధికం కావడంవల్ల రైతులు వాటిని కట్టలేక వడ్డీలకు అప్పులు తీసుకునేవారు. వాటిని చెల్లించలేక వారి భూముల్ని, ఆస్తుల్ని వేలం వేయించుకుని, అప్పులు తీర్చేవారు. ఈ విధంగా వడ్డీ వ్యాపారస్తులు అనేక ఆస్తులు సంపాదించుకుని లాభపడ్డారు.

ప్రశ్న 21.
ప్రస్తుత కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు వేగంగా పెరిగి, పడిపోయిన సందర్భం గురించి విన్నారా ? దాని ప్రభావం రైతులపై ఎలా ఉంటుంది?
జవాబు:
గత కాలంలో బియ్యం, కందిపప్పు ధరలు అమాంతం పెరిగిపోయి, తర్వాత ప్రభుత్వంచే తగ్గించబడ్డాయి. రైతులు ఎక్కువ ఆదాయం వస్తుందని భావించి ఒక పంటను పండిస్తారు. దాని ధర పడిపోతే వారు దాని మీద పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందలేరు. వారికి ఆ సంవత్సరం ఆదాయం ఉండదు. వారు కోలుకోలేని దెబ్బతింటారు.

ప్రశ్న 22.
అధిక శిస్తు రేట్ల వల్ల భూస్వాములు, రైతులు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే పనులను ఎందుకు చేపట్టలేకపోయారు?
జవాబు:
భూస్వాములు, రైతులు తమ పంటల మీద వచ్చే ఆదాయంలో అధిక శాతం శిస్తులు చెల్లించేవారు. కొంత వారి కుటుంబ జీవనానికి వాడుకునేవారు. ఇంక వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే. పనులకు వారికి సొమ్ములెక్కడ ఉంటాయి. అందుకే వాటిని చేపట్టలేకపోయేవారు.

ప్రశ్న 23.
అమెరికాలో యుద్ధం వల్ల భారతదేశంలో ప్రత్తి ధరలు ఎందుకు పెరిగాయి?
జవాబు:
అమెరికా నుండి బ్రిటిష్ వారు ప్రతిని దిగుమతి చేసుకునేవారు. ఇది కారు చౌక రకం ప్రత్తి. అమెరికా అంతర్యుద్ధం వల్ల అక్కడి నుండి బ్రిటనకు ప్రత్తి లోటు ఏర్పడింది. అందువల్ల భారతదేశం నుండి ప్రత్తిని కొనుగోలు చేయటం మొదలు పెట్టారు. దానితో ప్రత్తికి గిరాకీ పెరిగి, ధరలు పెరిగాయి.

8th Class Social Textbook Page No.118

ప్రశ్న 24.
కౌలుదారులు ఉత్పత్తులను జమీందారులు ఏయే రూపాలలో కొల్లగొట్టేవారు?
జవాబు:

  1. జమీందారులు వాళ్ళ భూములలో రైతుల చేత బలవంతంగా ‘వెట్టి’ చేయించుకునేవారు.
  2. రకరకాల సాకులతో రైతుల నుంచి సాధ్యమైనంత డబ్బు వసూలు చేయటానికి జమీందారులు ప్రయత్నించారు.
  3. జమీందారు ఇంటికి నెయ్యి, పాలు, కూరగాయలు, బెల్లం, గడ్డి, పిడకలు వంటివి సరఫరా చేయాల్సివచ్చింది.

ఈ విధంగా కౌలుదారుల ఉత్పత్తులను శ్రమరూపంలోనూ, ధనరూపంలోనూ, వస్తురూపంలోనూ కొల్లగొట్టారు.

ప్రశ్న 25.
గ్రామ కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తిదారుల జీవితాల్లో వస్తున్న మార్పుల గురించి చర్చించండి.
జవాబు:
గ్రామ కళాకారులు పూర్వం ప్రజల ఆదరణ, రాజుల, జమీందారుల అండ పొందేవారు. కాని ఇప్పుడు చాలావరకు ఈ కళలు అడుగంటి పోయాయి. సంప్రదాయ చేతివృత్తిదారులు తమ వృత్తులలో సంప్రదాయంతో పాటు సాంకేతికతను కూడా జోడిస్తున్నారు. ప్రజలలో వీరి ఉత్పత్తులకు ఆదరణ ఉన్నా, ధరలు ఎక్కువవ్వడం మూలంగా అంత గిరాకీ ఉండటం లేదు. దాంతో వీరి జీవితాలు దుర్భరంగా ఉంటున్నాయి.

ప్రశ్న 26.
రైతులు తమ భూములపై పెట్టుబడులు పెట్టటానికి ఎందుకు ఆసక్తి చూపేవారు కాదు?
జవాబు:
రైతులు ఎంత పండించినా అది శిస్తుల కిందే పోయేది. అందుకని కౌలుకు ఇవ్వడానికి ఆసక్తి చూపేవారు. వచ్చిన కౌలును అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తే వారికి జీవన వ్యయం ఉండదు. అందువలన వారు తమ భూములపై పెట్టుబడి పెట్టటానికి ఆసక్తి చూపేవారు కాదు. అంతేకాక వారు భూమిని అభివృద్ధిపరచిన వెంటనే జమీందారు కౌలును పెంచేస్తాడు లేదా దానిని వారి దగ్గర నుండి వెనుకకు లాక్కుంటాడు. భూమి మీద హక్కుల కోసం పోరాడతారని – జమీందారులు కూడా భయపడి అభివృద్ధి పనులు చేపట్టనిచ్చేవారు కారు.

8th Class Social Textbook Page No.119

ప్రశ్న 27.
నిజాం రాష్ట్రంలో శిస్తు వసూలు చేసేవాళ్ల పరిస్థితి ఎలా మారుతూ వచ్చింది?
జవాబు:
నిజాం రాష్ట్రంలో జాగీర్దారులు, సంస్థానాలు, ఇనాందారులు వంటి మధ్య స్థాయి పెత్తందారులు చాలామంది ఉండేవాళ్ళు. వీళ్ళ కింద ఉన్న ప్రాంతానికి వీళ్ళే స్వతంత్ర అధిపతులు. వీళ్ళు భూమిశిస్తు వసూలు చేసి అందులోంచి కొంత మొత్తం ‘పేష్ కష్’గా నిజాంకి చెల్లించి మిగిలిన సొమ్ము మొత్తం తాము ఉంచేసుకునేవాళ్ళు. తమ ప్రాంతాల పరిపాలనకు వాళ్ళే బాధ్యత వహించేవారు. ఈ పెద్ద భూస్వాములను దొరలని వ్యవహరించేవారు. వీళ్ళు ‘గడీ’లనే కోటల్లాంటి పెద్ద పెద్ద ఇళ్ళల్లో, పెద్ద సంఖ్యలో సేవకులు, సైనికులతో ఉండేవారు. గ్రామంలోని వడ్డీ వ్యాపారులు కూడా వీళ్ళే. గ్రామంలో తీర్పు వీళ్ళే చెప్పేవారు. అందరూ వీరి ఆదేశాలను పాటించాల్సివచ్చేది. ఆ విధంగా శిస్తు వసూలు చేసే వారి పరిస్థితి ఉన్నత స్థాయికి చేరింది.

ప్రశ్న 28.
దొరకు, మామూలు భూస్వామికి తేడా ఏమిటి?
జవాబు:
పెద్ద పెద్ద భూస్వాములను దొరలు అంటారు. వీరు గ్రామానికి పెద్ద దిక్కులు. అన్ని రకాల హంగులు, ఆర్భాటాలు వీరికి ఉండేవి. అయితే భూస్వాములు ఈ దొరల అధికారానికి లోబడి పని చేసేవారు. భూస్వాములు దొరల మాటని విని తీరవలసిందే. అదే వీరిద్దరికీ తేడా.

ప్రశ్న 29.
వివిధ దోపిడీలలో రైతాంగం ‘వెట్టి’ని తీవ్రంగా ద్వేషించేవాళ్లు. కారణాలు పేర్కొనండి.
జవాబు:
వలస పాలనలో భూస్వాములు వారి స్వంత భూములలో రైతాంగంతో బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునే వాళ్లు. దీనినే వెట్టి అంటారు. రోడ్ల మీద వెళ్ళే వాళ్ళను కూడా బలవంతంగా తీసుకొచ్చి వెట్టి చేయించేవారు.

  1. దీనివల్ల వారు తమ పొలాల్లో సరిగా పని చేయలేరు.
  2. వారికి ఎటువంటి ఆదాయం ఉండదు.
  3. ఇది రాక్షసత్వ చర్య అని చెప్పుకోవచ్చు.
    ఇందువలన రైతులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించేవారు.

ప్రాజెక్టులు

ప్రశ్న 1.
అయిదుగురు విద్యార్థులతో ఒక బృందంగా ఏర్పడండి. గ్రామంలో అయిదుగురు పెద్దవాళ్ళను ఇంటర్వ్యూ చేసి బ్రిటిషు కాలంలో పరిసితులు ఎలా ఉండేవో తెలుసుకోండి. వీరిలో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి. కనీసం ఒకరు చేతివృత్తులకు చెందిన వాళ్లే ఉండాలి. వాళ్ళతో సుదీర్ఘంగా మాట్లాడి, వాళ్ళు చెప్పిన దాని ఆధారంగా ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
నివేదిక
బ్రిటిషువారు వారి స్వార్థం కోసం పనిచేసినా వారు భారతదేశంలో అభివృద్ధికి కారణమయ్యారు. కొంతమంది వారి పాలనను సమర్థించారు. కొంతమంది వ్యతిరేకించారు. భారతీయులు వీరి హయాంలో కొంతమంది అధికారాన్ని కొంత మంది హీనత్వాన్ని అనుభవించారు. మొత్తం మీద మనదేశంలో మనమే 2వ తరగతి పౌరులుగా చూడబడ్డాము. మహిళలకు విద్యావకాశాలు, స్వతంత్రత బ్రిటిషు వారి హయాంలో లభించాయి. బాల్య వివాహాల నిషేధం, వితంతు పునర్వివాహాలు మొదలగునవి వీరి వలనే వచ్చాయని చెప్పవచ్చు. కాని చేతివృత్తులు అడుగంటి పోయాయి. వీరి యంత్రాల పరిచయం, వాడకం భారతదేశంలో చేతివృత్తులను క్షీణింపచేశాయి. అవి ఇప్పటివరకూ కోలుకోలేదంటే అతిశయోక్తి కాదు అని చెప్పవచ్చును. మొత్తం మీద బ్రిటిషు వారి పాలన మనకు మిశ్రమ ఫలితాలను కలుగచేసింది.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో సంభవించిన కరవుల గురించి తెలుసుకోండి. ఆ సమయంలో ప్రజలు ఏం చేశారు?
జవాబు:
మాది గుంటూరు జిల్లాలో మంగళగిరి. బ్రిటిషువారి కాలంలో మా ఊరిలో 1832లో ఒక ‘భయంకరమైన తుపాను వచ్చిందట. 1833లో కరవు విలయతాండవం చేసిందట. ఒంగోలు నుండి మచిలీపట్నం వరకు శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉండేవట. గుంటూరు జిల్లా 5 లక్షల మంది జనాభాలో 2 లక్షల మంది మరణించారు. బ్రిటిషు ఈస్టిండియా కంపెనీవారు దీని తీవ్రతను గమనించకపోవడంతో మృతులు ఎక్కువయ్యారు. దీనిని పెద్ద కరవు, డొక్కల – కరవు అని పిలుస్తారు. 20 సంవత్సరాలకి గాని ఈ ప్రాంతంలో పరిస్థితి ఒక కొలిక్కి రాలేదట. ఈ సమయంలో ప్రజలు ఆకలి భరించలేక ఒకరినొకరు చంపుకున్నారని చెబుతారు. చాలా మంది ఇతర ప్రాంతాలకు వలసపోయారు.

ప్రశ్న 3.
మీ ప్రాంతం నుండి కువైట్, సౌదీ అరేబియా వంటి దూరప్రాంతాలకు వలస వెళ్ళిన కుటుంబాల గురించి తెలుసుకోండి.
జవాబు:
మాది తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది పాలెం గ్రామం. ఇది సఖినేటిపల్లి మండలంలో ఉన్నది. ఒకప్పుడు మా ప్రాంతంలోని చారంతా పొలాలలో పనిచేసుకుని జీవనం సాగించేవారు. కాని వీరిలో చాలామంది కువైట్, సౌదీ అరేబియాకు వలస వెళ్ళిపోయారు. అక్కడ వారు ఇంటిపనులు, కర్మాగారాల్లో పనులు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాటితో ఇక్కడ ఆస్తులను సమకూర్చుకుంటున్నారు. నేడు మా ప్రాంతంలో అధిక సంపన్నులు కువైట్, సౌదీ వెళ్ళి సంపాదించుకున్న వారేనని చెప్పవచ్చును.


AP Board Textbook Solutions PDF for Class 8th Social Studies


Andhra Pradesh Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbooks for Exam Preparations

Andhra Pradesh Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook Solutions can be of great help in your Andhra Pradesh Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు exam preparation. The AP Board STD 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbooks study material, used with the English medium textbooks, can help you complete the entire Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Books State Board syllabus with maximum efficiency.

FAQs Regarding Andhra Pradesh Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook Solutions


How to get AP Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook Answers??

Students can download the Andhra Pradesh Board Class 8 Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Answers PDF from the links provided above.

Can we get a Andhra Pradesh State Board Book PDF for all Classes?

Yes you can get Andhra Pradesh Board Text Book PDF for all classes using the links provided in the above article.

Important Terms

Andhra Pradesh Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు, AP Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbooks, Andhra Pradesh State Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు, Andhra Pradesh State Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook solutions, AP Board Class 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbooks Solutions, Andhra Pradesh Board STD 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు, AP Board STD 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbooks, Andhra Pradesh State Board STD 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు, Andhra Pradesh State Board STD 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook solutions, AP Board STD 8th Social Studies Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbooks Solutions,
Share:

0 Comments:

Post a Comment

Plus Two (+2) Previous Year Question Papers

Plus Two (+2) Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Physics Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Chemistry Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Maths Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Zoology Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Botany Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Computer Science Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Computer Application Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Commerce Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Humanities Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Economics Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) History Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Islamic History Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Psychology Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Sociology Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Political Science Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Geography Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Accountancy Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Business Studies Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) English Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Hindi Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Arabic Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Kaithang Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Malayalam Previous Year Chapter Wise Question Papers

Plus One (+1) Previous Year Question Papers

Plus One (+1) Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Physics Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Chemistry Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Maths Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Zoology Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Botany Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Computer Science Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Computer Application Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Commerce Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Humanities Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Economics Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) History Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Islamic History Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Psychology Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Sociology Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Political Science Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Geography Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Accountancy Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Business Studies Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) English Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Hindi Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Arabic Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Kaithang Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Malayalam Previous Year Chapter Wise Question Papers
Copyright © HSSlive: Plus One & Plus Two Notes & Solutions for Kerala State Board About | Contact | Privacy Policy