![]() |
AP Board Class 7 Telugu Chapter 14 కరపత్రం Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 7th Telugu Chapter 14 కరపత్రం Book Answers |
Andhra Pradesh Board Class 7th Telugu Chapter 14 కరపత్రం Textbooks Solutions PDF
Andhra Pradesh State Board STD 7th Telugu Chapter 14 కరపత్రం Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 7th Telugu Chapter 14 కరపత్రం Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 7th Telugu Chapter 14 కరపత్రం solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 7th Telugu Chapter 14 కరపత్రం Textbooks. These Andhra Pradesh State Board Class 7th Telugu Chapter 14 కరపత్రం Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.Andhra Pradesh State Board Class 7th Telugu Chapter 14 కరపత్రం Books Solutions
Board | AP Board |
Materials | Textbook Solutions/Guide |
Format | DOC/PDF |
Class | 7th |
Subject | Telugu |
Chapters | Telugu Chapter 14 కరపత్రం |
Provider | Hsslive |
How to download Andhra Pradesh Board Class 7th Telugu Chapter 14 కరపత్రం Textbook Solutions Answers PDF Online?
- Visit our website - Hsslive
- Click on the Andhra Pradesh Board Class 7th Telugu Chapter 14 కరపత్రం Answers.
- Look for your Andhra Pradesh Board STD 7th Telugu Chapter 14 కరపత్రం Textbooks PDF.
- Now download or read the Andhra Pradesh Board Class 7th Telugu Chapter 14 కరపత్రం Textbook Solutions for PDF Free.
AP Board Class 7th Telugu Chapter 14 కరపత్రం Textbooks Solutions with Answer PDF Download
Find below the list of all AP Board Class 7th Telugu Chapter 14 కరపత్రం Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:7th Class Telugu 14th Lesson కరపత్రం Textbook Questions and Answers
ఆలోచించండి – మాట్లాడండి
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
పై చిత్రం చూడండి. చిత్రంలో ఎవరెవరున్నారు ? ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
చిత్రంలో బాలబాలికలు ఉన్నారు. వారు ఊరేగింపుగా నడచి వెడుతున్నారు. వారు బాలల హక్కుల గురించి నినాదాలు ఇస్తున్నారు.
ప్రశ్న 2.
ఇలాంటి దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా?
జవాబు:
ఇలాంటి దృశ్యాల్ని నేను చాలామార్లు చూశాను. ఎయిడ్స్ వారోత్సవాలు, నెహ్రూ జయంతి ఉత్సవాలు, చిన్నపిల్లలకు టీకాలు వేయించడం, స్వచ్ఛభారత్ ఉద్యమం వంటి సందర్భాలలో పిల్లలు నినాదాలు చేస్తూ వీధుల్లో ఊరేగుతారు.
ప్రశ్న 3.
ఇలా ఎప్పుడెప్పుడు ఊరేగింపులు నిర్వహిస్తారు? ఎందుకు?
జవాబు:
ఇలాంటి ఊరేగింపులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, సేవాదళ్ కార్యకర్తలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు శోభాయాత్రలు చేస్తూ ఉంటారు. ప్రజలకు విషయాలు తెలియజేయడానికీ, తమ హక్కులను గూర్చి, – కోరికలను గూర్చి, ప్రభుత్వాలకు చాటి చెప్పడానికి ఇలాంటి ఊరేగింపులను నిర్వహిస్తారు.
ప్రశ్న 4.
ఊరేగింపులో ఏమి పంచుతున్నారు? వాటిని ఏమంటారు?
జవాబు:
ఊరేగింపులో కాగితాలు పంచుతున్నారు. వాటిని “కరపత్రాలు” అంటారు.
ఇవి చేయండి
I. వినడం – మాట్లాడడం
ప్రశ్న 1.
ఏదైనా ఒక కరపత్రాన్ని సేకరించండి. ఇద్దరిద్దరు కలిసి కూర్చోండి. ఒకరు తెచ్చిన కరపత్రాన్ని ఇంకొకరికి చదివి వినిపించండి. విన్న తరువాత ఆ కరపత్రంలో ఏ అంశాలు ఉన్నాయో చెప్పండి.
జవాబు:
నేను సేకరించిన కరపత్రం “సాయిబాబా గుడి ప్రారంభోత్సవానికి సంబంధించినది. మా నగరంలో కొత్తగా కట్టిన షిరిడీసాయి దేవాలయంలో వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజూ ఒక కార్యక్రమం ఉంది. వాటిని చూచి, ప్రసాదం తీసుకొని తరించండని కరపత్రం పంచారు
ప్రశ్న 2.
పిల్లల హక్కులను గూర్చి మీ తల్లిదండ్రులను అడగండి. వారు ఏమి చెప్పారో చెప్పండి.
జవాబు:
పిల్లలకు (1) చదువుకొనే హక్కు (2) అభివృద్ధి చెందే హక్కు’ (3) కూడు-గూడు-గుడ్డ హక్కు (4) తల్లిదండ్రుల ఆస్తిలో వాటా పొందే హక్కు ఉన్నాయని మా తల్లిదండ్రులు చెప్పారు.
ప్రశ్న 3.
మీ వాడలో / గ్రామంలో బడికి వెళ్ళని పిల్లలు ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళను బళ్ళలో చేర్చడానికి మీరేం చేస్తారు?
జవాబు:
మా బడిలో జరిగే ఉత్సవాల గురించి, టీచర్లు చెప్పే కథలను గూర్చి, బడికిరాని పిల్లలకు చెపుతాను. వారిని బడికి . రమ్మని ప్రోత్సహిస్తాను. వాళ్ళకు నా పుస్తకాలు అరువు ఇస్తాను. బడికి రాని పిల్లల ఇళ్ళకు, నా మిత్రులతో, ఉపాధ్యాయులతో కలిసి వెళ్ళి, వారి పిల్లలను బడికి పంపమని, వారి తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పిస్తాను.
II. చదవడం – రాయడం
1. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
మదునయ్య చేపల వ్యాపారి. శ్రీశైలం రిజర్వాయరులో చేపలు పట్టి అమ్ముతాడు. పెద్ద పెద్ద వలలను నీటిలో వేసి చేపలను పడతాడు. ఇందుకోసం ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్ కు వెళ్ళి, ఆరో తరగతి చదివే గంగయ్య అనే బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి, పదివేలకు అతన్ని పనికి కుదుర్చుకున్నాడు. గంగయ్యను తన వెంట తీసుకొని శ్రీశైలం వచ్చాడు. గంగయ్య రోజూ నీటి ఒడ్డున కూర్చొని వలను చూస్తూ ఉండేవాడు. ఒక్కోసారి రాత్రి కూడా అక్కడే పడుకొనేవాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మదునయ్యను శిక్షించారు. గంగయ్యను బళ్ళో చేర్పించి అతని తల్లిదండ్రులకు తెలియజేశారు.
అ) మదునయ్య ఎవరు? ఏం చేసేవారు?
జవాబు:
మదునయ్య చేపల వ్యాపారి. ఆయన శ్రీశైలం రిజర్వాయరులో చేపలు పట్టి అమ్ముతాడు.
ఆ) గంగయ్య ఎవరు? శ్రీశైలానికి ఎందుకు వచ్చాడు?
జవాబు:
గంగయ్య బరంపురంలో 6వ తరగతి చదివేవాడు. మదునయ్య వద్ద చేపల చెరువును కాపలా కాసేందుకు శ్రీశైలం వచ్చాడు.
ఇ) గంగయ్య పనిలో చేరడం వల్ల ఏమేం కోల్పోయాడు?
జవాబు:
గంగయ్య పనిలో చేరడం వల్ల చదువుకొనే స్వేచ్ఛ కోల్పోయాడు.
ఈ) బాలల హక్కులలో గంగయ్య ఏ హక్కులకు దూరమయ్యాడు?
జవాబు:
బాలల హక్కులలో గంగయ్య (1) చదువుకొనే హక్కు (2) కూలి జీవితం నుండి బయటపడే హక్కు (3) ఆటపాటలతో కూడిన వినోదం, విశ్రాంతి పొందే హక్కు కోల్పోయాడు.
ఉ) మదునయ్యను ఎందుకు శిక్షించారు? ఇలా చేయడం సరైందేనా?
జవాబు:
- మదునయ్య గంగయ్య యొక్క చదువుకొనే హక్కుకు భంగం కలిగించాడు. .
- కష్టమైన పని చేయకుండా బయటపడే హక్కును భంగపరచాడు.
- చదువుకొనే బాలుడిని మదునయ్య పనిలో పెట్టుకున్నాడు. అది తప్పు కాబట్టి మదునయ్యను శిక్షించడం సబబే.
ఊ) గంగయ్య తల్లిదండ్రులు చేసినపని సరైందేనా? ఎందుకు?
జవాబు:
గంగయ్య యొక్క తల్లిదండ్రులు చేసిన పని సరైంది కాదు. 6వ తరగతి చదువుకొంటున్న గంగయ్యను వారు బడి మాన్పించి బాలకార్మికునిగా పనిచేయడానికి మదునయ్యకు అమ్మివేశారు.
2. కింది వాక్యాలను చదివి తప్పో, ఒప్పో గుర్తించండి. కారణం రాయండి.
3. పాఠం చదవండి. జవాబులు రాయండి.
అ) కరపత్రం అంటే ఏమిటి? లేఖలకు, కరపత్రాలకు గల తేడాలు ఏమిటి?
జవాబు:
చేతిలో అనువుగా ఒదిగి, ఒక విషయానికి సంబంధించిన వివరణను “కరపత్రం” అంటారు. చేతిలో కాగితం అని దీని అర్థం. పదిమందికీ తెలియవలసిన విషయంతో కూడుకున్నదే కరపత్రం.
లేఖలలో రాసే, చదివే వ్యక్తుల వ్యక్తిగత విషయాలు ఉంటాయి. కరపత్రాలలో వ్యక్తిగత విషయాలే కాక, మనచుట్టూ ఉన్న సమాజం, దేశం, ప్రపంచంలోని విషయాలు ఉంటాయి.
ఆ) కరపత్రాలను ఎందుకు రూపొందిస్తారు? కరపత్రాలు ఎలా ఉంటాయి?
జవాబు:
ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద విషయాన్ని అందరికీ తెలియచేయడం కోసమే కరపత్రాన్ని రూపొందిస్తారు.
కరపత్రాలు వేసిన వాళ్ల, రాసిన వాళ్ళ పేర్లు, ముద్రణాలయం పేరు, కరపత్రంలో ఉండాలి. సాధారణంగా కరపత్రాలు అన్నీ చౌకగా ఉండే రంగు కాగితాల్లోనే అచ్చువేస్తారు. ఎక్కువగా కరపత్రాలు ఒకటి రెండు పేజీలకు పరిమితం అవుతాయి. అవసరాన్ని బట్టి ఇవి వేరు వేరు కొలతలలో, పరిమాణాలలో కనిపిస్తాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనం ఉన్న అంశాలు సామాన్య ప్రజలకు చేరవేయడానికి, కరపత్రం మంచి సాధనంగా ఉపయోగిస్తుంది.
ఇ) పాఠంలోని కరపత్రం దేనికి సంబంధించినది? దీన్ని ఏ శాఖవారు తయారుచేశారు? ఎందుకు?
జవాబు:
పాఠంలోని కరపత్రం, బాలల హక్కుల వారోత్సవాలకు సంబంధించినది. దీనిని పాఠశాల విద్యాశాఖ వారు తయారుచేశారు. బాలల హక్కులను గూర్చి అందరికీ తెలియజేయడానికి ఈ కరపత్రాన్ని తయారుచేశారు.
ఈ) కరపత్రంలో ఏ చట్టాన్ని గురించి తెలిపారు? అది ఎప్పటి నుంచి అమలు జరుగుతున్నది?
జవాబు:
కరపత్రంలో ‘బాలల హక్కుల చట్టాన్ని గురించి తెలిపారు. ఐక్యరాజ్యసమితి 1989లో బాలల హక్కులను నిర్వచించి, వాటి అమలుకు పూనుకొన్నది. ఆగస్టు 2009లో భారత ప్రభుత్వం, బాలల విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించి చట్టం చేసింది. మన రాష్ట్రంలో 1-4-2010 నుండి నిర్బంధ ఉచిత విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చింది.
ఉ) బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా ఏ ఏ అంశాలను గురించి అవగాహన కల్పించాలని భావించారు?
జవాబు:
బాలల హక్కుల వారోత్సవాలలో విద్యాహక్కు చట్టం గురించి తెలియజేయాలని భావించారు. 6 -14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలబాలికలందరూ, ఉచిత నిర్బంధ విద్యను పొందడం, బాలల హక్కులు రక్షింపబడటం, బడికి వెళ్ళని పిల్లల్ని బడుల్లో చేర్చడం, పిల్లల దగ్గర ఫీజులు, విరాళాలు వసూలు చేయడం, చట్ట విరుద్ధమని, తెల్పడం, వలస వచ్చిన పిల్లలకు కూడా విద్యా సౌకర్యాలు కల్పించడం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలు అందించడం, వగైరా విషయాలపై అవగాహన కల్పించాలని భావించారు.
ఊ) బాలల హక్కుల జాబితా తయారుచేయండి.
జవాబు:
- జీవించే హక్కు
- చదువుకొనే హక్కు
- ఆరోగ్యం పోషణ హక్కు
- కూడు, గూడు, గుడ్డ హక్కు
- ఆటపాటలతో కూడిన వినోదం, విశ్రాంతి పొందే హక్కు
- కష్టమైన పని చేయకుండా బయటపడే హక్కు
- కూలి జీవితం నుండి బయట పడే హక్కు
- కులమత వర్గ విచక్షణ లేని బాల్యం అనుభవించే హక్కు
- దౌర్జన్యాల నుండి రక్షణ పొందే హక్కు – ప్రత్యేకించి ఆడపిల్లలు దుర్మార్గుల నుండి రక్షణ పొందే హక్కు
- అభివృద్ధి చెందే హక్కు
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) అందరూ చదువుకోవాలి కదా! కాని కొంతమంది ఆడపిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు చదివించడం లేదు. దీనిమీద మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
ఆడపిల్లలను తల్లిదండ్రులు తప్పక చదివించాలి. మగ పిల్లలవలె పోటీ పరీక్షలకు పంపించి, ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు సాధించేలా వారికి శిక్షణ ఇప్పించాలి.
ఇపుడు చదువుకొని, ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లలకే పెళ్ళిళ్లు అవుతున్నాయి. నేడు భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే కాని, సంసారాలు నడవవు. ఒకవేళ ,,వారు ధనవంతులయినా, తల్లిదండ్రులు ఇద్దరూ విద్య చదువుకున్నవారు కాకపోతే, వారికి పుట్టిన పిల్లలు అభివృద్ధి కాలేరు. కాబట్టి ఆడపిల్లలను తప్పక చదివించాలి.
ఆ) బాలబాలికలలో ‘ప్రత్యేక అవసరాలున్న పిల్లలు కూడా ఉంటారు. మరి ఈ పిల్లలు బడిలో ఉంటే వాళ్ళ హక్కులను కాపాడటానికి మీరేం చేస్తారు?
జవాబు:
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, అంటే అంగవైకల్యం గల పిల్లలు. అంగవైకల్యం గలవారు మిగిలిన పిల్లలవలె చదువుకొనడం వీలుపడదు. కొందరికి సరిగా వినబడదు. కొందరు.సరిగా నడవలేరు. కొందరికి చూపు తక్కువ.
పైన చెప్పిన అంగవికలురకు ప్రత్యేక పాఠశాలలు, మండల కేంద్రాల్లో పెట్టాలి. లేదా రెవెన్యూ డివిజన్ కేంద్రాలలోనయినా, ప్రభుత్వము చెవిటి, మూగ మొదలయిన అంగవైకల్యం కలవారికి, వారికి పాఠం చెప్పే నేర్పు కల ఉపాధ్యాయులను నియమించి; పాఠశాలలు స్థాపించాలి.
నేను నా మిత్రుల సాయంతో కొంత నిధిని పోగుచేసి, అటువంటి మిత్రులకు వారి చదువుకు కావలసిన ఉపకరణాలు కొనియిస్తాను.
IV. పదజాలం
1. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) హక్కులు, బాధ్యతలు :
ప్రతి దేశపౌరుడూ తనకు గల హక్కులూ, బాధ్యతలూ తెలుసుకోవాలి.
ఆ) కంటికి రెప్పలా :
మన దేశ సైనికులు, రాత్రింబగళ్ళు శ్రమించి దేశాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు.
ఇ) సొంతకాళ్ళమీద నిలబడు :
నా మిత్రుడు తాను ఉద్యోగం సంపాదించి,. సొంతకాళ్ళమీద నిలబడాలని ప్రయత్నిస్తున్నాడు.
ఈ) విజయం సాధించు :
నేను పరీక్షలలో మంచి మార్కులతో విజయం సాధించాను.
ఉ) రక్షణ :
పిల్లలందరికీ తల్లిదండ్రులతో పాటు, ప్రభుత్వ రక్షణ కూడా అవసరం.
ఊ) పనితనం :
మంచి పనితనం ఉన్నవారికి, అన్ని రంగాలలో గుర్తింపు వస్తుంది.
2. నీకు వినోదాన్ని, విశ్రాంతిని, ఆనందాన్ని ఇచ్చేవి ఏవి? కష్టాన్ని, విసుగును, అలసటను కలిగించేవి ఏవి?
జవాబు:
వినోదం, విశ్రాంతి, ఆనందం కలిగించేవి | కష్టం, విసుగు, అలసట కలిగించేవి |
1. సినీమా, టీవీ, పాటలు వినడం | 1. విశ్రాంతి లేకుండా చదవడం. |
2. ఆటలు ఆడడం, చూడడం | 2. ఉదయాన్నే లేచి నడవడం, జాగింగ్ వగైరా శరీరశ్రమ. |
3. క్రికెట్ ను టీవీలో చూడడం | 3. పెద్దవాళ్ళ చాదస్తపు సలహాలు |
4. మిత్రులతో షికారుకు వెళ్ళడం, పూలతోటల్లో సంచరించడం. | 4: నీతి ఉపదేశాలు. |
5. షవర్ కింద స్నానంచేయడం, చెరువులో,కాలువలో ఈత లాడడం. | 5. పరుగుపోటీల్లో పాల్గొనడం వగైరా |
3. “బడి”, పిల్లల ప్రపంచం. ఇది పిల్లల అభివృద్ధికి కృషి చేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బడికి సంబంధించిన పదాలు రాయండి.
జవాబు:
బడి క్రమశిక్షణకు ఉత్తమసాధనం. పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు. పాఠశాలల్లో క్రీడలు, భావి క్రీడాకారుల కార్చానాలు. పరీక్షలు విజ్ఞానాన్ని మెరుగుపెట్టే సానరాళ్ళు. బడి పిల్లలు, పుష్పాల వంటివారు. పిల్లలు దుర్మార్గం, కపటం, మోసం ఎరుగని జాతి పుష్పాలు. బడి పిల్లలకు వెలుగును, విజ్ఞానాన్ని పంచే దేవాలయం.
4. వారం రోజులపాటు ఏదైనా ఒక అంశం గురించి, కార్యక్రమాలను నిర్వహిస్తే ‘వారోత్సవం’ అంటారు. వారోత్సవాలలాగ, ఇంకా ఏ ఏ ఉత్సవాలు నిర్వహిస్తారు. వాటి పేర్లు రాయండి.
జవాబు:
- మాసోత్సవాలు : నెలరోజులు చేసే ఉత్సవాలు.
- పక్షోత్సవాలు : 15 రోజులు చేసే ఉత్సవాలు.
- సప్తాహాలు : ఏడు రోజులు చేసే ఉత్సవాలు.
- ప్రభాత సేవలు : తెల్లవారు జామున చేసే సేవలు.
- దినోత్సవం : స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం వంటివి ఒక్కరోజు మాత్రమే చేసే ఉత్సవాలు.
- వార్షికోత్సవాలు : సంవత్సరానికి ఒకసారి చేసే ఉత్సవాలు.
- సాంవత్సరికోత్సవం : సంవత్సరము (ఏడాది). చివరన చేసే ఉత్సవం.
- రజతోత్సవం : 25 సంవత్సరాల తరువాత చేసే ఉత్సవం.
- స్వర్ణోత్సవం : 50 సంవత్సరాల తరువాత చేసే ఉత్సవం.
- వజోత్సవం : 60 సంవత్సరాల తరువాత చేసే ఉత్సవం.
5. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.
1. మన సాహిత్య సమావేశం వివరాల కరపత్రం పంచి పెట్టాము. (చేతిలో కాగితం)
2. వ్యాపారంలో ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలించాలి. (లోతుగా)
3. ఈ రోజు నగరంలో జనసమ్మర్దము ఎక్కువగా ఉంది. (జనుల సందడి)
4. ఆధునిక కాలం లో ప్రజలకు “టీవీ”లపై మోజు పెరిగింది. (నేటి కాలం)
5. పత్రికలలో అసంఖ్యాకమైన ప్రకటనలు వస్తున్నాయి. (లెక్కలేనన్ని)
6. నాకు ఈ విషయంలో ఇంకా సందిగ్ధంగా ఉంది. (సందేహాలు)
7. మాట్లాడేటప్పుడు అపార్థాలకు చోటివ్వకుండా మాట్లాడాలి. (అపోహలు)
8. కరపత్రం భావప్రకటనా స్వేచ్ఛకు సంకేతం. (గుర్తు)
6. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
1) నిశితంగా : మా తమ్ముడు ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తాడు.
2) ప్రపంచవ్యాప్తంగా : ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు ధరలు పెరిగాయి.
3) జన సమ్మర్ధము : తీర్ధంలోని జన సమ్మర్టంలో మా తమ్ముడు ‘తప్పిపోయాడు.
4) ఆధునిక కాలం : ఆధునిక కాలంలో పిల్లలకు ఫ్యాషన్ల పిచ్చి ముదిరింది.
5) అసంఖ్యాకంగా : నేడు ప్రభుత్వం అసంఖ్యాకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది.
6) అపార్ధము : మాట్లాడే మాట అపార్థాలకు తావు లేకుండా ఉండాలి.
7) సందిగ్ధం : చేసే పనిలో సందిగ్గానికి చోటు ఉండరాదు. –
8) ఆస్కారము : నీవు చెప్పిన మాటను బట్టి అతడు ఇంట్లో ఉండడానికి ఆస్కారముంది.
9) సమకాలీనం : సహజంగా జనానికి, సమకాలీన విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
7. కింది పదాలకు వ్యతిరేకపదాలు రాయండి.
1. సౌకర్యం × అసౌకర్యం
2. ప్రధానము × అప్రధానము
3. ప్రాచీనము × నవీనము
4. గట్టిగా × నెమ్మదిగా.
5. నిర్భయం × భయం
6. సందిగం × అసందిగం
7. సాధారణం × అసాధారణం
8. వాస్తవం × అవాస్తవం
V. సృజనాత్మకత
బాలల హక్కుల వారోత్సవాల గురించి కరపత్రం చదివారు కదా ! కింది అంశాలలో ఏదైనా ఒక అంశంపై మీ మిత్రులతో కలిసి ఒక కరపత్రం తయారు చేయండి.
అ) పరిసరాల పరిశుభ్రత,
ఆ) దోమల నిర్మూలన
ఇ) చెట్ల పెంపకం
జవాబు:
పరిసరాల పరిశుభ్రత చదవండి ! – ఎదగండి ! మనం ఇల్లు తుడిచి ఆ తుక్కు పక్క ఇంటి వాని గుమ్మం ముందు వేస్తాం. ‘మన ఇంట్లోని మురికినీరు రోడ్లపైకి వదలివేస్తాం. మనకు పనికిరాని ‘వస్తువులు రోడ్లపైకి విసరుతాం. మనం పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమలు రావు. దోమల వల్లే మనకు సగం రోగాలు. అందరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మందులూ, డాక్టర్లూ అవసరం ఉండదు. పరిసరాల పరిశుభ్రత పాటించండి. మందుల అవసరం తగ్గించండి. బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జనలు మానండి. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోండి. మా మాట వినండి. ఇట్లు, |
VI. ప్రశంసలు
* బాలల హక్కుల కోసం కృషి చేసే వారి గురించి / సంస్థల గురించి మీ అభిప్రాయాలు రాయండి. వారిని అభినందిస్తూ లేఖ రాయండి.
జవాబు:
అభినందనలేఖ తిరుపతి, రాజీవ్/నెహ్రూ బాలల హక్కుల సంఘాల వారికి, ఆర్యులారా ! మీరు చేస్తున్న కృషికి, సేవా భావానికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు. నమస్సులు. ఇట్లు, పి. చిరునామా : |
VII. ప్రాజెక్టు పని
* కొన్ని కరపత్రాలు సేకరించండి. వాటిని ఎవరు ముద్రించారు? ఎందుకోసమో తెలపండి.
జవాబు:
ముద్రించినవారు | ఎందుకోసం |
1. అమలాపురం మునిసిపల్ కమీషనర్ | 1. పిల్లలకు పోలియో చుక్కలు వేయించమని |
2. మండల విద్యాధికారి, అమలాపురం | 2. బడి ఈడు పిల్లలను అందరినీ బడులలో చేర్పించమని |
3. వేంకటేశ్వర దేవస్థానం, కార్యనిర్వహణాధికారి | 3. వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల కార్యక్రమం గురించి |
4. డీలక్సు సినిమా హాలు వారు | 4. కొత్తగా రిలీజయిన సినిమా గురించి |
5. చందన బ్రదర్సు, అమలాపురం | 5. ఆ సంస్థ వార్షికోత్సవంలో ఇస్తున్న రిబేట్ల గురించి, బంగారు వస్తువుల, బట్టల అమ్మకం గురించి. |
VIII. భాషను గురించి తెలుసుకుందాం
1. అ) కింది వాక్యాలు భావాన్ని అనుసరించి ఏ వాక్యాలో గుర్తించండి. ఆ ప్రక్కన రాయండి.
ఉదా : ఎంత బాగుందో ! (ఆశ్చర్యార్థక వాక్యం)
అ. నువ్వు చదువు. (విధ్యర్థక వాక్యం)
ఆ. అల్లరి చేయవద్దు. (నిషేధార్థక వాక్యం)
ఇ. పరీక్షలు రాయవచ్చు. (అనుమత్యర్థక వాక్యం)
ఈ. తనూ బొమ్మలు వేయగలడు. (సామర్థ్యార్థక వాక్యం)
కింది వాక్య భేదాలు చూద్దాం.
1. రవి పనిచేస్తాడో చెయ్యడో !
ఈ వాక్యం చదివితే రవి పనిచేయటం అనే విషయంలో అనుమానం, అంటే సందేహం కలుగుతున్నది కదూ! ఇలా సందేహాన్ని తెలిపే పాక్యాలను “సందేహార్థక వాక్యాలు” అంటారు.
2. నువ్వు నూరేళ్ళు వర్ధిల్లు !
ఈ వాక్యం ఏ అర్థాన్ని సూచిస్తున్నది? ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నట్లు కనబడుతోంది కదా ! ఇలా ఆశీర్వదిస్తున్నట్లు అర్థాన్ని సూచించే వాక్యాలను “ఆశీరక వాక్యాలు” అంటారు.
3. దయచేసి పని చేయండి
ఈ వాక్యం ఒక పనిని చేయమని ప్రార్థిస్తూ ఉంది. అంటే ప్రార్థన అర్థాన్ని సూచిస్తున్నది. కాబట్టి ఇది “ప్రార్థనార్థక వాక్యం”
ఒక వాక్యం ప్రార్థన అర్థాన్ని సూచిస్తున్నట్లు ఉంటే అది ప్రార్థనార్థక వాక్యం అన్నమాట.
4. ఏం ! ఎప్పుడొచ్చావ్ ?
ఈ వాక్యం ప్రశ్నిస్తున్నట్లుంది కదూ ! అంటే ఇది “ప్రశ్నార్థక వాక్యం”.
ఒక వాక్యానికి ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటాం.
5. వర్షాలు లేక పంటలు పండ లేదు.
ఈ వాక్యం మనకు రెండు విషయాల్ని తెలుపుతోంది. ఒకటి వర్షాలు లేవని, రెండు పంటలు పండలేదని. ఐతే పంటలు పండకపోవడానికి కారణం మొదటి విషయం. అంటే వర్షాలు లేకపోవటం. ఈ మొదటి విషయం . రెండో విషయానికి కారణం అవుతోంది. అంటే హేతువు అన్నమాట. ఇలా హేతువు అర్థాన్ని సూచించే వాక్యం “హేత్వర్థక వాక్యం”.
ఒక పని కావడానికి కారణాన్ని లేదా హేతువును సూచించే అర్థం ఉన్న వాక్యాన్ని “హేత్వర్థక వాక్యం” అంటాం.
2) కింది వాక్యాలు ఏ అర్థాన్ని సూచించే వాక్యాలో రాయండి.
అ) ఎవరా పైడిబొమ్మ? (ప్రశ్నార్థక వాక్యం)
ఆ) పంటలు పండలేదు. (సామాన్యవాక్యం)
ఇ) దయచేసి సెలవు ఇవ్వండి. (ప్రార్థనార్థక వాక్యం)
అభ్యాసాలు : ఇలాంటి వాక్యాల్ని మీ పాఠ్యాంశాలలో వెతికి రాయండి.
- భక్తిపాడర తమ్ముడా ! (ప్రార్థనార్థక వాక్యం)
- పదముపాడర తమ్ముడా ! (ప్రార్థనార్థక వాక్యం)
- గారవింపవె చెల్లెలా ! (ప్రార్థనార్థక వాక్యం)
- పాటపాడవె చెల్లెలా ! (ప్రార్థనార్థక వాక్యం)
- మీ ఆకలి బాధ నివారించుకోండి. (ప్రార్థనార్థక వాక్యం)
- తమరు కుశలమేకదా? (ప్రశ్నార్థక వాక్యం)
- తుదకు దొంగలకిత్తురో? దొరలకౌనో? (సందేహార్థక వాక్యం)
- తిరిగి యిమ్మువేగ తెలుగుబిడ్డ? (విధ్యర్థక వాక్యం)
- పుస్తకమ్ములను చింపబోకు మురికీ చేయబోకు (విధ్యర్థక వాక్యం)
- కుసుమ వల్లరు లేరీతి గ్రుచ్చినావు? (ప్రశ్నార్థక వాక్యం)
- మీరు పక్షులను గుర్తించగలరా? (ప్రశ్నార్థక వాక్యం)
- దేన్ని గురించి నేను మీకు రాయాలి? (ప్రశ్నార్థక వాక్యం)
- స్టేషన్లో టికెట్లను జారీ చెయ్యకండి. (నిషేధార్థక వాక్యం)
- కేబుల్ గ్రామ్ పంపించండి. (ప్రార్థనార్థక వాక్యం)
- దాచిన బడబానలమెంతో? (ప్రశ్నార్థక వాక్యం)
- సుకృతంబు గట్టికొనవన్న (ప్రార్థనార్థక వాక్యం)
- పోయిరమ్ము (విధ్యర్థక వాక్యం)
- మమత్వంబు విడువుమన్న (ప్రార్థనార్థక వాక్యం)
- ఆడకుమ సత్య భాషలు (విధ్యర్థక వాక్యం)
(ఆ) కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.
1. విషయాసక్తి = విషయ + ఆసక్తి = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
2. వివాదాత్మకం = వివాద + ఆత్మకం = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
3. వివాదాస్పదం = వివాద + ఆస్పదం = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
4. ముద్రణాలయం = ముద్రణ + ఆలయం = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
5. అపార్థాలు = అప + అర్థాలు = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
6. వారోత్సవాలు = వార + ఉత్సవాలు = (అ + ఉ = ఓ) – గుణసంధి
7. దినోత్సవం = దిన + ఉత్సవం = (అ + ఉ = ఓ) – గుణసంధి
8. సాహిత్యపు విలువ = సాహిత్యము + విలువ – పుంప్వాదేశ సంధి
(ఇ) కింది సమాసాలకు అర్థం రాసి, వాటి పేర్లు రాయండి.
సమాస పదం | విగ్రహవాక్యం | సమాస నామం |
1. ముద్రణ సౌకర్యం | ముద్రణ యొక్క సౌకర్యం | షష్ఠీ తత్పురుష సమాసం |
2. ముద్రణాలయం | ముద్రణకు ఆలయం | షష్ఠీ తత్పురుష సమాసం |
3. భావప్రకటన | భావము యొక్క ప్రకటన | షష్ఠీ తత్పురుష సమాసం |
4. దేశ భవిష్యత్తు | దేశము యొక్క భవిష్యత్తు | షష్ఠీ తత్పురుష సమాసం |
5. బాలల భవిష్యత్తు | బాలల యొక్క భవిష్యత్తు | షష్ఠీ తత్పురుష సమాసం |
6. చట్ట విరుద్ధం | చట్టమునకు విరుద్ధం | షష్ఠీ తత్పురుష సమాసం |
7. గుడ్డ ఉత్తరాలు | గుడ్డతో ఉత్తరాలు | తృతీయ తత్పురుష సమాసం |
8. విషయాసక్తి | విషయము నందు ఆసక్తి | సప్తమీ తత్పురుష సమాసం |
9. చిత్తశుద్ధి | చిత్తము నందు శుద్ధి | సప్తమీ తత్పురుష సమాసం |
10. అచ్చుతప్పులు | అచ్చు నందలి తప్పులు | సప్తమీ తత్పురుష సమాసం |
11. వార్తా పత్రిక | వార్తల కొఱకు పత్రిక | చతుర్థి తత్పురుష సమాసం |
12. బాలల హక్కులు | బాలల యొక్క హక్కులు | షష్ఠీ తత్పురుష సమాసం |
13. అమానుషము | మానుషము కానిది | నఇ! తత్పురుష సమాసం |
14. అనాగరికము | నాగరికము కానిది | నxణ్ తత్పురుష సమాసం |
15. రెండు పేజీలు | రెండు (2) సంఖ్య గల పేజీలు | ద్విగు సమాసం |
16. ప్రాచీన మఠాలు | ప్రాచీనమైన మఠాలు | విశేషణ పూర్వపద కర్మధారయం |
17. భారతదేశము | భారతము” అనే పేరుగల దేశం | సంభావనా పూర్వపద కర్మధారయం |
(ఈ) కింది ఖాళీలలో సరైన విభక్తులు రాయండి.
1. వీడు వాడి ……………. 1 ……………. కలిసి బడి ………….. 2 ……………. వెళ్ళాడు.
2. ఈ టీవీ ………………. 3 ……………. మద్రాసు ……………….. 4 ……………. తెచ్చాను.
3. పాప పొద్దున్నే బడి …………………… 5 ……………… వెళ్ళింది.
4. పిల్లవాడు ఆకలి ……………………. 6 ………………. ఉన్నాడు.
జవాబులు:
1) తో
2)కి
3) ని
4) నుండి
5) కి
6) తో
కొత్త పదాలు-అర్థాలు
అనువు = అనుకూలము
అసంఖ్యాకం = లెక్కలేనన్ని
అపార్థాలు = అపోహలు
ఆస్కారము = ఆధారము
అనుగుణం = తగినది
అమానుషం = మనుష్య శక్తికి మించినది (క్రూరమైనది)
అనాగరికం = నాగరికము కానిది
ఉపకరణాలు = పనిముట్లు
కరపత్రం = ప్రకటన పత్రం
గరిగ = చిన్నపాత్ర
జన సమ్మర్దము = జనుల రాయిడి
నిఘంటువు = అర్థములు తెలిపే గ్రంథం (Dictionary)
నిర్వచనం = అర్థమును వివరించి చెప్పుట
చిత్తశుద్ధి = మనశ్శుద్ధి
దృక్పథం = దృష్టిమార్గం
పర్యవసానము = సమాప్తి, చివరకు జరిగేది
ప్రతిబింబించేవి = ప్రతిఫలించేవి
నిశితంగా = తీక్షణముగా
పరిణామదశ = పర్యవసాన దశ (క్రమంగా వచ్చిన మార్పు)
వ్యక్తీకరణ = వెల్లడి
వ్యక్తిగతం = ఆ వ్యక్తికి సంబంధించినది
జన సమ్మర్దం = జనం గుంపు
కూడళ్ళు = రోడ్లు కలసిన స్థలాలు
సమాజం = సంఘము
శిలాశాసనం = రాతిపై చెక్కిన శాసనం
సమకాలీనం = ఒకే కాలమునకు చెందినది
వాస్తవ దృక్పథము = సత్య దృష్టి
ముద్రణాలయం = అచ్చుయంత్రం (Printing press)
సందిగ్ధం = సందేహం
సంక్షేమ పథకాలు = చక్కగా క్షేమం కలిగించే పనులు (Welfare schemes)
సంకేతం = గుర్తు
వాస్తవం = నిజం
వారోత్సవం = ఒక వారంపాటు చేసే ఉత్సవం
రూపుదిద్దుకున్నాయి = రూపం ధరించాయి (ఏర్పడ్డాయి)
AP Board Textbook Solutions PDF for Class 7th Telugu
- AP Board Class 7
- AP Board Class 7 Telugu
- AP Board Class 7 Telugu Chapter 1 అక్షరం
- AP Board Class 7 Telugu Chapter 2 మాయాకంబళి
- AP Board Class 7 Telugu Chapter 3 చిన్ని శిశువు
- AP Board Class 7 Telugu Chapter 4 మర్రిచెట్టు
- AP Board Class 7 Telugu Chapter 5 పద్య పరిమళం
- AP Board Class 7 Telugu Chapter 6 మన విశిష్ట ఉత్సవాలు
- AP Board Class 7 Telugu Chapter 7 కప్పతల్లి పెళ్ళి
- AP Board Class 7 Telugu Chapter 8 ఎద
- AP Board Class 7 Telugu Chapter 9 హితోక్తులు
- AP Board Class 7 Telugu Chapter 10 ప్రియ మిత్రునికి
- AP Board Class 7 Telugu Chapter 11 బాలచంద్రుని ప్రతిజ్ఞ
- AP Board Class 7 Telugu Chapter 12 స్ఫూర్తి ప్రదాతలు
- AP Board Class 7 Telugu 7th Class Telugu Grammar
- AP Board Class 7 Telugu వ్యాసాలు
- AP Board Class 7 Telugu కరపత్రాలు / లేఖలు
- AP Board Class 7 Telugu పదాలు – అర్థాలు
- AP Board Class 7 Telugu Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ
- AP Board Class 7 Telugu Chapter 2 అతిథి మర్యాద
- AP Board Class 7 Telugu Chapter 3 ఆనందం (ఉపవాచకం)
- AP Board Class 7 Telugu Chapter 4 మేలిమి ముత్యాలు
- AP Board Class 7 Telugu Chapter 5 తెలుగు వెలుగు
- AP Board Class 7 Telugu Chapter 6 ఎందుకు పారేస్తాను నాన్నా! (ఉపవాచకం)
- AP Board Class 7 Telugu Chapter 7 శిల్పి
- AP Board Class 7 Telugu Chapter 8 నిజం-నిజం
- AP Board Class 7 Telugu Chapter 9 కూచిపూడి నాట్యం (ఉపవాచకం)
- AP Board Class 7 Telugu Chapter 10 ప్రకటన
- AP Board Class 7 Telugu Chapter 11 సీత ఇష్టాలు
- AP Board Class 7 Telugu Chapter 12 అసామాన్యులు (ఉపవాచకం)
- AP Board Class 7 Telugu Chapter 13 ఆలోచనం (?)
- AP Board Class 7 Telugu Chapter 14 కరపత్రం
- AP Board Class 7 Telugu Chapter 15 జానపద కళలు (ఉపవాచకం)
- AP Board Class 7 Telugu Chapter 16 బాల్య క్రీడలు
- AP Board Class 7 Telugu Chapter 17 వేసవి సెలవుల్లో (ఉపవాచకం)
- AP Board Class 7 Telugu 7th Class Telugu Grammar
- AP Board Class 7 Telugu వ్యాసాలు
- AP Board Class 7 Telugu కరపత్రాలు / లేఖలు
- AP Board Class 7 Telugu పదాలు – అర్థాలు
0 Comments:
Post a Comment