![]() |
AP Board Class 6 Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 6th Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా Book Answers |
Andhra Pradesh Board Class 6th Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా Textbooks Solutions PDF
Andhra Pradesh State Board STD 6th Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 6th Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 6th Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 6th Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా Textbooks. These Andhra Pradesh State Board Class 6th Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.Andhra Pradesh State Board Class 6th Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా Books Solutions
Board | AP Board |
Materials | Textbook Solutions/Guide |
Format | DOC/PDF |
Class | 6th |
Subject | Social Science |
Chapters | Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా |
Provider | Hsslive |
How to download Andhra Pradesh Board Class 6th Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా Textbook Solutions Answers PDF Online?
- Visit our website - Hsslive
- Click on the Andhra Pradesh Board Class 6th Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా Answers.
- Look for your Andhra Pradesh Board STD 6th Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా Textbooks PDF.
- Now download or read the Andhra Pradesh Board Class 6th Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా Textbook Solutions for PDF Free.
AP Board Class 6th Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా Textbooks Solutions with Answer PDF Download
Find below the list of all AP Board Class 6th Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:ప్రశ్న 1.
గ్లోబు అంటే ఏమిటి?
జవాబు:
భూమికి ఖచ్చితమైన నమూనానే గ్లోబు. గ్లోబు అనే పదం ‘గ్లోబస్’ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గోళం అని దాని అర్థం.
ప్రశ్న 2.
భూమికి గల చలనాలు ఏవి?
జవాబు:
ప్రాథమికంగా భూమికి రెండు రకాలైన చలనాలు ఉన్నాయి. అవి :
- భూభ్రమణం
- భూ పరిభ్రమణం
ప్రశ్న 3.
భూమి యొక్క ఏ చలనం వలన రాత్రి, పగలు ఏర్పడతాయి?
జవాబు:
భూభ్రమణం వలన రాత్రి, పగలు ఏర్పడతాయి. భూభ్రమణ సమయంలో సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడి కాంతివంతంగాను, మిగిలిన అర్ధభాగం చీకటిలోనూ ఉంటుంది. సూర్యకాంతి పడిన అర్ధభాగం పగలు, మిగిలిన అర్ధభాగం రాత్రి.
ప్రశ్న 4.
భూభ్రమణం వలన ఏమి సంభవిస్తుంది?
జవాబు:
భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి.
ప్రశ్న 5.
భూభ్రమణం, పరిభ్రమణాలను నిర్వచించండి.
జవాబు:
భూభ్రమణం :
భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కి.మీ. వేగంతో తిరుగుతుంది. దీనినే భూభ్రమణం అంటారు. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావటానికి 23 గంటల 56 ని॥ల 4.09 సెకన్ల (సుమారు 24 గం||లు) సమయం అనగా ఒక రోజు పడుతుంది.
భూపరిభ్రమణం :
భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూపరిభ్రమణానికి 365 4 రోజుల సమయం పడుతుంది.
ప్రశ్న 6.
భూమి యొక్క ఖచ్చితమైన ఆకారం ఏమిటి?
జవాబు:
భూమి పూర్తిగా గోళాకారంగా ఉండకుండా ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బినట్లుగా ఉంటుంది.
ప్రశ్న 7.
కర్కటరేఖ అని ఏ అక్షాంశాన్ని అంటారు?
జవాబు:
231/2° ఉత్తర అక్షాంశాన్ని కర్కటరేఖ అని అంటారు.
ప్రశ్న 8.
పాఠ్యాంశంలోని ‘విషవత్తు’ పేరాను చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
మార్చి 21 మరియు సెప్టెంబరు 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్యరేఖపై నిట్టనిలువుగా పడతాయి. ఈ తేదీలో భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఈ రెండు తేదీలను విషవత్తులు అంటారు.
సెప్టెంబరు 23వ తేదీన ఉత్తరార్ధగోళంలో శరదృతువు, దక్షిణార్ధగోళంలో వసంతఋతువు ఉంటాయి. దీనికి భిన్నంగా మార్చి 21వ ఉత్తరార్ధగోళంలో వసంతబుతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటాయి.
దీనిని బట్టి భూభ్రమణం మరియు భూపరిభ్రమణం వలన రాత్రి, పగలులలో మరియు ఋతువులలో మార్పులు సంభవిస్తాయని మనం తెలుసుకున్నాము.
ప్రశ్న 9.
అక్షాంశ, రేఖాంశాల మధ్య సారూప్యతలను మరియు భేదాలను పట్టిక రూపంలో తయారు చేయండి.
జవాబు:
అక్షాంశాలు | రేఖాంశాలు |
1) అక్షాంశాలు ఒకదానికొకటి కలవవు. సమాంతరంగా ఉంటాయి. | 1) రేఖాంశాలే మధ్యాహ్నరేఖలు. లంబంగా ఉంటాయి. |
2) భూమధ్యరేఖ నుండి ఉత్తర, దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. | 2) రేఖాంశాలు, ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు, పడమరలకు దూరాన్ని కొలుస్తాయి. |
3) వీటి పొడవులు సమానంగా ఉండవు. | 3) రేఖాంశాల పొడవులో సమానంగా ఉంటాయి. |
4) అక్షాంశాలు భూమధ్యరేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. | 4) రేఖాంశాలు భూమధ్యరేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు. ఇవి ఉత్తర – దక్షిణ దిశలలో ఉంటాయి. |
5) ఇవి వృత్తాలు. | 5) ఇవి అర్ధ వృత్తాలు |
6) శీతోష్ణస్థితిని తెలుసుకోవచ్చు. | 6) కాలాల్లోని తేడాలు తెలుసుకోవచ్చు. |
ప్రశ్న 10.
ఇండియాలో పగటికాలం అయితే అమెరికాలో రాత్రి అవుతుంది. ఈ వ్యత్యాసానికి గల కారణం ఏమిటి?
జవాబు:
భూమి మీద ఒక ప్రదేశంలో పగటికాలం ఉన్నప్పుడు దానికి అభిముఖంగా వున్న ప్రదేశంలో రాత్రి అవుతుంది. భూభ్రమణం వలన సూర్యునికి ఎదురుగా ఉన్న భూమి యొక్క సగభాగం ప్రకాశిస్తుంది. అభిముఖంగా ఉన్న భాగంలో సూర్యకాంతి పడకపోవటం వలన చీకటి రాత్రి ఏర్పడుతుంది. కావున ఇండియాకి దాదాపు భూమిపై అభిముఖంగా వున్న అమెరికాలో రాత్రి అవుతుంది.
ప్రశ్న 11.
బంతిని తీసుకొని దాని ఉపరితలంపై అక్షాంశ రేఖాంశాలను గీయండి.
జవాబు:
ప్రశ్న 12.
గ్లోబుకు, అట్లాసు మధ్య తేడాను తెల్పండి.
జవాబు:
గ్లోబు | అట్లాసు |
1) గ్లోబు త్రిమితీయ (3డి) నమూనా. | 1) అట్లాసు ద్విమితీయ (2 డి) నమూనా. |
2) ఇది గోళాకారంగా ఉంటుంది. | 2) ఇది బల్ల పరపుగా ఉంటుంది. |
3) దీనిని త్రిప్పుటకు వీలవుతుంది. | 3) దీనిని త్రిప్పలేము. |
4) భూమికి ఖచ్చితమైన నమూనా. | 4) అంతఖచ్చితమైన నమూనా కాదు. |
5) నావిగేషను ఉపయోగించలేము. | 5) నావిగేషను ఉపయోగపడుతుంది. |
ప్రశ్న 13.
ఈ మధ్య కాలంలోని లీపు సంవత్సరం, రాబోయే లీపు సంవత్సరాలను తెల్పండి.
జవాబు:
గతంలోని లీపు సంవత్సరం : 2016
ఈ మధ్య కాలంలోని లీపు సంవత్సరం : 2020
రాబోయే కాలంలోని లీపు సంవత్సరం : 2024
రాబోయే కాలంలోని లీపు సంవత్సరం : 2028
ప్రశ్న 14.
సూర్యగ్రహణాన్ని సురక్షితంగా చూడటానికి ఏ సన్నాహాలు చేయాలి?
జవాబు:
సూర్యగ్రహణాన్ని సురక్షితంగా చూడటానికి తీసుకోవలసిన/ చేయాల్సిన సన్నాహాలు :
- సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడరాదు. అలా చూసినట్లయితే కన్నులలోని తేలికపాటి పొరలు దెబ్బ తినవచ్చు.
- సూర్యగ్రహణాన్ని నల్లటి గ్లాసుల సహాయంతో మాత్రమే చూడాలి.
- టెలిస్కోప్, బైనాక్యూలర్ లాంటి వాటి ద్వారా చూడరాదు.
- సోలార్ ఫిల్టర్ ద్వారా మాత్రమే చూడాలి. పెద్దలు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే చూడాలి.
- ప్లానిటోరియం లాంటి ప్రదేశాలు అందుబాటులో ఉంటే అక్కడ నుంచి వీక్షించవచ్చు.
- గ్రహణ సమయంలో అయస్కాంత విద్యుత్ పరారుణ తరంగాలు, ప్రసరించవచ్చు. కావున తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రశ్న 15.
ఊహారేఖలైన అక్షాంశ, రేఖాంశాలు లేకపోతే ఒక ప్రదేశం ఉనికి, కాలము మరియు దూరాన్ని అర్థం చేసుకోవటం కష్టమయ్యేది. ఊహారేఖలైన అక్షాంశ, రేఖాంశాల రూపకల్పనను అభినందించండి, ప్రశంసించండి.
జవాబు:
- అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికి తెలుసుకోవచ్చు.
- అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత సమయాన్ని తెలుసుకోవచ్చు.
- అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత శీతోష్ణస్థితిని తెలుసుకోవచ్చు.
- అక్షాంశ, రేఖాంశాలు ఊహారేఖలైనప్పటికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇవి లేని గ్లోబు (ప్రపంచపటం)ను ఊహించలేము.
- ఈ అక్షాంశ, రేఖాంశాలు రూపకల్పనను ఖచ్చితంగా అభినందించవలసిందే.
ప్రశ్న 16.
ఒక యువజన దినోత్సవంలో వేణు వివిధ నగరాలకు చెందిన గీతిక, జాన్, నిహాల్ మరియు ఉమలను కలిశాడు. వేణు వారి వారి నగరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి మనకు ఇచ్చాడు. వేణు ఇచ్చిన సమాచారం ఆధారంగా అట్లాస్ సహాయంతో ఆ నగరాలను కనుగొనగలరా?
జవాబు:
గీతిక – 19° ఉత్తర అక్షాంశం 72° తూర్పురేఖాంశం పోయే ప్రదేశంలో ఉండే నగరం నుండి ఈ అమ్మాయి వచ్చినది.
నగరం పేరు : ……… (ముంబయి)
జాన్ – 12° ఉత్తర అక్షాంశం 77° తూర్పురేఖాంశం పోయే నగరం నుండి వచ్చిన బాలుడు.
నగరం పేరు: …. (బెంగుళూరు)
నిహాల్ – 28° ఉత్తర అక్షాంశం 77° తూర్పు రేఖాంశం దాదాపుగా ఖండించుకునే ప్రదేశం నుండి వచ్చిన బాలుడు.
నగరం పేరు : …….. (న్యూఢిల్లీ)
ఉమ – 22° ఉత్తర అక్షాంశం 88° తూర్పురేఖాంశం దాదాపుగా ఖండించుకునే ప్రదేశం నుండి వచ్చిన బాలిక.
నగరం పేరు : ….. (కోల్ కత్తా)
ప్రశ్న 17.
ఒక అంతరిక్ష నౌక నుండి వ్యోమగామి భూమి వైపునకు చూస్తే అతడు/ఆమె భూమి యొక్క భ్రమణాన్ని చూడగలరా?
జవాబు:
అంతరిక్ష నౌక నుండి వ్యోమగామి భూమి వైపునకు చూస్తే అతడు/ఆమె భూమి యొక్క భ్రమణాన్ని చూడగలరు.
ప్రశ్న 18.
భూమి భ్రమణం, పరిభ్రమణాలను మనం ఎందుకు స్పృశించలేం?
జవాబు:
భూమి భ్రమణం, పరిభ్రమణాలను మనం స్పృశించలేం కారణమేమిటంటే :
భూమితో పాటు మనం కూడా అంతే వేగంతో తిరుగుతున్నాము కనుక.
ఉదా : భూమితో పాటు కొండలు, చెట్లు, గుట్టలు, సముద్రాలు అన్ని తిరుగుతుండటం వలన మనం భూభ్రమణంను స్పృశించలేం.
ప్రశ్న 19.
సరియైన సమాధానాలను ఎంపిక చేయండి.
ఆ. సూర్యుని చుట్టూ భూమి తిరగటాన్ని ఏమంటారు?
i) భ్రమణం
ii) పరిభ్రమణం
iii) వంగడం
జవాబు:
i) భ్రమణం
ఆ. భూమధ్యరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజు
i) మార్చి 21
ii) జూన్ 21
iii) డిసెంబర్ 22
జవాబు:
i) మార్చి 21
ఇ. క్రిస్మస్ వేడుకలు వేసవిలో ఎక్కడ జరుపుకుంటారు.
i) జపాన్
ii) ఆస్ట్రేలియా
iii) ఇండియా
జవాబు:
ii) ఆస్ట్రేలియా
ఈ. ఋతువులు దీని కారణంగా ఏర్పడతాయి.
i) భ్రమణం
ii) పరిభ్రమణం
iii) గురుత్వాకర్షణ
జవాబు:
ii) పరిభ్రమణం
ప్రశ్న 20.
అట్లాసు లేదా గ్లోబు సహాయంతో కింద ఇవ్వబడిన పట్టికలోని ప్రదేశాల అక్షాంశ, రేఖాంశాలను కనుగొని పట్టికను నింపండి.
జవాబు:
ప్రశ్న 21.
గూగుల్ మ్యాప్ లేక అట్లాసు సహాయంతో ఇవ్వబడిన పట్టికలోని భారతదేశం, ఆంధ్రప్రదేశ్, మీ జిల్లా మరియు మీ మండలం అక్షాంశ, రేఖాంశాల పరిధిని కనుగొని పట్టికను నింపండి.
జవాబు:
ప్రశ్న 22.
ఈ కింది చిత్రాలను గమనించి రంగులో చూపిన అర్ధగోళాల పేర్లను గడిలో రాయండి.
జవాబు:
6th Class Social Studies 2nd Lesson గ్లోబు – భూమికి నమూనా InText Questions and Answers
6th Class Social Textbook Page No.10
ప్రశ్న 1.
i) మీరు ఎప్పుడైనా ప్రపంచ పటాన్ని గమనించారా?
ii) పక్కన ఇవ్వబడిన ప్రపంచపటంలో ఎడమవైపు ఇవ్వబడిన మహాసముద్రం పేరేమిటి?
iii) కుడివైపున ఉన్న మహాసముద్రము పేరేమిటి?
జవాబు:
i) గమనించాము.
ii) పసిఫిక్ మహాసముద్రం
iii) పసిఫిక్ మహాసముద్రం
6th Class Social Textbook Page No.16
ప్రశ్న 2.
గ్లోబు వలె ఎలాంటి అక్షం లేకుండా భూమి తన చుట్టూ తాను ఎలా తిరుగుతుంది? మీ ఉపాధ్యాయులతో – చర్చించండి. Page No. 16
జవాబు:
భూమి ఎలాంటి అక్షం లేకుండా తిరగటానికి ప్రధాన కారణం. అంతరిక్షంలోని సూర్యుడు, చంద్రుడు ఇతర ఖగోళ వస్తువుల (ఆకర్షణ) గురుత్వాకర్షణ బలాలతో తిరుగుతుంది.
ప్రశ్న 3.
ఖగోళ వస్తువులన్నీ గుండ్రని ఆకారంలో ఉంటాయి. ఎందుకు?
జవాబు:
ఖగోళ వస్తువులన్నీ గుండ్రంగా, గోళాకారంలో ఉండటానికి కారణం – ప్రధానంగా గురుత్వాకర్షణ శక్తి అని చెప్పవచ్చు. ఖగోళ వస్తువు యొక్క గురుత్వాకర్షణ శక్తి అన్ని వైపులకు సమానంగా లాగబడటం వలన ఇవి గోళాకారంగా ఉన్నాయి. (విశ్వం ఏర్పడినప్పుడు ఏర్పడిన ఈ ఖగోళ వస్తువులన్ని నక్షత్రాల చుట్టు తిరుగుతూ, వాని ఆకర్షణకు లోనవ్వటం కూడా మరొక కారణం)
6th Class Social Textbook Page No.17
ప్రశ్న 4.
భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది?
జవాబు:
భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది.
ప్రశ్న 5.
ఏ అర్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలున్నాయి?
జవాబు:
ఉత్తరార్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలున్నాయి.
ప్రశ్న 6.
అంటార్కిటికా ఖండం ఏ అర్ధగోళంలో ఉంది?
జవాబు:
అంటార్కిటికా ఖండం దక్షిణార్ధగోళంలో ఉంది.
ప్రశ్న 7.
ప్రపంచపటం, గ్లోబు లేక అట్లాసు సహాయంతో కింది పట్టికను పూరించండి.
జవాబు:
ఉత్తరార్ధ గోళంలో ఉన్న ఖండాల పేర్లు | దక్షిణార్ధ గోళంలో ఉన్న ఖండాల పేర్లు | ఉత్తర, దక్షిణార్ధ గోళాలలో విస్తరించి ఉన్న ఖండాల పేర్లు |
1. ఉత్తర అమెరికా 2. యూరప్ 3. ఆసియా |
1. ఆస్ట్రేలియా 2. అంటార్కిటికా |
1. దక్షిణ అమెరికా 2. ఆఫ్రికా |
ఉత్తరార్ధ గోళంలో ఉన్న మహా సముద్రాల పేర్లు | దక్షిణార్ధ గోళంలో ఉన్న . మహాసముద్రాల పేర్లు | ఉత్తర, దక్షిణార్ధ గోళాలలో విస్తరించి ఉన్న మహా సముద్రాల పేర్లు |
1. ఆర్కిటిక్ మహాసముద్రం | 1. అంటార్కిటిక్ (దక్షిణ) మహాసముద్రం | 1. పసిఫిక్ మహాసముద్రం 2. అట్లాంటిక్ మహాసముద్రం 3. హిందూ మహాసముద్రం |
6th Class Social Textbook Page No.18
ప్రశ్న 8.
గ్లోబు లేక న్యూస్ సహాయంతో కింది పట్టికను పూరించండి.
అక్షాంశాలు | డిగ్రీలు |
ఉత్తర ధృవం | |
ఆర్కిటిక్ వలయం | |
కర్కటరేఖ | |
భూమధ్యరేఖ | 0° |
మకరరేఖ | |
అంటార్కిటిక్ వలయం | |
దక్షిణ ధృవం |
జవాబు:
అక్షాంశాలు | డిగ్రీలు |
ఉత్తర ధృవం | 90° ఉత్తర అక్షాంశం |
ఆర్కిటిక్ వలయం | 66½° ఉత్తర అక్షాంశం |
కర్కటరేఖ | 23½° ఉత్తర అక్షాంశం |
భూమధ్యరేఖ | 0° |
మకరరేఖ | 23½° దక్షిణ అక్షాంశం |
అంటార్కిటిక్ వలయం | 66½° దక్షిణ అక్షాంశం |
దక్షిణ ధృవం | 90° దక్షిణ అక్షాంశం |
ప్రశ్న 9.
అక్షాంశాలు ధృవాల వైపుకు వెళ్ళే కొలదీ ఎందుకు చిన్నవిగా ఉంటాయి? అతి పెద్ద అక్షాంశం ఏది?
జవాబు:
- భూమి గోళాకారంగా ఉండటం వలన మధ్యలో ఉబ్బెత్తుగా ఉండి చివరలకు (పైకి, క్రిందకు) వెళ్ళినట్లయితే చిన్నవిగా ఉంటూ (ధృవాల వైపు) ఇంకా పైకి క్రిందకు వెళితే బిందువులుగా మారిపోతాయి.
- భూమధ్యరేఖ అతి పెద్ద అక్షాంశం.
6th Class Social Textbook Page No.20
ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్ పటంలో ఇవ్వబడిన అక్షాంశాల మరియు రేఖాంశాల విస్తరణను గుర్తించండి. మీరు అట్లాసు సహాయం తీసుకొనవచ్చును.
జవాబు:
6th Class Social Textbook Page No.23
ప్రశ్న 11.
క్రిస్టమస్ వేడుకలు ఆస్ట్రేలియాలో వేసవికాలంలో జరుపుకుంటారు, మీకు తెలుసా?
జవాబు:
డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకరరేఖ మీద పడతాయి. మకర రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వలన దక్షిణార్ధ గోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువలన దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది. ఆస్ట్రేలియా దక్షిణార్ధగోళంలో వుండటం వలన క్రిస్టమస్ వేడుకలు (డిసెంబర్ 25) వేసవికాలంలో జరుపుకుంటారు.
ప్రాజెక్టు పని
ఒక గ్లోబును గీసి భూమి యొక్క అక్షం, భూమధ్యరేఖ, కర్కటరేఖ, మకరరేఖ, ఆర్కిటిక్, అంటార్కిటిక్ వలయాలను, గుర్తించండి.
జవాబు:
AP Board Textbook Solutions PDF for Class 6th Social Science
- AP Board Class 6
- AP Board Class 6 Social Science
- AP Board Class 6 Social Science Chapter 1 Our Earth in the Solar System
- AP Board Class 6 Social Science Chapter 2 Globe Model of the Earth
- AP Board Class 6 Social Science Chapter 3 Maps
- AP Board Class 6 Social Science Chapter 4 Land Forms Andhra Pradesh
- AP Board Class 6 Social Science Chapter 5 Early Life to Settled Life
- AP Board Class 6 Social Science Chapter 6 Early Civilisations
- AP Board Class 6 Social Science Chapter 7 Emergence of Kingdoms and Republics
- AP Board Class 6 Social Science Chapter 8 Kingdoms and Empires
- AP Board Class 6 Social Science Chapter 9 Government
- AP Board Class 6 Social Science Chapter 10 Local Self Government
- AP Board Class 6 Social Science Chapter 11 Indian Culture Languages and Religions
- AP Board Class 6 Social Science Chapter 12 Towards Equality
- AP Board Class 6 Social Science Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి
- AP Board Class 6 Social Science Chapter 2 గ్లోబు – భూమికి నమూనా
- AP Board Class 6 Social Science Chapter 3 పటములు
- AP Board Class 6 Social Science Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు
- AP Board Class 6 Social Science Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం
- AP Board Class 6 Social Science Chapter 6 తొలి నాగరికతలు
- AP Board Class 6 Social Science Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం
- AP Board Class 6 Social Science Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు
- AP Board Class 6 Social Science Chapter 9 ప్రభుత్వం
- AP Board Class 6 Social Science Chapter 10 స్థానిక స్వపరిపాలన
- AP Board Class 6 Social Science Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు
- AP Board Class 6 Social Science Chapter 12 సమానత్వం వైపు
0 Comments:
Post a Comment