![]() |
AP Board Class 7 Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 7th Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం Book Answers |
Andhra Pradesh Board Class 7th Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం Textbooks Solutions PDF
Andhra Pradesh State Board STD 7th Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 7th Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 7th Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 7th Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం Textbooks. These Andhra Pradesh State Board Class 7th Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.Andhra Pradesh State Board Class 7th Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం Books Solutions
Board | AP Board |
Materials | Textbook Solutions/Guide |
Format | DOC/PDF |
Class | 7th |
Subject | Maths |
Chapters | Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం |
Provider | Hsslive |
How to download Andhra Pradesh Board Class 7th Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం Textbook Solutions Answers PDF Online?
- Visit our website - Hsslive
- Click on the Andhra Pradesh Board Class 7th Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం Answers.
- Look for your Andhra Pradesh Board STD 7th Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం Textbooks PDF.
- Now download or read the Andhra Pradesh Board Class 7th Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం Textbook Solutions for PDF Free.
AP Board Class 7th Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం Textbooks Solutions with Answer PDF Download
Find below the list of all AP Board Class 7th Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:7th Class Social 9th Lesson భారత రాజ్యాంగం – పరిచయం Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
I. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
ఒక ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం ఎందుకు అవసరం?
జవాబు:
- ఉదయం పాఠశాలకు వచ్చినప్పటి నుండి సాయంత్రం పాఠశాలను విడిచి వెళ్లేవరకు పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాలు అనగా అసెంబ్లీ, వివిధ పాఠ్యాంశాల బోధనాభ్యసన కార్యక్రమాలు, క్రీడలు మొదలైనవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో నిర్వహించబడతాయి.
- ఇవన్నీ కూడా మన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి రూపొందించుకున్న ఒక కాలక్రమ పట్టిక ప్రకారం జరుగుతున్నాయి. ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా పాఠశాలను నిర్వహించడమనేది కష్టం అనేది మనందరికీ తెలుసు.
- అదే విధంగా ఒక దేశాన్ని పరిపాలించాలంటే ఆ దేశాధినేత, ప్రభుత్వం, చట్టసభలు, న్యాయస్థానాలు మొదలగు అంశాలతో కూడిన ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది.
- అందులోని అంశాల ఆధారంగా సక్రమ పరిపాలనను ప్రజలకు అందించడానికి అవకాశం కలుగుతుంది.
ప్రశ్న 2.
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
భారత రాజ్యాంగ ఆవిర్భావ సమయంలో, మనకు ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి. కాని, 1978వ సంవత్సరంలో 44వ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది. కనుక ప్రాథమిక హక్కులు ఆరు అవి:
ప్రాథమిక హక్కులు
ప్రాథమిక హక్కు | వివరణ |
1) సమానత్వపు హక్కు (ప్రకరణ 14-18) |
భారత రాజ్యాంగం సమానత్వపు హక్కుకు హామీ ఇస్తుంది. ఇది చట్టం యొక్క సమాన రక్షణ, సామాజిక సమానత్వం, ఉపాధి మరియు విద్యలో సమాన అవకాశాలు, అంటరానితనం రద్దు మరియు బిరుదులు రద్దు అనే అంశాలను కలిగి ఉంది. |
2) స్వేచ్ఛా హక్కు (ప్రకరణ 19-22) |
స్వేచ్ఛా హక్కు ఈ క్రింది ఆరు రకాలైన స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది : వాక్ మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ, సంఘాలు లేదా వ్యవస్థలుగా ఏర్పడటానికి స్వేచ్ఛ, సంచరించడానికి స్వేచ్ఛ, భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడటానికి స్వేచ్ఛ, ఏదైనా వృత్తిని చేపట్టడానికి స్వేచ్ఛ మరియు జీవించే హక్కు. |
3) పీడనాన్ని నిరోధించే హక్కు (ప్రకరణ 23-24) |
ఈ హక్కు కింద, అన్ని రకాల “వెట్టిచాకిరి నిషేధించబడింది”. ఇది బాలకార్మిక వ్యవస్థను కూడా నిషేధిస్తుంది. “14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఏదేని కర్మాగారంలో లేదా గనులలో పని చేయించరాదు. ఏ ఇతర ప్రమాదకర ఉపాధిలో నియమించరాదు”. అని రాజ్యాంగం చెబుతోంది. |
4) మత స్వాతంత్ర్యపు హక్కు (ప్రకరణ 25-28) |
వ్యక్తులు అందరూ తమ మనస్సాక్షిని అనుసరించడానికి మరియు ఏ మతాన్ని అయినా ఆచరించే స్వేచ్ఛను కలిగి ఉంటారు. మన దేశంలో హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం వంటి అనేక మతాలు ఉన్నప్పటికీ రాజ్యా నికి అధికార మతం లేదు. మత వ్యవహారాలలో ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది. కాబట్టి మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పిలుస్తారు. |
5) విద్యా సాంస్కృతికపు హక్కు (ప్రకరణ 29-30) |
రాజ్యాంగం ప్రకారం, మైనారిటీలందరు, మత ప్రాతిపదికన లేదా భాషా ప్రాతిపదికన, తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించడానికి, నిర్వహించు కోవడానికి హక్కు ఉంది. వారు తమ సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉంటారు. |
6) రాజ్యాంగ పరిహారపు హక్కు (ప్రకరణ – 32) |
ఈ హక్కు సుప్రీం కోర్టు మరియు హైకోర్టుల ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. |
ప్రశ్న 3.
ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు ఉదాహరణ :
- ఒక వ్యక్తిని కారణం తెలపకుండా నిర్బంధంలోకి తీసుకోవడం.
- ఒక వ్యక్తి బిరుదులు తన పేరు ముందు గాని, చివర గాని పెట్టుకోవడం.
- 14 సంవత్సరాల లోపు పిల్లలచే పని చేయించడం.
- ఒక వ్యక్తి తనకు ఆసక్తి గల మతాన్ని అనుసరించకుండా అడ్డుకోవటం,
- అంటరానితనంను ప్రోత్సహించడం.
- కుల ప్రాతిపదికన వ్యక్తులకు వేరే ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు.
- ప్రభుత్వాలను సహేతుకంగా విమర్శించినను నిర్బంధించటం.
- శాంతియుతంగా సమావేశమవ్వడానికి అనుమతినివ్వకపోవటం.
- తనకు నచ్చిన వ్యాపారం, వృత్తిని చేసుకోకుండా అడ్డుకోవటం.
ప్రశ్న 4.
ప్రాథమిక విధులు దేశభక్తిని ఎలా పెంచుతాయి?
జవాబు:
ప్రాథమిక విధులలో రాజ్యాంగానికి బద్దుడై ఉండుట, జాతీయ పతాకమును, జాతీయ గీతమును గౌరవించుట, దేశమును రక్షించుట మరియు కోరినపుడు జాతికి సేవ చేయుట. దేశ సమగ్రతను సమైక్యతను కాపాడుట. స్వాతంత్ర్య పోరాట ఆదర్శాలను అనుసరించుట మొదలైన విధులు పాటించుట వలన దేశభక్తి కచ్చితంగా పెరుగుతుంది. ఎప్పుడైతే పై విధులను సక్రమంగా అనుసరిస్తారో అప్పుడు వారిలో దేశభక్తి పెరుగుతుందనుటలో సందేహం లేదు.
ప్రశ్న 5.
భారత రాజ్యాంగ తయారీలో డా॥బి.ఆర్. అంబేద్కర్ పాత్రను అభినందించండి.
జవాబు:
- డా|| బి.ఆర్. అంబేద్కరను “భారత రాజ్యాంగ పిత” గా అభివర్ణిస్తారు.
- స్వతంత్ర భారతదేశపు ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాధ్యత వహించారు.
- 1947లో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖా మంత్రిగా నియమించబడ్డారు.
- డా|| భీమ్ రావ్ రామ్ జీ అంబేద్కర్‌ను, బాబా సాహెబ్ అంబేద్కర్ అని కూడ పిలుస్తారు.
- వీరు న్యాయ శాస్త్రవేత్త. సామాజిక సంస్కర్త మరియు రాజకీయవేత్త.
- భీమ్ రావ్ అంబేద్కర్ భీమా బాయి మరియు రాంజీ దంపతులకు 14 ఏప్రిల్, 1891న సెంట్రల్ ప్రావిన్సెస్ (మధ్యప్రదేశ్) లోని మౌ ఆర్మీ కంటోన్మెంట్లో జన్మించారు.
- అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ వారి భారత సైన్యంలో సుబేదార్‌గా పనిచేసి 1894 లో పదవీ విరమణ చేసిన తరువాత, కుటుంబంతో సెంట్రల్ ప్రావిన్సెస్లోని సతారాకు వెళ్లారు.
- తన బాల్యంలో అంబేద్కర్ అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాడు. అవి తదుపరి జీవితంలో ఆయన రచనలను, సిద్ధాంతాలను ప్రభావితం చేసాయి.
- అంబేద్కర్ తన జీవితంలో ఎక్కువ భాగం రాజకీయ స్రవంతి వెలుపల పనిచేశారు. ముఖ్యంగా పేదలు మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేశారు.
ప్రశ్న 6.
మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను పేర్కొనండి.
జవాబు:
- రాజ్యాంగానికి బద్దుడై ఉండుట, జాతీయ పతాకమును, జాతీయ గీతాన్ని గౌరవించుట.
- భారత సార్వభౌమత్వం, ఐక్యత, అఖండతను సమర్ధించుట, సంరక్షించుట.
- సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందించుట.
- సహజ పర్యావరణాన్ని కాపాడి, అభివృద్ధిపరుచుట.
- ప్రజల ఆస్తిని సంరక్షించుట, హింసను విడనాడుట.
- విద్యావకాశాలను కల్పించుట.
- స్వాతంత్ర్య పోరాట ఆదర్శాలను అనుసరించుట.
- దేశమును రక్షించుట మరియు కోరినపుడు జాతికి సేవ చేయుట.
- సుసంపన్నమైన మన సంస్కృతిని వారసత్వాన్ని రక్షించుట.
- శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించుట.
- అభ్యున్నతి కోసం కృషి చేయడం.
ప్రశ్న 7.
“భారతదేశం సార్వభౌమాధికారం గల దేశం” వ్యాఖ్యానించుము.
జవాబు:
- బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని సార్వభౌమాధికారం అంటారు.
- భారతదేశంపై ఏ ఇతర దేశం / సమాజం పెత్తనం లేదు. భారతదేశంలో బాహ్య, అంతర్గత విషయాల నిర్ణయాలు దేశ ప్రజలే తీసుకోగలరు (ప్రజాప్రతినిధులే).
- భారతదేశం బ్రిటిషు వారి వలస పాలన నుండి విముక్తి పొందినప్పటి నుండి సర్వసత్తాక అధికారం కల్గిన దేశంగా రూపొందింది.
ప్రశ్న 8.
మంచి పౌరునికి ఉండవలసిన లక్షణాలు వ్రాయండి.
జవాబు:
ఒక వ్యక్తిగాని, సమాజం గాని అభివృద్ధిని సాధించాలంటే విలువలు అనేవి అత్యంత ఆవశ్యకమైనవి. ముఖ్యంగా ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి ఇవి మరింత అవసరం. నీతి, నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం, చిత్తశుద్ధి మొదలగు విలువలను పౌరులు కలిగి ఉన్నప్పుడు సమాజం అన్ని విధాలుగా ప్రగతి పధంలో పయనిస్తుంది.
బాధ్యతాయుతమైన పౌరులుగా భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అనుభవిస్తూ, వ్యక్తిగత ప్రగతిని సాధిస్తూనే సమాజ శ్రేయస్సు కొరకు పౌర విధులను కూడా సక్రమంగా నిర్వర్తించాలి. మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన జాతీయ నాయకుల యొక్క దేశ భక్తిని ఆదర్శంగా తీసుకొని అన్ని సందర్భాలలో అదే స్ఫూర్తితో పనిచేయాలి. స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండటంతో పాటుగా, పాఠ్యేతర కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు క్రమశిక్షణ పాటించాలి. క్రీడా మైదానంలో ఆటలు ఆడేటప్పుడు, క్రీడా స్ఫూర్తితో మెలిగి, గెలుపు ఓటములనేవి ఆటలో భాగంగా భావించాలి.
వివిధ ఆచార సాంప్రదాయాలు గల మన దేశంలో తోటి వారి పట్ల సహనం, సోదర భావం కలిగి ఉండి వారి అభిప్రాయాలను గౌరవిస్తూ, మనం ఇతరుల నుండి ఏమి ఆశిస్తున్నామో, అలాగే ఇతరుల విషయాలలో కూడా మర్యాదపూర్వకంగా నడచుకోవాలి.
అదే విధంగా రాజ్యాంగం పట్ల గౌరవాన్ని, విధేయతను కనబరుస్తూ, విలువలను పాటిస్తూ, ఉత్తమ పౌరులుగా మెలిగినప్పుడు మన రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుతాయి.
II. బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాయుము.
1. రాజ్యాంగ సభ చైర్మన్
ఎ) డా. బి. ఆర్. అంబేద్కర్
బి) జవహర్ లాల్ నెహ్రూ
సి) మహాత్మా గాంధీ
డి) డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్
జవాబు:
డి) డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్
2. కింది వాటిలో భిన్నమైనది ఏది?
ఎ) స్వేచ్ఛ
బి) అసమానత
సి) న్యాయం
డి) సౌభ్రాతృత్వం
జవాబు:
బి) అసమానత
3. మన రాజ్యాంగంలో విద్యాహక్కు గురించి ఏ నిబంధన చెబుతోంది?
ఎ) 19
బి) 20-ఎ
సి) 21
డి) 21-ఎ
జవాబు:
డి) 21-ఎ
4. క్రింది వాటిలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏది?
ఎ) చట్టం ముందు అందరూ సమానులే.
బి) టీ షాపులో 14 ఏళ్ల లోపు బాలుడు పని చేయుట.
సి) ఒక వ్యక్తికి ఏ మతాన్ని అయినా అనుసరించే హక్కు ఉంది.
డి) అన్నీ
జవాబు:
బి) టీ షాపులో 14 ఏళ్ల లోపు బాలుడు పని చేయుట.
5. మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి ఏ నిబంధన తెలియచేస్తుంది?
ఎ) 51
బి) 51-ఎ
సి) 21
డి) 21-ఎ
జవాబు:
బి) 51
6. భారత రాజ్యాంగం యొక్క “లక్ష్యాల తీర్మానం” ను ఎవరు ప్రతిపాదించారు?
ఎ) డా|| బి.ఆర్ అంబేద్కర్
బి) సర్దార్ వల్లభాయ్ పటేల్
సి) జవహర్‌లాల్ నెహ్రూ
డి) హెచ్.సి. ముఖర్జీ
జవాబు:
సి) జవహర్‌లాల్ నెహ్రూ
III. జతవరుచుము.
గ్రూప్ – A గ్రూప్ – B 1. 42వ రాజ్యాంగ సవరణ (ఇ) ఎ) ప్రాథమిక హక్కులు 2. 44వ రాజ్యాంగ సవరణ ( సి ) బి) ప్రాథమిక విధులు 3. ,86వ రాజ్యాంగ సవరణ (డి) సి) ఆస్తి హక్కు తొలగింపు 4. 3వ భాగం (ఎ) డి) విద్యా హక్కు 5. భాగం – IVA ( బి , ఇ) పీఠికలో సామ్యవాదం, లౌకిక పదాలు చేర్చడం.
పద బంధము
ఇచ్చిన సూచనల ఆధారంగా, రాజ్యాంగ పీఠిక నుండి తీసుకోబడిన పదాలతో పదకోశం పూరించండి.
నిలువు :
1. పౌరులందరి నైతిక బాధ్యతలు (3)
3. రాజ్యాంగ లక్ష్యాలను తెలియపరిచేది (4)
6. ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం (4)
అడ్డం :
2. వ్యక్తుల సహేతుకమైన వాదనలు (3)
4. ప్రభుత్వం ఏ మతానికి అనుకూలం కాదు (6)
5. దేశాధినేత ప్రజలచే ఎన్నుకోబడతారు (4)
7. ప్రజలందరూ సోదరభావంతో కలిసిమెలిసి జీవించడం (5)
జవాబు:
7th Class Social Studies 9th Lesson భారత రాజ్యాంగం – పరిచయం InText Questions and Answers
7th Class Social Textbook Page No.63
ప్రశ్న 1.
రాజ్యాంగ సభ సభ్యులలో ఎవరైనా నలుగురు ప్రముఖులను గుర్తించండి మరియు వారి గురించి సంక్షిప్తంగా వ్రాయండి.
జవాబు:
1. డా|| బి.ఆర్.అంబేద్కర్ :
డా॥ భీమ్ రావు రామ్ జీ అంబేద్కర్‌ను, బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు. వీరు న్యాయ శాస్త్రవేత్త, సామాజిక సంస్కర్త మరియు రాజకీయవేత్త, భీమ్ రావు అంబేద్కర్ భీమా బాయి మరియు రాంజీ దంపతులకు 14 ఏప్రిల్, 1891న సెంట్రల్ ప్రావిన్సెస్ (మధ్యప్రదేశ్) లోని మౌ ఆర్మీ కంటోన్మెంట్లో జన్మించారు. అంబేద్కర్ తండ్రి బ్రిటీష్ వారి భారత సైన్యంలో సుబేదార్‌గా పనిచేసి 1894లో పదవీ విరమణ చేసిన తరువాత, కుటుంబంతో సెంట్రల్ ప్రావిన్సెస్లోని సతారాకు వెళ్ళారు. తన బాల్యంలో అంబేద్కర్ అనేక సవాళ్ళను ఎదుర్కొన్నారు. అవి తదుపరి జీవితంలో ఆయన రచనలను, సిద్ధాంతాలను ప్రభావితం చేశాయి. ఆయన “భారత రాజ్యాంగ పిత”గా పరిగణించబడ్డారు. స్వతంత్ర భారతదేశం కోసం ముసాయిదా రాజ్యాంగాన్ని సిద్ధం చేసే బాధ్యత ఆయనపై ఉండింది. ఆయన 1947లో భారతదేశపు న్యాయశాఖా మంత్రిగా నియమించబడ్డారు. అంబేద్కర్ తన జీవితంలో ఎక్కువ భాగం ప్రధాన రాజకీయ స్రవంతి వెలుపల పనిచేశారు. ముఖ్యంగా పేదలు మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేశారు.
2. డా॥ బాబు రాజేంద్రప్రసాద్ :
వీరు రాజ్యాంగ సభ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ తరువాత, 1950, జనవరి 24న . రాజ్యాంగ సభ చివరి సమావేశంలో స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి డా|| బాబూ రాజేంద్రప్రసాద్ (1950 – 1962)
3. సర్దార్ వల్లభాయ్ పటేల్ :
వీరు గుజరాత్ లో అక్టోబర్ 31, 1875న జన్మించారు. భారతదేశానికి మొదటి ఉప ప్రధానిగా పనిచేసారు. ఈయన ఒక న్యాయవాది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రముఖ యోధుడు. స్వాతంత్ర్యానంతరం భారతదేశంలోని అనేక చిన్న చిన్న సంస్థానాలను (దాదాపు 566) ఏకం చేసిన ‘ఉక్కు మనిషి’ రాజ్యాంగ పరిషత్ సభలో ‘ప్రాథమిక హక్కుల’ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. భారతదేశపు బిస్మార్క్ గా ఉక్కు మనిషిగా పేరుగాంచిన పటేల్ 1950, డిశంబరు 15న మరణించారు.
4. జవహర్‌లాల్ నెహ్రూ :
వీరు నవంబరు 14, 1889న ఉత్తరప్రదేశ్ లోని అహ్మదాబాద్ లో జన్మించారు. వలసవాద వ్యతిరేక జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ప్రముఖ నాయకుడు, 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ ప్రధానిగా పనిచేసారు. భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర పోషించారు. భారత రాజ్యాంగ పరిషత్ లో కేంద్ర రాష్ట్రాల కమిటీ, కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షులుగా వ్యవహరించారు. 1964, మే 27న
మరణించారు.
7th Class Social Textbook Page No.77
ప్రశ్న 2.
క్రింద ఇవ్వబడిన ప్రకటనలలో ప్రాథమిక హక్కులేవో మరియు ప్రాథమిక విధులేవో గుర్తించి, సరియైన గడలో టిక్ మార్క్ ఉంచండి.
జవాబు:
7th Class Social Textbook Page No.79
ప్రశ్న 3.
మన జీవితంలో సమానత్వం మరియు సౌభ్రాతృత్వం సాధనపై ఒక నాటికను తయారుచేసి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థులు నాటికను స్వయంగా తరగతి గదిలో ప్రదర్శించగలరు.
ఆలోచించండి – ప్రతిస్పందించండి
7th Class Social Textbook Page No.57
ప్రశ్న 1.
బ్రిటిషు ప్రభుత్వం చేసిన చట్టాలను మన జాతీయ నాయకులు ఎందుకు వ్యతిరేకించారు?
జవాబు:
బ్రిటిషు ప్రభుత్వం చేసిన చట్టాలను మన జాతీయ నాయకులు ఎందుకు వ్యతిరేకించారంటే,
- ఈ చట్టాలు భారతీయులకు అధికారం ఇచ్చినట్లుగానే ఉంటూ అసలు (పూర్తి) అధికారం బ్రిటిషు వారి చేతిలోనే ఉండేలా ఉంటాయి. ఉదా : రాష్ట్రాల శాసన సభలలో అనధికార సభ్యుల మెజారిటీని అనుమతించడం (1909 చట్టం ).
- విభజించు – పాలించు విధానమును ఈ చట్టాల ద్వారా అమలు చేసారు. ఉదా : 1909 చట్టంలో (హిందూ) ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించడం.
- ఈ చట్టాలన్ని పరిమిత ఓటు హక్కు మాత్రమే ప్రతిపాదించాయి. భారతీయ పౌరులందరికీ ఓటు హక్కు లేదు.
- గవర్నర్ జనరలకు విశేషాధికారం కల్పించి, మన ప్రతినిధులకు, మంత్రులకు నామమాత్రపు అధికారం ఇవ్వటం.
- ద్వంద్వ పాలనలో భాగంగా ప్రాధాన్యత లేని, ఆర్థికపరంగా లాభం కాని శాఖలను భారతీయులకు ఇవ్వటం మొదలైనవి.
7th Class Social Textbook Page No.59
ప్రశ్న 2.
భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఎందుకు డిమాండ్ చేసింది? దీని వెనుక గల కారణాలు ఏమిటి?
జవాబు:
భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని INC డిమాండ్ చేయటానికి కారణం :
- క్విట్ ఇండియా ఉద్యమం : క్రిప్స్ (1942) ప్రతిపాదనలు విఫలమవ్వటంతో ఈ ఉద్యమంను చేపట్టారు. మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి బ్రిటిషు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. అలాగే డొమీనియన్ స్టేటస్ గురించి చర్చ వచ్చినది.
- మంత్రిత్రయ రాయబారం : 1946లో పార్లమెంట్‌లో భారతదేశానికి అధికార బదిలీకి సంబంధించిన ప్రకటన “అట్లే’ చేసారు. భారత పాలనకై రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయాలని ప్రకటించారు.
- భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగం లేకపోతే భారతదేశ పాలన అంతా కూడా బ్రిటిషు పార్లమెంటు చేసే చట్టాల ద్వారా సాగుతుంది.
- భారత ప్రభుత్వ చట్టాలు (బ్రిటన్ పార్లమెంట్ చేసేవి) భారతీయుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని కాకుండా బ్రిటనకు లాభం చేకూర్చే విధంగా ఉండేవి.
ప్రశ్న 3.
‘సార్వజనీన వయోజన ఓటు హక్కు’ అనగానేమి?
జవాబు:
జాతి, కులం, మతం, లింగం, విద్య, ఆర్థిక స్థితి, వర్గం ప్రాంతం వంటి ఏ అంశాలతో సంబంధం లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నిర్ణీత వయసు కలిగిన వయోజనులందరకూ ఓటుహక్కును కల్పించటాన్ని సార్వజనీన వయోజన ఓటుహక్కు అంటారు.
7th Class Social Textbook Page No.63
ప్రశ్న 4.
రాజ్యాంగ పరిషత్ లో కేవలం 9 మంది మహిళా సభ్యులు మాత్రమే ఉన్నారు. ఎక్కువ మంది మహిళా సభ్యులు ఉండి ఉంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారా? ఎందుకు?
జవాబు:
అవును. రాజ్యాంగ పరిషత్ లో ఎక్కువ మంది (కనీసం సగం మంది మహిళా సభ్యులు ఉండి ఉంటే బాగుండేది అనుకుంటున్నాను. ఎందుకంటే, భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళా జనాభా కలరు. కావున వారి యొక్క ప్రాతినిధ్యం ఎంతో అవసరం. మహిళా సమస్యలు మహిళలు మాత్రమే బాగా అర్థం చేసుకోగలరు.
7th Class Social Textbook Page No.65
ప్రశ్న 5.
మన రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. కాని ఇది 1950, జనవరి 26న ఎందుకు ఆలస్యంగా అమల్లోకి వచ్చింది? మీ ఉపాధ్యాయుని సహాయంతో కారణం తెలుసుకోండి.
జవాబు:
భారత జాతీయ కాంగ్రెసు 1929 డిసెంబరులో చారిత్రాత్మక ‘పూర్ణ స్వరాజ్’ తీర్మానాన్ని లాహోర్ సమావేశంలో ఆమోదించింది. 1930, జనవరి 26న భారతీయులను స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. అలా ప్రతి సంవత్సరం జనవరి 26న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటూ వచ్చారు. మనకు స్వాతంత్ర్యం 1947, ఆగస్టు 15న ఇవ్వడం జరిగింది. అందువలన చారిత్రాత్మకమైన రోజుని మర్చిపోకుండా ఉండేందుకు రాజ్యాంగంను 1950, జనవరి 26న అమలుచేసారు.
ప్రశ్న 6.
మనం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము?
జవాబు:
భారత రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చినందుకు, అనగా భారతదేశాధినేత బ్రిటన్ రాజు లేదా రాణి లాగా వంశపారంపర్యంగా కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అందుకని జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము.
7th Class Social Textbook Page No.67
ప్రశ్న 7.
మన రాజ్యాంగ పీఠికను చాలా జాగ్రత్తగా చదవండి మరియు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
ఎ) మన రాజ్యాంగ పీఠిక ‘భారతదేశ ప్రజలమైన మేము’తో ప్రారంభమవుతుంది. దీని అర్థం ఏమిటి?
బి) పీఠికలో ఇవ్వబడిన తేదీని గుర్తించి దాని ప్రాముఖ్యతను రాయండి.
సి) పిరిక రాజ్యాంగంలో భాగమా? కాదా? మీ ఉపాధ్యాయుని సహాయంతో తెలుసుకోవటానికి ప్రయత్నించండి.
జవాబు:
ఎ) “భారత ప్రజలమైన మేము” అనే భావన రాజ్యాంగానికి ప్రజలే ఆధారమని తెల్పుతుంది. రాజ్యాంగాన్ని చర్చించి, శాసనం చేసుకుని, మాకు మేము సమర్పించుకుంటున్నాము అనే భావన రాజ్యాంగ పరిషత్తు దేశ – ప్రజలందరికి ప్రాతినిధ్యము వహించిందని తెలియజేస్తుంది. దీనిలో ప్రజాస్వామ్య భావన ఇమిడి ఉంది.
బి) పీఠికలో తేది : 1949 సంవత్సరం, నవంబరు 26. దీని ప్రాముఖ్యత భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన రోజు.
సి) ‘పీఠిక’ రాజ్యాంగంలో భాగమే. అయితే సుప్రీం కోర్టు ఈ అంశంపై భిన్న తీర్పులను వెలువరించింది.
7th Class Social Textbook Page No.69
ప్రశ్న 8.
భారతదేశాన్ని గణతంత్ర రాజ్యం అని ఎందుకు పిలుస్తారు?
జవాబు:
భారత దేశాధినేత, రాష్ట్రపతి ప్రజల చేత ఎన్నుకోబడటం వలన మన దేశాన్ని గణతంత్ర రాజ్యం అని పిలుస్తారు.
ప్రశ్న 9.
భారతదేశాన్ని లౌకిక దేశం అని మీరు ఎలా చెప్పగలరు?
జవాబు:
భారతదేశం లౌకిక దేశం. భారతదేశ ప్రభుత్వం ఏ మతాన్నీ ప్రోత్సహించదు, ఆటంకపరచదు అంటే ప్రజలకు మత స్వేచ్ఛ కలదు. ప్రభుత్వం కూడా మతం విషయంలో తటస్థంగా ఉంటుంది. కనుక భారతదేశంను లౌకిక దేశం అని చెప్పగలను.
7th Class Social Textbook Page No.73
ప్రశ్న 10.
ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడింది. ఎందుకు?
జవాబు:
ఆస్తి హక్కు థమిక హక్కుల నుండి తొలగించడానికి కారణం
- భారతదేశం ‘సామ్యవాదం’ అంటే సమ సమాజ స్థాపన అను ఆశయాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రూపొందించుకుంది.
- సామ్యవాదంలో సాధ్యమైనంత వరకు సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరించబడకుండా, ప్రజలందరు ఆర్థిక సమానత్వాన్ని అందిపుచ్చుకోవటానికి అవసరమైన తోడ్పాటును కలిగించడం జరుగుతుంది.
- సమసమాజ స్థాపనకై ధనిక, పేద అంతరాలను తగ్గించుటకై అందరికీ సమాన అవకాశాలు కల్పించుటకై 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు.
- ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడానికి గల కారణాలు సహేతుకమైనవేనని నా అభిప్రాయం.
ప్రశ్న 11.
మనకు స్వేచ్ఛా హక్కు ఎందుకు అవసరం?
జవాబు:
స్వేచ్ఛా హక్కు ఎందుకు అవసరం అంటే
- “స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధింపబడి ఉన్నాడు”, ఆ సంకెళ్ళను తొలగించడానికి స్వేచ్చ అవసరం.
- స్వేచ్ఛా హక్కు ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిది, ప్రజాస్వామ్యం విజయవంతం అవ్వాలంటే స్వేచ్ఛాహక్కు అవసరం.
- పౌరులకు (వ్యక్తి) జీవించే హక్కును కల్పించేది స్వేచ్ఛా హక్కు.
- అనేక రకాల వేధింపులు, అత్యాచారాలు, అవినీతి నుండి రక్షణ కల్పించటానికి స్వేచ్ఛా హక్కు అవసరం.
ప్రశ్న 12.
బాలల అభివృద్ధికి “పీడనాన్ని నిరోధించే హక్కు” ఏ విధంగా దోహదపడుతుంది?
జవాబు:
బాలల అభివృద్ధికి “పీడనాన్ని నిరోధించే హక్కు’ క్రింది విధంగా దోహదపడుతుంది.
- వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించింది.
- ప్రమాదకర కర్మాగారాలలో కఠినమైన పని నుండి పిల్లలకు రక్షణనిస్తుంది.
- కఠినమైన గనులలో కష్టమైన పని నుండి పిల్లలకు రక్షణనిస్తుంది.
- బాలల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది.
- బాల కార్మిక వ్యవస్థ నుండి బాలలను బంధ విముక్తులను చేస్తుంది.
ప్రశ్న 13.
ప్రభుత్వ పరిపాలనలో సమాచార హక్కుఎలా పారదర్శకతను కలిగిస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
- సమాచార హక్కు చట్టం ప్రకారం, ప్రతి పౌరునికి ప్రభుత్వం నుండి ఏదైనా సమాచారం తీసుకోవడానికి అధికారం కల్పిస్తుంది.
- ఈ చట్టం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి, సహాయ సమాచార అధికారి, అప్పిలేట్ అధికారులను కల్పించింది. వీరు పౌరులు అడిగిన సమాచారంనకు బాధ్యులు.
- ఈ విధంగా ప్రభుత్వం సమాచారం అంతా ప్రజలకు తెలుస్తుంది. అవినీతి, నిబంధనలకు విరుద్ధమైన చర్యలు, చట్ట వ్యతిరేక చర్యలను ఈ సమాచారం ద్వారా తెలుసుకోవచ్చు.
- ప్రభుత్వ వ్యవస్థ పెద్దది. చాలా సంక్లిష్టమయినది. దీని గురించి సరైన సమాచారం ఉంటేనే అవినీతి నిరోధానికి అవకాశం ఉంటుంది.
ప్రశ్న 14.
మీ పరిసరాలలో ఏదైనా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను మీరు చూశారా? చూసి ఉంటే కొన్ని ఉదాహరణలు చెప్పండి.
జవాబు:
ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు ఉదాహరణ:
- ఒక వ్యక్తిని కారణం తెలపకుండా నిర్బంధంలోకి తీసుకోవడం.
- ఒక వ్యక్తి బిరుదులు తన పేరు ముందు గాని, చివర గాని పెట్టుకోవడం.
- 14 సంవత్సరాల లోపు పిల్లలచే పని చేయించడం.
- ఒక వ్యక్తి తన ఆసక్తి గల మతాన్ని అనుసరించకుండా అడ్డుకోవటం.
- అంటరానితనంను ప్రోత్సహించడం.
- కుల ప్రాతిపదికన వ్యక్తులకు వేరే ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు.
- ప్రభుత్వాలను సహేతుకంగా విమర్శించినను నిర్బంధించటం.
- శాంతియుతంగా సమావేశమవ్వడానికి అనుమతినివ్వకపోవటం.
- తనకు నచ్చిన వ్యాపారం, వృత్తిని చేసుకోకుండా అడ్డుకోవటం.
7th Class Social Textbook Page No.75
ప్రశ్న 15.
మీ పాఠశాలలో మీరు అనుభవించిన హక్కులు మరియు ఆచరించిన విధులు ఏమిటి?
జవాబు:
మా పాఠశాలలో నేను అనుభవించిన హక్కులు :
- ఉచితంగా ప్రాథమిక విద్యను పొందటం (విద్యా హక్కు).
- స్వేచ్ఛగా ఆడుకోవటం, పాడుకోవటం (స్వేచ్ఛా హక్కు).
- అందరితో సమానంగా ఉండటం, అవకాశం పొందటం (సమానత్వ హక్కు).
- కావలసిన సమాచారంను పొందటం (సమాచార హక్కు).
- మంచి పోషకాహారం పొందటం (జీవించే హక్కు).
- విద్యార్థి క్లబ్ లను / సంఘాలను ఏర్పాటు చేసుకోవటం (స్వేచ్ఛా హక్కు) మొదలైన ఎన్నో హక్కులు పొందుతున్నాను.
మా పాఠశాలలో నేను ఆచరించిన విధులు :
- రోజు అసెంబ్లీలో జాతీయ గీతంను పాడటం, గౌరవ వందనం సమర్పించటం.
- తోటి విద్యార్థులందరితో సోదర భావంతో మెలగటం.
- పాఠశాల తోటను, చెట్లను సంరక్షిస్తూ పర్యావరణ హితానికి తోడ్పడటం.
- NCC, NSS లో నా సేవలు అందించటం.
- పాఠశాల బల్లలు, కుర్చీలు ఇతర సామగ్రిని భద్రంగా ఉంచటం.
- క్రమశిక్షణతో మెలగటం.
ప్రశ్న 16.
“హక్కులు మరియు విధులు ఒకే నాణేనికి రెండు వైపుల లాంటివి.” చర్చించండి.
జవాబు:
- ప్రాథమిక హక్కులు మరియు విధులు ఒక దానిపైనొకటి ఆధారపడి ఉన్నాయి.
- హక్కులు వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడితే, ఇతరుల అభివృద్ధికి విధులు తోడ్పడతాయి.
- మనం హక్కులు పొందాలంటే కచ్చితంగా విధులు/బాధ్యతలను పాటించాలి.
- విధులను మనం చక్కగా అనుసరిస్తే ఇతరులు హక్కులు కూడా అంత చక్కగా అందిస్తారు.
- విధులు లేని హక్కులు అసంపూర్ణము. హక్కులు లేని విధులు అర్థరహితము.
- హక్కులను దబాయించి అడగాలంటే, విధులు పాటించి తీరాలి.
7th Class Social Textbook Page No.79
ప్రశ్న 17.
బాధ్యతాయుతమైన పౌరుడిగా మీరు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించగలరు?
జవాబు:
- బాధ్యతాయుతమైన పౌరసత్వం సంఘంలో లేదా సమాజంలో మంచి పౌరులుగా ఉండటం. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండటం.
- నిజాయితీకి, నైతికతకు విలువనివ్వటం, మా మాటలు చేతల ద్వారా తెలియజేయటం.
- చట్టాలను గౌరవించటం, జవాబుదారీతనం కల్గి ఉండటం.
- దేశం పట్ల భక్తి, జాతీయతా భావాన్ని కల్గి ఉండటం.
- స్వీయ క్రమశిక్షణతో, ఇతరులతో మర్యాదగా మెలుగుతూ, ఇతర జాతులు, మతాల పట్ల సహనంతో మెలగటం.
అన్వేషించండి
7th Class Social Textbook Page No.57
ప్రశ్న 1.
అంతర్జాలాన్ని లేదా లైబ్రరీని సందర్శించడం ద్వారా, భారతదేశాన్ని పాలించడం కోసం బ్రిటిష్ పార్లమెంట్ చేసిన ఇతర చట్టాల గూర్చి ఒక జాబితాను తయారు చేయండి. (అవసరమైతే మీ ఉపాధ్యాయుని సహాయం తీసుకోండి)
జవాబు:
బ్రిటిషు పార్లమెంట్ చేసిన చట్టాలు :
- భారత రాజ్యాంగ చట్టం – 1858
- భారత కౌన్సిల్ చట్టం – 1861
- భారత కౌన్సిల్ చట్టం – 1892
- భారత కౌన్సిల్ చట్టం – 1909 (మింటో – మార్లే సంస్కరణలు)
- భారత ప్రభుత్వ చట్టం – 1919 (మాంటేగు – ఛైమ్స్ ఫర్డ్ సంస్కరణలు)
- భారత ప్రభుత్వ చట్టం – 1935
7th Class Social Textbook Page No.65
ప్రశ్న 2.
మీ పాఠ్యాంశంలో రాజ్యాంగ పీఠిక ఎందుకు ముద్రించబడి ఉందో మీకు తెలుసా ? అది ఎక్కడ ఉందో గుర్తించి చదవండి.
జవాబు:
రాజ్యాంగ పీఠిక పాఠ్య పుస్తకం యొక్క ఉద్దేశ్యాలు, లక్ష్యాలను తెలియజేయడానికి ముద్రించబడి ఉంది. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ విలువల్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశ ప్రజలు దేశంపై ఉంచుకున్న ఆశయాలు, ఆకాంక్షలు, అక్షర రూపంలో ఉన్నాయి. పీఠికలో పేర్కొన్న విలువలన్ని రాజ్యాంగంలో వ్యక్తీకరించబడ్డాయి.
ప్రాజెక్టు పని
ప్రశ్న 1.
రాజ్యాంగ సభలోని ప్రముఖుల యొక్క చిత్రాలను సేకరించి, ఒక ఆల్బమ్ ను తయారు చేయండి.
జవాబు:
ప్రశ్న 2.
మీ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఎలా జరుపుకున్నారో ఒక నివేదికను సిద్ధం చేయండి.
జవాబు:
మా పాఠశాలలో నవంబరు 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు, సాంఘికశాస్త్రం మరియు ఇతర ఉపాధ్యాయులు ఘనంగా జరిపారు. ముఖ్య అతిధిగా పూర్వ విద్యార్థి ప్రముఖ లాయర్‌ను ఆహ్వానించారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో భాగంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు, నిర్మాణం, చరిత్ర పరిణామ క్రమం, ముఖ్యమైన రాజ్యాంగ అంశాలు ప్రస్తావించారు. తరువాత ముఖ్య అతిధిగా విచ్చేసిన లాయర్ గారు రాజ్యాంగంలోని వివిధ చట్టాల ఆర్టికల్స్, హక్కుల గురించి విపులంగా చర్చించారు. అలాగే రాజ్యాంగ సవరణ విధానం, జరిగిన సవరణల గురించి ఇలా ఎన్నో ముఖ్య విషయాలను తెలియజేసారు. చివరిగా రాజ్యాంగ ప్రతిజ్ఞతో ముగించారు.
AP Board Textbook Solutions PDF for Class 7th Social Studies
- AP Board Class 7
- AP Board Class 7 Social Studies
- AP Board Class 7 Social Studies 1st Lesson The Universe and The Earth
- AP Board Class 7 Social Studies 2nd Lesson Forests
- AP Board Class 7 Social Studies 3rd Lesson Learning Through Maps
- AP Board Class 7 Social Studies 4th Lesson Delhi Sultanate
- AP Board Class 7 Social Studies 5th Lesson Kakatiya Kingdom
- AP Board Class 7 Social Studies 6th Lesson Vijayanagara Empire
- AP Board Class 7 Social Studies 7th Lesson Mughal Empire
- AP Board Class 7 Social Studies 8th Lesson Bhakthi Sufi
- AP Board Class 7 Social Studies 9th Lesson Indian Constitution
- AP Board Class 7 Social Studies 10th Lesson State Government
- AP Board Class 7 Social Studies 11th Lesson Road Safety Education
- AP Board Class 7 Social Studies 12th Lesson Markets Around Us
- AP Board Class 7 Social Studies 13th Lesson Women Change the World
- AP Board Class 7 Social Studies Chapter 1 విశ్వం మరియు భూమి
- AP Board Class 7 Social Studies Chapter 2 అడవులు
- AP Board Class 7 Social Studies Chapter 3 పటాల ద్వారా అధ్యయనం
- AP Board Class 7 Social Studies Chapter 4 ఢిల్లీ సుల్తానులు
- AP Board Class 7 Social Studies Chapter 5 కాకతీయ రాజ్యం
- AP Board Class 7 Social Studies Chapter 6 విజయనగర సామ్రాజ్యం
- AP Board Class 7 Social Studies Chapter 7 మొఘల్ సామ్రాజ్యం
- AP Board Class 7 Social Studies Chapter 8 భక్తి – సూఫీ
- AP Board Class 7 Social Studies Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం
- AP Board Class 7 Social Studies Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం
- AP Board Class 7 Social Studies Chapter 11 రహదారి భద్రత
- AP Board Class 7 Social Studies Chapter 12 మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు
- AP Board Class 7 Social Studies Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు
- AP Board Class 7 Social Studies Chapter 1 Reading Maps of Different Kinds
- AP Board Class 7 Social Studies Chapter 2 Rain and Rivers
- AP Board Class 7 Social Studies Chapter 3 Tanks and Ground Water
- AP Board Class 7 Social Studies Chapter 4 Oceans and Fishing
- AP Board Class 7 Social Studies Chapter 5 Europe
- AP Board Class 7 Social Studies Chapter 6 Africa
- AP Board Class 7 Social Studies Chapter 7 Handicrafts and Handlooms
- AP Board Class 7 Social Studies Chapter 8 Industrial Revolution
- AP Board Class 7 Social Studies Chapter 9 Production in a Factory A Paper Mill
- AP Board Class 7 Social Studies Chapter 10 Importance of Transport System
- AP Board Class 7 Social Studies Chapter 11 New Kings and Kingdoms
- AP Board Class 7 Social Studies Chapter 12 The Kakatiyas
- AP Board Class 7 Social Studies Chapter 13 The Kings of Vijayanagara
- AP Board Class 7 Social Studies Chapter 14 Mughal Empire
- AP Board Class 7 Social Studies Chapter 15 Establishment of the British Empire in India
- AP Board Class 7 Social Studies Chapter 16 Making of Laws in the State Assembly
- AP Board Class 7 Social Studies Chapter 17 Implementation of Laws in the District
- AP Board Class 7 Social Studies Chapter 18 Caste Discrimination and the Struggle for Equality
- AP Board Class 7 Social Studies Chapter 19 Livelihood and Struggles of Urban Workers
- AP Board Class 7 Social Studies Chapter 20 Folk Religion
- AP Board Class 7 Social Studies Chapter 21 Devotional Paths to the Divine
- AP Board Class 7 Social Studies Chapter 22 Rulers and Buildings
0 Comments:
Post a Comment